నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts

Feb 18, 2009

నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక

గౌళ
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా. IIపల్లవిII


కొంకక నేనే నీకొంగు వట్టి తీసితేను

అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా

మంకుల నెన్ని సేసినా మగవాని కమరును

జంకించి యాఁటదానికి చలివాయఁ జెల్లునా. IIనీ చిII


వొద్దనుండి నిన్నుఁ జూచి వూరకే నే నవ్వితేను

అద్దో యిదెంతగబ్బి యనకుండేవా

కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడనీ కమరు

చద్ది బింకము రాణివాసములకుఁ దగునా. IIనీ చిII


ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా

కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె

మించిన పట్టపుదేవి మేర మీఁర జెల్లునా. IIనీ చిII౧౪-౩౫౦

1 comments

Feb 1, 2009

చల్లరే హరిపై జాజరజాజ

శంకరాభరణం
చల్లరే
హరిపై జాజరజాజ
చల్లఁగా సరసపు జాజరజాజ. IIపల్లవిII

సతతపు వలపుల జాజరజాజ
చతురలమాటల జాజరజాజ

సతమగు నవ్వుల జాజరజాజ

జతనపు సిగ్గుల జాజరజాజ. IIచల్లII


సముకపు కొసరుల జాజరజాజ
సమరతికరఁగుల జాజరజాజ

జమళి తమకముల జాజరజాజ

సమయని యాసల జాజరజాజ. IIచల్లII


జడియని పంతపు జాజరజాజ

సడఁగుల చేఁతల జాజరజాజ

జడిగొనుచెమటల జాజరజాజ

జడగొను పెనఁగుల జాజరజాజ. IIచల్లII


చలముల వొట్ల జాజరజాజ
సలిగెలపగటుల జాజరజాజ

చలువల వినయపు జాజరజాజ

సళుపుల చూపుల జాజరజాజ. IIచల్లII


సంగడి మూఁకల జాజరజాజ

జంగిలి మతకపు జాజరజాజ

సంగాత మమరిన జాజరజాజ

సంగతి యెరికల జాజరజాజ. IIచల్లII

సారపు మోవుల జాజరజాజ
సారెకుఁ బొలసేటి జాజరజాజ

సౌరుచి మెచ్చుల జాజరజాజ

జారతనంబుల జాజరజాజ. IIచల్లII


సందడి కొలువుల జాజరజాజ
సందుల వొత్తుల జాజరజాజ

చందురు పాటల జాజరజాజ

సందె చీఁకటుల జాజరజాజ. IIచల్లII


చాలుకొను సతుల జాజరజాజ
జాలి
విరహముల జాజరజాజ
చాలామరిగిన జాజరజాజ

చౌలూరించే జాజరజాజ. IIచల్లII


చనుఁగవ గురుతుల జాజరజాజ
చనవుల కొసరుల జాజరజాజ

యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ
డీతని
చనుమానంబుల జాజరజాజ. IIచల్లII ౨౮-౩౧౯


అన్నమయ్య జాజర పాటలలో ఇది ఒకటి. ఈ సంకీర్తనలో మూడు కంటే ఎక్కువ చరణాలు ఉన్నవి.
జాజ అనే పదం జాజరపదంపై పాటలోని లయకోసం వాడేరేమో అనుకుంటున్నాను.

0 comments

Jan 31, 2009

అమరెఁ గదె నేఁ డన్నిసొబగులును

Get this widget | Track details | eSnips Social DNA


దేవగాంధారి
అమరెఁ
గదె నేఁ డన్నిసొబగులును
సమరతి చిన్నలు సతి నీమేనా. IIపల్లవిII

చెలపల చెమటలు చెక్కిళ్ళ
మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుకలు చొక్కిళ్ళు
తొలఁగని యాసలు తొక్కిళ్ళా. IIఅమII

నెఱవగు చూపులు నిక్కిళ్ళ
మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ
తఱచగు వలపులు దక్కిళ్ళా . IIఅమII

నును గోరికొనలు నొక్కిళ్ళ
పొనుఁగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీవేంకటపతికాఁగిట
యెనసెను పంతము లెక్కిళ్ళా. IIఅమII ౨౮-౪౧౯

అలమేలుమంగకు అన్ని సొగసులూ నే డామె శరీరం మీదే అమరియున్నవట. ఆ సొగసులు ఏమిటటా--శ్రీవేంకటేశ్వరునితో సమరతిలో పాల్గొన్నప్పటి చిన్నెలేనట- ఆపె శరీరం మీదనున్నసొబగులు. అవేంటంటేనటా--

చెక్కిళ్ళ మీదుగా కారుతున్న చెమటల కాలువలు
పెదాలపై అంకురిస్తున్న నవ్వుల ముష్కరత్వము
పారవశ్యపు వేడుకలతోని బుగ్గల పై పడే చొట్టలు
తొలగని ఆసలతో కూడిన మల్లబంధ విశేషములు

గర్వముతో చుట్టూ పరివ్యాప్తమై ఉన్న చూపులు
అతిశయించిన మోహముతో మెరుస్తున్న మెరుపులు
గుర్తుగా పెదవులమీద పెట్టబడిన నొక్కులు
ఆమెకు దక్కిన తఱచైన శ్రీనివాసుని వలపులు

వాడియైన గోరి కొనలవలన ఏర్పడిన నొక్కులు
పుక్కిలిలోని నిస్తేజమైన తాంబూలము(రసము మ్రింగగా మిగిలిన?)
గొప్పవాడైన శ్రీవేంకటపతి కౌగిలిలో నుండి
ఒకరితో నొకరికి సరిపోయిన పంతములు.

నాకు చాలా పదములకు అర్థములు పూర్తిగా తెలియలేదు. తప్పులు దొర్లి ఉండొచ్చు నను కుంటున్నాను. ఎవరైనా వివరిస్తే కృతజ్ఞుడిని.

0 comments

Jan 15, 2009

దైవకృతమెవ్వరికిఁ దప్పింపరాదనుచు

శ్రీరాగం
దైవకృతమెవ్వరికిఁ దప్పింపరాదనుచు
భావించి జనులాడుపలుకునిజమాయ. IIపల్లవిII

కందునకుఁ బెడఁబాసి చందురుఁడింతి ముఖ-
చందురుఁడైన నది అందును గలిగె
కందువగు చెలినొసలి కస్తురితిలకమను-
కందు ముఖచంద్రునకుఁ గడునందమాయ. IIదైవII

జలజములు శశిచేతనులికి యీ కాంతకుచ-
జలజంబులైన నది సరుసనే కలిగె
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున
విలువ సేయఁగరాని విదియచందురులు. IIదైవII

తీగె బహుజలములకుఁ దెమలి కామినిమేనుఁ-
దీగె యయ్యిన నదియుఁ దిరుగ మరి కలిగె
ఈ గతులఁ దిరువేంకటేశ్వరుని సమసురత-
యోగంబువలన ఘర్మోదకశ్రీలు. IIదైవII ౫-౧౩౪

0 comments

Jan 5, 2009

పొద్దిఁక నెన్నఁడు వొడుచునొ పోయిన చెలి రాదాయెను

Get this widget | Track details | eSnips Social DNA


సామంతం
పొద్దిఁక నెన్నఁడు వొడచునొ పోయిన చెలి రాదాయను
నిద్దుర గంటికిఁ దోఁపదు నిమిషంబొకయేఁడు. IIపల్లవిII

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును
విన్నఁదనంబుల మఱపులు వేడుకమీరిన యలపులు
సన్నపుఁ జెమటలుఁ దలఁచిన ఝల్లనె నామనసు. IIపొద్దికII

ఆఁగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
ధోఁగియుఁ దోఁగనిభావము దోఁచిన పయ్యెదయు
కాఁగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు(?)
వేఁగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని. IIపొద్దికII

ధేవశిఖామణి తిరుమలదేవునిఁ దలఁచినఁ బాయక
భావించిన యీ కామిని భావములోపలను
ఆవిభుఁడే తానుండిఁక నాతఁడె తానెఱఁగఁగవలె
నీ వెలఁదికిఁ గల విరహంబేమని చెప్పుదము. IIపొద్దికII౫-౧౩౮

0 comments

Jan 3, 2009

ప్రతిలేని పూజ దలఁపఁగఁ గోటిమణుఁగులై


శ్రీరాగం
ప్రతిలేని పూజ దలఁపఁగఁ గోటిమణుఁగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయ. IIపల్లవిII

మానినీమణి మనసు మంచి యాసనమాయ-
నానందబాష్పజలమర్ఘ్యాదులాయె-
మీనాక్షికనుదోయి మించుదీపములాయ-
నాననసుధారసంబభిషేకమాయ. IIప్రతిII

మగువ చిరునవ్వులే మంచిక్రొవ్విరులాయ
తగుమేనితావి చందనమలఁదుటాయ
నిగనిగని తనుకాంతి నీరాజనంబాయ
జగడంపుటలుకలుపచారంబులాయ. IIప్రతిII

ననుపైన పొందులే నైవేద్యతతులాయ
తనివోని వేడుకలు తాంబూలమాయ
వనిత తిరువేంకటేశ్వరుని కౌఁగిటఁజేయు-
వినయవివరంబులరవిరిమొక్కులాయ. IIప్రతిII౫-౩౦౧

0 comments

Dec 25, 2008

ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మఱి

ముఖారి
ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిది గాక వైభవం బిక నొకటి గలదా. IIపల్లవిII

అతివ జన్మము సఫలమై పరమయోగివలె-
నితర మోహాపేక్షలిన్నియును విడిచె
సతికోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞానవాసనలవోలె నుండె. IIఇదిII

తరుణి హృదయము కృతార్థతఁ బొంది విభుమీఁది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయె.IIఇదిII

శ్రీవేంకటేశ్వరునిఁ జింతించి పరతత్త్వ-
భావంబు నిజముగాఁ బట్టె చెలి యాత్మ
దేవోత్తమునికృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు తిరమాయ.IIఇదిII౧౨-౧౭

0 comments

Dec 14, 2008

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని

Get this widget | Track details | eSnips Social DNA


మంగళకౌశిక
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు(యకును?) నీరాజనం. IIపల్లవిII

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపునీరాజనం
అలివేణితురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం. IIక్షీరాII

చరణకిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేలనీరాజనం
అరిదిజఘనంబునకు నతివనిజ(నత?)నాభికిని
నిరతి నానావర్ణనీరాజనం. IIక్షీరాII

పగటు శ్రీవేంకటేశుపట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁ దనముల కెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం. IIక్షీరాII ౨౦-౨౯౫

0 comments

సేవింపరో జనులాల చేరి మొక్కరో



సాళంగనాట
సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాఁ డిందరిభాగ్యమువలెను. IIపల్లవిII

జలకమాడి వున్నాఁడు సర్వేశ్వరుఁడు నిగ్గు-
గలిగిన మంచి నల్లకలువవలె
యెలమిఁ గప్పురకాపు ఇదె చాతుకున్నవాఁడు
వెలలేనియట్టి పెద్దవెండికొండవలెను. IIసేవింII

అందముగఁ దట్టుపుణుఁ గలదుక వున్నవాఁడు
కందువ ఇంద్రనీలాలగనివలెను
ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాఁడు
పొందినసంపదలకు పుట్టినిల్లువలెను. IIసేవింII

మించి యలమేలుమంగ మెడఁ గట్టుకున్నవాఁడు
పొంచి బంగారుతామెరపువ్వువలెను
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె కొలువై వున్నవాఁడు
నించినదాసులపాలినిధానమువలెను. IIసేవింII ౨౦-౪౦౬

0 comments

Dec 12, 2008

లాలనుచు నూచేరు లలనలిరుగడల

Get this widget | Track details | eSnips Social DNA
http://www.esnips.com/adserver/?action=visit&cid=file_imesh&url=http://www.imesh.com/downloadmusic/?appid=142
అన్నమయ్య లాలి

శ్రీరాగం జంపెతాళం

లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవరగోపాల నినుఁ జాల. IIపల్లవిII

ఉదుటుగుబ్బల సరము లుయ్యాల లూఁగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోఁగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీఁగ
ముదురు చెమటల నళికములు తొప్పఁదోఁగ. IIలాలిII

సొలపు తెలిగన్నుఁగవ చూపు లిరువంక-
మలయు రవళులకుఁ బలుమాఱును బెళంక
కొలఁది కోవిల గములు క్రోలు మదనాంక-
ములఁ గ్రేణిసేయు రవములు వడిఁ దలంక. IIలాలిII

సరసపదములు జంగచాఁపుచేఁ బాయ
గురులీల మీఁగాళ్లఁ గుచ్చెళ్ళు రాయ
కరమూలముల కాంతి కడుఁజాయఁ జేయ
సరస నురుకుసుమవాసన లెదురు డాయ. IIలాలిII

కొలఁది నునుమేను లతకూన లసియాడ
మెలఁకువతొ నొకరొకరి మెచ్చి సరిగూడ
తలలూఁచి చొక్కి చిత్తరుబొమ్మ లాడ
అలరి యెల్లరు మోహనాకృతులు చూడ. IIలాలిII

లలిత తాంబూలరస కలితంబులైన-
తళుకుదంతములు కెంపులగుంపు లీన
మొలకవెన్నెల డాలు ముసురుకొని లోన
చెలఁగి సెలవుల ముద్దుచిఱునవ్వు లాన. IIలాలిII

మలయమారుత గతులు మాటికిఁ జెలంగ
పలుకుఁగపురపుతావి పై పై మెలంగ
బలు గానలహరి యింపుల రాల్గరంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగ. IIలాలిII

లలనా జనాపాంగ లలితసుమచాప
జలజలోచన దేవ సద్గుణకలాప
తలఁపులోపల మెలఁగు తత్త్వప్రదీప
భళిర గండవరేశ పరమాత్మరూప ! IIలాలిII

0 comments

ఉయ్యాలా బాలునూఁచెదరు కడు-

శంకరాభరణం
ఉయ్యాలా బాలునూఁచెదరు కడు-
నొయ్య నొయ్య నొయ్యనుచు. IIపల్లవిII

బాలయవ్వనలు పసిఁడివుయ్యాల
బాలునివద్దఁ బాడేరు
లాలి లాలి లాలెమ్మ యెల్ల
లాలి లాలి లాలి లాలనుచు. IIఉయ్యాII

తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల
పమ్ముఁ జూపులఁ బాడేరు
కొమ్మల మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు.IIఉయ్యాII

చల్లుఁజూపుల జవరాండ్లు రే-
పల్లెబాలునిఁ బాడేరు
బల్లిదు వేంకటపతిఁ జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు.IIఉయ్యాII౫-౨౪౬

0 comments

Dec 10, 2008

సగము మానిసి రూపు సగము మెగము రూపు

నాట
సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణితప్రతాపుఁ డహోబలేశుఁడు. IIపల్లవిII

గద్దెమీఁద గూచున్నాఁడు కంబములోఁ బుట్టినాఁడు
కొద్దిమీరఁ గడునవ్వుకొంటా నున్నాఁడు
వొద్దనె శ్రీసతిసన్ను లొరయుచు నున్నవాఁడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుఁడు. IIసగII

పెనుమీసాలవాఁడు పెదపెదగోళ్ళవాఁడు
ఘనునిఁగాఁ బ్రహ్లాదునిఁ గాచుకున్నాఁడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాఁడు
అనుపమతేజుఁడమ్మ అహోబలేశుఁడు. IIసగII

వేవేలుచేతులవాఁడు వెన్నెలచాయలవాఁడు
భావించి కొల్చినవారిపాలిటివాఁడు
శ్రీవేంకటగిరిమీఁదఁ జేరి భవనాశిదండ
నావల నీవల మించె నహోబలేశుఁడు.IIసగII౧౮-౨౦౯

0 comments

Dec 9, 2008

సంగడికి రాగఁదవే సరిచూచేను

శ్రీరాగం
సంగడికి రాగఁదవే సరిచూచేను
యింగిత మెరుఁగుకొంటే నిద్దరికిఁ గూడెను. IIపల్లవిII

తుంమి(తుమ్మిఁ)దలు వ్రాయఁబోతే తొయ్యలి నీ తురుమాయ
నెమ్మిఁ జందురువా(వ్రా?)సితే నీమోమాయనే
వుమ్మడి సంపెంగ వ్రాయ నున్నతి నాసికమాయ
కమ్మఁగలువలు వ్రాయఁ గన్నులాయను. IIసంగII

గక్కన శంఖము వ్రాయఁ గన్నెరో నీగళమాయ
జక్కవల వ్రాయఁగా నీచన్నులాయను
అక్కరఁ దామరలు వ్రాయఁగా నీకరములాయ
నిక్కి సింహము వ్రాయఁగా నీనడుమాయను. IIసంగII

పులినము వ్రాయఁగాను పొలఁతి!నీపిరుఁదాయ
తెలియ నరఁటులు వ్రాసితేఁ దొడలాయ
కలసితివి శ్రీ వేంకటేశ్వరుఁడనుఁ దాను
బలుచిగురులు వ్రాయఁ బాదాలాయను. IIసంగII ౧౮-౪౪౭


పులినము=ఇసుకదిన్నె,సైకతము.

0 comments

Dec 5, 2008

ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు

పాడి
ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు
మల్లాడి తా వలెనంటే మైకొనే నపుడు. IIపల్లవిII

మనసు నిర్మలమైతే మాట విన నింపౌను
ననుపు గలవారికి నవ్వ నింపౌను
చనవు గలిగితేను సాదించ నింపౌను
యెనయని చోటికి నేమిటికి మాటలు. IIఉల్లముII

తలయెత్తి చూచితేను దండకు రా నింపౌను
చెలిమి సేసితే విందు చెప్ప నింపౌను
పిలుపు గలిగితేను పెనఁగఁగ నింపౌను
వొలిసి నొల్లమికిని వొడి వట్ట నింపౌను. IIఉల్లముII

కరఁగి లోనైతేను కాఁగిలించ నింపౌను
సరస మాడితే చెయి చాఁచ నింపౌను
యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్నుఁ గూడె
తరితీపై నందుకు తామసించ నేటికే. IIఉల్లముII ౧౬-౮

0 comments

Dec 4, 2008

నీలోని మతకాలు నే నెఱఁగనా

నారాయణి
నీలోని మతకాలు నే నెఱఁగనా
పోలించి సరివచ్చితే బొంకఁ జోట్లేవి. IIపల్లవిII

సొలవక మగవాఁడు చూచినయంతటిలోనె
తలఁపు దెలియనిది తరుణా యది
పలికినంతటిలోనె భావముఁ దెలియకున్న
నెలకొన్న యాటదాని నేరు పెల్లా నేది. IIనీలోనిII

యెదుట నిలిచితేనే యింగితాకారము లెల్ల
తుద నేర్పరచనిది తొయ్యలా యది
కదిసేయాసందిలోనే కలయిం చెఱఁగకున్న
దరాన మానినుల జాణతనమేది. IIనీలోనిII

చేముట్టి నంతటిలోనే శ్రీవేంకటేశ్వరుఁడ
నీమనసు గనకున్న నెలఁతా యది
కామించి కూడితివి యీకందు విట్టి దనకున్న
వేమరు మావంటివారివివేక మేది. IIనీలోనిII ౧౬-౨౯౧

0 comments

ఇక్కడ నక్కడ సరే యెందాయ నేమి

నారాయణిదేసాక్షి
ఇక్కడ నక్కడ సరే యెందాయ నేమి
మిక్కిలిచెలియపొందు మేలు నీకు రావయ్యా. IIపల్లవిII

తమితోడఁ బాలసముద్రముమీఁదఁ బవళించి
విమలుఁడవై యుండేటివేడుక కాఁడ
చెమటలసముద్రము చెలిమేన నున్న దిదె
ప్రమదాన నీవు నేఁడు పవళింతు రావయ్యా. IIఇక్కడII

చెలఁగి యాకసమెల్లా శ్రీపాదముననే
కొలచుకొంటా నుండేటికోడెకాఁడ
నలువున నీయింతినడిమియాకస మిదె
కొలఁది మిగుల నిట్టె కొలతు రావయ్యా. IIఇక్కడII

శ్రీవేంకటేశుఁడవై చిత్తగించి కొమ్మతో
యీవలఁ గొండపై నుండేటియెమ్మెకాఁడ
తావి నలమేల్మంగ తగుఁగుచగిరు లివి
వోవరిఁ గూడితి విందే వుందు విట్టే రావయ్యా. IIఇక్కడII ౧౬-౩౦౦


చెలి మేని మీఁద చెమటల సముద్రమే ఉందట.అదీ పాలసముద్రము లాంటిదే నట.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితేనేమి అందుకని చెలిమేననే పవళింతువు రావయ్యా-ఇదో చమత్కారం.
ఆకాసాన్ని నీ శ్రీపాదంతో కొలుస్తూ ఉంటావు కదయ్యా.నీ యింతి నడుమే ఓ ఆకాసం కాదుటయ్యా.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితేనేమి అందుకని చెలి నడుమునే కొలచుదువుగాని రావయ్యా-ఇదింకో చమత్కారం.
నీ కొమ్మతో(స్త్రీతో)కొండపైనే నివసిస్తున్న యెమ్మెకాడవు కదయ్యా.నీ యింతి అలమేల్మంగ కుచములు కూడా కొండల లాంటివే కదా.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితే నేమి అందుకని చెలి కుచముల మీద ఇట్టే పరుందువుగాని రావయ్యా.-ఇదింకో చమత్కారం.
అన్నమయ్య ఊహలకి రెక్కలొచ్చినపుడు పరాకాష్టలో వెలువడిన ఆణిముత్యాల్లో ఇదొకటి.

0 comments

Dec 2, 2008

కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి

ఆహిరి
కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి
తలపోసితే నీకు తరితీపు వంటిది. IIపల్లవిII

ఆసతోఁ జూచిన చూపు యంటు బచ్చలి వంటిది
పాసికూడినచూపు పండువంటిది
లాసి లాసి చూచేచూపు లాగవేగము వంటిది
సేసవెట్టి చూచేచూపు చిగిరింపు వంటిది. IIకలికిII

అల్లార్చి చూచినచూపు అట్టె గాలము వంటిది
చల్లుఁ జూపు కప్రపువాసన నంటిది
చిల్లరనాఁటుఁజూపులు చిమ్ముఁ దేనెలువంటివి
వెల్లవిరిఁ జూచేచూపు నిడుగూళ్ళవంటివి. IIకలికిII

మునుకొని చూచేచూపు మోహపుమొక్కు వంటిది
వినయపుఁ జూపు మోవివిందు వంటిది
యెనసె శ్రీవేంకటేశ యిన్నిటాను నిన్ను నీకె
తనిసిన నాచూపు తారుకాణ వంటిది. IIకలికిII
౧౬-౪౭౯

0 comments

Nov 10, 2008

ఇప్పుడిఁక నడుగరే యేమనీని

బౌళి
ఇప్పుడిఁక నడుగరే యేమనీని
రెప్ప లెత్తి చూడకుంటే రేపే మాపాయను IIపల్లవిII

అప్పటినుండియు విభుఁడక్కడనే వుండఁగాను
కప్పురము నోటికి కారమై తోఁచె
చిప్పిలుఁ దనమాటలు చెవులుసోఁకకుండఁగా
దప్పికిఁ గొన్న పన్నీరు తానే వుడుకాయను. IIఇప్పుII

నగుతా నాతోఁ దాను నంటు చూపకుండఁ గాను
పొగరుఁ గస్తురిపూత పోగులాయను
పగటునఁ బాన్పుపైఁ దాఁ బవ్వళించకుండఁ గాను
జిగిఁ గట్టిన చెంగావిచీరే వెట్టాయను. IIఇప్పుII

శ్రీవేంకటేశ్వరుఁడు చేతికి లోనుగాఁగా
వేవేలు భోగములు వేడుకాయను
యీవేళఁ దా నన్నుఁ గూడి ఇన్నిటా మన్నించఁ గాను
కావలసిన పనులు కడు మంచివాయను. IIఇప్పుII
౧౪-౧౪౭

0 comments

Nov 9, 2008

నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక

గౌళ
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా IIపల్లవిII

కొంకక నేనే నీ కొంగు వట్టి తీసితేను
అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా
మంకుల నెన్ని సేసినా మగవాని కమరును
జంకించి యాఁటదానికి చలివాయఁ జెల్లునా. IIనీ చిత్తII

వొద్దనుండి నిన్నుఁజూచి వూరకే నే నవ్వితేను
అద్దో యిదెంతగబ్బి యనకుండేవా
కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడ నీ కమరు
చద్ది బింకము రాణివాసములకుఁ దగునా. IIనీ చిత్తII

ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె
మించిన పట్టపుదేవి మేర మీరఁ జెల్లునా. IIనీ చిత్తII ౧౪-౩౪౯


నేను నీ చిత్తము వచ్చిన విధంగా నడుచుటే - కాక, అంతకన్నా అతిశయించి సిగ్గు విడచుట ఇల్లాలయిన దానికి తగునా?
కొంకక నే నీ కొంగు పట్టి తీసితే నన్ను "ఇదెంత గయ్యాళి" అని అనకపోయేవా? మంకుదనంతో ఎన్ని చేసినా మగవాడిని కనక నీకూ అమరుతుంది.కాని ఆడదానిని కాబట్టి నాకు బెదిరించి బుజ్జగించ చెల్లుతుందా?
నేను నీ దగ్గరనుండి వూరకే నవ్వితే- "అబ్బో, యిదెంత గబ్బిది" అని అనకపోయేవా? కొంచెం అటూఇటూ ఎటుండినా కోడెకాడవు కాబట్టి నీకు సరిపోతుంది.కాని రాణివాసంలో ఉండేవారికి అలా బింకముగా నుండుట వీలయ్యేనా?
అతిశయించి నేనే నీ కవుఁగిలి ముఖం ఎత్తిపెట్టి అడిగితే "ఇది యెంత దిట్ట"ది అని అనకుండేవా? ఇంతలో నీవే శ్రీవేంకటేశ్వరా నన్ను
కూడితివి. పట్టపు దేవినైన నాకు మేర మీరుటకు చెల్లుతుందా?

0 comments

Nov 6, 2008

కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁగాక

ఆహిరి
కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁగాక
నేమాన నేమి చేసినా నెంజెరివి దీరునా IIపల్లవిII

పలుమారు మాటలాడి పడఁతుల వలపించి
యెలయించే రమణుని నేమి సేసేది(దే?)
పిలిచి పానుపుమీఁద బెనఁగఁగానే చన్నుల
నెలకొనఁ గుమ్మినాను నెంజెరివి దీరునా IIకోమII

నగుతా దగ్గరఁ దీసి నాలిసేసి యేఁచేటి
యెగసక్కెపు విభుని నేమి సేసేదే
మొగము చూడఁగానే ముంగురులు చుట్టి పట్టి
నిగిడి గోర గీరినా నెంజెరివి దీరునా IIకోమII

మట్టు మీరి నన్ను గూడి మరులుగొలిపినట్టి
యిట్టి శ్రీవేంకటేశ్వరు నేమి సేసేదే
గట్టిగా మోవియాని గంటిసేసి పలుమారు
నెట్టుకొని కొసరక నెంజెరివి దీరునా. IIకోమII౧౪-౧౭౦

నెంజెరివి=ఎదలోని తాపము

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks