నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label పద్య ప్రహేళిక. Show all posts
Showing posts with label పద్య ప్రహేళిక. Show all posts

Sep 21, 2009

నక్షత్రపుఁ బేరిటి చెలి, నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,

మొన్నటి పద్యప్రహేళికకు ఇంకా ఎవ్వరూ సమాధానం పంపలేదు. అందుకనే ఇంకో చిన్న క్లూ ను కూడా ఇద్దామనిపించింది.

ఓ చాటుకవి ఆ కావ్యాన్ని గుఱించి అలా అన్నాడట.
కం.

నక్షత్రపుఁ బేరిటి చెలి,

నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,

నక్షత్రమునకు రమ్మని,

నక్షత్రముఁ బట్టి యీడ్చె నక్షత్రేశున్.


ఇప్పటికైనా అర్థం అవుతుందనుకుంటాను.

3 comments

Sep 18, 2009

ఇది మనోహర కాంతి నింపైన బింబంబు, బింబంబు కాదిది బెడగు కెంపు

ఈ పద్యాన్నోసారి వీక్షించండి.

సీ.

ఇది మనోహర కాంతి నింపైన బింబంబు,

బింబంబు గా దిది, బెడగు కెంపు,

కెంపు గా దిది, తేఁటి యొంపని మంకెన,

మంకెన గా దిది, మంచి చిగురు,

చిగురు గా దిది, వింత జిగి హెచ్చు పగడంబు,

పగడంబు గా దిది, పానకంబు,

పానకం బిది గాదు, పలుచని చెఱకుపాల్,

చెఱకు పా లిది గాదు, కురజు తేనె,

గీ.
కురుజు తేనెయుఁ గా దిది, కుసుమ రసము,

కుసుమ రసమును గా దిది, గొనబు జున్ను,

జున్ను గా దిది, చవి గుల్కు సుధలదీని,

సుధల దీవియుఁ గా దిది సుదతి మోవి.,


ఎవరా సుదతి ? ఏమా కథ? ఏ కావ్యంలోని దీ పద్యప్రసూనం? ఎవరు వ్రాసిన కావ్యం అది ?

ఇటువంటి అందమైన పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతుంది ? అటువంటి ఆనందాన్ని పదుగురితో పంచుకోకుండా వుండ గలగటం ఎలా సాధ్యమో మీరే చెప్పండి.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks