సాళంగనాట
అప్పని వరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకె కలఁ డన్నమయ్యా IIపల్లవిII
అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
లంతటి వాఁ డు తాళ్ళపాకన్నమయ్యా IIఅప్పII
బిరుదు టెక్కెములుగా బెక్కు సంకీర్తనములు
హరిమీఁ ద విన్నవించె నన్నమయ్యా
విరివిగలిగినట్టి వేదముల యర్థమెల్లా
అరసి తెలిపినాఁ డన్నమయ్యా IIఅప్పII
అందమైన రామానుజాచార్యు మతమున
అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
విందువలె మాకును శ్రీవేంకటనాథుని నిచ్చె
అందరిలోఁ దాళ్ళపాక అన్నమయ్యా IIఅప్పII 10-23
ప్రాచీన గాథలు
3 days ago