నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.. Show all posts
Showing posts with label కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.. Show all posts

Mar 18, 2009

వంద గేసు బండ ; వందకు బియ్యము

ఆ.వె.
వంద గేసు బండ ! వందకు - బియ్యము,
పప్పు, ఉప్పు, చింతపండు, నూనె !
ఇత్తు మీకు నేను - మీ ఓటు నాకేస్తె-
కోట్లు కూడఁ బెడుదు ! కుర్చి నెక్కి.

0 comments

Mar 17, 2009

ఫాక్టరిలకు కోత పరిశ్రమలకు మూత

ఆ.వె.
ఫాక్టరిలకు కోత పరిశ్రమలకు మూత
బడుగు కడుపు కోత బతుకు రోత
ఓటు వేసి నిన్ను ఓడింతు ! నీ వెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

0 comments

Mar 16, 2009

పవరు 'ఫ్రీ' గ నిత్తు పన్నెండు గంటలు

ఆ.వె.
పవరు 'ఫ్రీ' గ నిత్తు పన్నెండు గంటలు-
పగలు ; అనుచు బాబు వగలు పోవు
'పవరు' కొఱకె గాదె ? పలు బాస లిన్నెట్లు
కోట్లు కూడఁ బెడుతు ? కుర్చి నెక్కి.

2 comments

Mar 14, 2009

పవరు ఇండ్ల కిచ్చి పవరు పొందు కొఱకు

ఆ.వె.
పవరు ఇండ్ల కిచ్చి 'పవరు' పొందు కొఱకు
'పవరు కట్టు' పెడితి 'ఫాక్టరి' లకు
'పవరు' వుండొ ? వూడొ ? భవితలొ నేనెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

ఆ.వె.
ఎన్ని కలలు ప్రజకు ? యెన్నికలన్నచో
అన్ని కల్లలయ్యె ! అంద ఱొకటె !
వోటు వేయు వారి వోట్లతొ నే నెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

ఆ.వె.
మైళ్ళ కొలది నడిచె - పాద యాత్రలొ తాను,
కాళ్ళు బొబ్బ లెక్కె కాదె ! నిజము ! !
మైలు కొక్క కోటి పైనె మిగిలె ; నికెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

1 comments

Mar 12, 2009

ఇందిరమ్మ ఇళ్ళు వెతలకు లోగిళ్ళు

ఆ.వె.
ఇందిరమ్మ ఇళ్ళు, వెతలకు వాకిళ్ళు
కప్పు కప్పకుండ, అప్పు లయ్యె!
ఓట్లు పడునొ , పడవొ ! మోసమయ్యె! నెటుల
కోట్లు కూడఁ బెడుదు? - కుర్చి నెక్కి.

1 comments

Mar 10, 2009

ఫ్లెక్సు బోర్డులెన్నొ పెట్టుబడిగ పెట్టి

ఆ.వె.
ఫ్లెక్సు బోర్డులెన్నొ పెట్టుబడిగ పెట్టి
పార్టి సీటు కొఱకు పాటుఁ బడితి
(కోడు కూసె నంచు కమిషనన్ని పెఱికె)
పార్టి సీటు కూడ పాఱలే దెట్లు నే
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.

0 comments

వ్యక్తి గుణము కాదు అతని సేవయుఁ గాదు

ఆ.వె.
వ్యక్తి గుణము కాదు అతని సేవయుఁ గాదు
డబ్బు ఖర్చు సేయు డాబు యొకటె
పార్టి సీటు కొఱకు పలుకు బడగు నెట్లు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.

ఆ.వె.
నాలుగేండ్లు రేట్లు ఆలాగె విద్యుత్కు
ఉంచినాము; పెంచ కుంచి నాము
అటులె పెంచబోము అయిదు వత్సరములు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.

0 comments

Mar 9, 2009

గేసు బండ నిత్తు గేసు కాదు నిజము

ఆ.వె.
గేసు బండ నిత్తు గేసు కాదు నిజము
బండ విలువ సగము భవిత నగును
అనుచు చంద్రబాబు ఆశ పెట్టె జనులకు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.

0 comments

ఆట వెలది యన్న అది అంత సులభమా!

ఆ. వె.
ఆట వెలది యన్న అది అంత సులభమా!
పాట పాడి నట్టె పలుకు నౌర!
మాకు నేర్పినట్టి మాన్యులు మీరయా!
చింత రామ కృష్ణ! వంత(చింత?) దీరె!

ఆ.వె.
దొంగ లంద ; రందు దొంగలకే దొంగ
రాజశేఖరెడ్డి రాణ కెక్కె
చంద్రబాబు దొంగ చంద్రశేఖరు దొంగ
కోట్లు కూడఁ బెట్రి కుర్చి నెక్కి.

0 comments

Mar 8, 2009

ఒకటి రెడ్ల పార్టి ఒకటి కమ్మ పార్టి

ఆ.వె.
ఒకటి రెడ్ల పార్టి ఒకటి కమ్మ పార్టి
కాపు పార్టి ఒకటి కాన రాదు

అనుచు పార్టి పెట్టె ఆ చిరంజీవియు

కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.


ఆ.వె.
వయిటు కార్డ్లు తనకు వోట్లు వర్షించని
ఎఱ్ఱ కార్డ్లు అన్నిఏఱి వేసె

పెరిగినట్టి ధరలు పీక కోయును గదా

కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.


ఆ.వె.
ఓట్ల కొఱకు '' ఫ్రీ" గ అన్ని చేసెదమంచు
పార్టి లన్ని చేయు ప్రామిసు లను

ఓటు వేయు దాక ఓడ మల్లన్నంద్రు

కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.

0 comments

తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు నెల,నెలా పేదలందరికీ డబ్బు పంచుతారట--వార్త.
ఆ.వె.
తెల్ల కార్డు నిత్తు, పల్లపు భూమిత్తు
కలరు టీవి నిత్తు, కాసు నిత్తు,
నాకు వోటు వేయి, నేను నీ కన్నిత్తు,
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీకి పార్లమెంటుకీ కూడా పోటీ చేస్తారట--వార్త

ఆ.వె.
రెండు చోట్ల పోటి రీతి గా దన్నావు,
నీతు లెల్ల చాల నెమకి నావు,
చెప్పు టొకట! జే. పి. చేయుట వేరెనా!
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

ఆ.వె.
చెప్పు మాట ఒకటి, చేయుట వేరోటి
నాదు మాట నీకె-నాకు కాదు
చెప్పు రంగ నీతి, చేరు దొమ్మ గుడిసె
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks