శంకరాభరణం
చల్లరే హరిపై జాజరజాజ
చల్లఁగా సరసపు జాజరజాజ. IIపల్లవిII
సతతపు వలపుల జాజరజాజ
చతురలమాటల జాజరజాజ
సతమగు నవ్వుల జాజరజాజ
జతనపు సిగ్గుల జాజరజాజ. IIచల్లII
సముకపు కొసరుల జాజరజాజ
సమరతికరఁగుల జాజరజాజ
జమళి తమకముల జాజరజాజ
సమయని యాసల జాజరజాజ. IIచల్లII
జడియని పంతపు జాజరజాజ
సడఁగుల చేఁతల జాజరజాజ
జడిగొనుచెమటల జాజరజాజ
జడగొను పెనఁగుల జాజరజాజ. IIచల్లII
చలముల వొట్ల జాజరజాజ
సలిగెలపగటుల జాజరజాజ
చలువల వినయపు జాజరజాజ
సళుపుల చూపుల జాజరజాజ. IIచల్లII
సంగడి మూఁకల జాజరజాజ
జంగిలి మతకపు జాజరజాజ
సంగాత మమరిన జాజరజాజ
సంగతి యెరికల జాజరజాజ. IIచల్లII
సారపు మోవుల జాజరజాజ
సారెకుఁ బొలసేటి జాజరజాజ
సౌరుచి మెచ్చుల జాజరజాజ
జారతనంబుల జాజరజాజ. IIచల్లII
సందడి కొలువుల జాజరజాజ
సందుల వొత్తుల జాజరజాజ
చందురు పాటల జాజరజాజ
సందె చీఁకటుల జాజరజాజ. IIచల్లII
చాలుకొను సతుల జాజరజాజ
జాలివిరహముల జాజరజాజ
చాలామరిగిన జాజరజాజ
చౌలూరించే జాజరజాజ. IIచల్లII
చనుఁగవ గురుతుల జాజరజాజ
చనవుల కొసరుల జాజరజాజ
యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ డీతని
చనుమానంబుల జాజరజాజ. IIచల్లII ౨౮-౩౧౯
అన్నమయ్య జాజర పాటలలో ఇది ఒకటి. ఈ సంకీర్తనలో మూడు కంటే ఎక్కువ చరణాలు ఉన్నవి.
జాజ అనే పదం జాజరపదంపై పాటలోని లయకోసం వాడేరేమో అనుకుంటున్నాను.
Feb 1, 2009
చల్లరే హరిపై జాజరజాజ
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment