నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 31, 2009

అమరెఁ గదె నేఁ డన్నిసొబగులును

Get this widget | Track details | eSnips Social DNA


దేవగాంధారి
అమరెఁ
గదె నేఁ డన్నిసొబగులును
సమరతి చిన్నలు సతి నీమేనా. IIపల్లవిII

చెలపల చెమటలు చెక్కిళ్ళ
మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుకలు చొక్కిళ్ళు
తొలఁగని యాసలు తొక్కిళ్ళా. IIఅమII

నెఱవగు చూపులు నిక్కిళ్ళ
మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ
తఱచగు వలపులు దక్కిళ్ళా . IIఅమII

నును గోరికొనలు నొక్కిళ్ళ
పొనుఁగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీవేంకటపతికాఁగిట
యెనసెను పంతము లెక్కిళ్ళా. IIఅమII ౨౮-౪౧౯

అలమేలుమంగకు అన్ని సొగసులూ నే డామె శరీరం మీదే అమరియున్నవట. ఆ సొగసులు ఏమిటటా--శ్రీవేంకటేశ్వరునితో సమరతిలో పాల్గొన్నప్పటి చిన్నెలేనట- ఆపె శరీరం మీదనున్నసొబగులు. అవేంటంటేనటా--

చెక్కిళ్ళ మీదుగా కారుతున్న చెమటల కాలువలు
పెదాలపై అంకురిస్తున్న నవ్వుల ముష్కరత్వము
పారవశ్యపు వేడుకలతోని బుగ్గల పై పడే చొట్టలు
తొలగని ఆసలతో కూడిన మల్లబంధ విశేషములు

గర్వముతో చుట్టూ పరివ్యాప్తమై ఉన్న చూపులు
అతిశయించిన మోహముతో మెరుస్తున్న మెరుపులు
గుర్తుగా పెదవులమీద పెట్టబడిన నొక్కులు
ఆమెకు దక్కిన తఱచైన శ్రీనివాసుని వలపులు

వాడియైన గోరి కొనలవలన ఏర్పడిన నొక్కులు
పుక్కిలిలోని నిస్తేజమైన తాంబూలము(రసము మ్రింగగా మిగిలిన?)
గొప్పవాడైన శ్రీవేంకటపతి కౌగిలిలో నుండి
ఒకరితో నొకరికి సరిపోయిన పంతములు.

నాకు చాలా పదములకు అర్థములు పూర్తిగా తెలియలేదు. తప్పులు దొర్లి ఉండొచ్చు నను కుంటున్నాను. ఎవరైనా వివరిస్తే కృతజ్ఞుడిని.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks