శ్రీరాగం
సంగడికి రాగఁదవే సరిచూచేను
యింగిత మెరుఁగుకొంటే నిద్దరికిఁ గూడెను. IIపల్లవిII
తుంమి(తుమ్మిఁ)దలు వ్రాయఁబోతే తొయ్యలి నీ తురుమాయ
నెమ్మిఁ జందురువా(వ్రా?)సితే నీమోమాయనే
వుమ్మడి సంపెంగ వ్రాయ నున్నతి నాసికమాయ
కమ్మఁగలువలు వ్రాయఁ గన్నులాయను. IIసంగII
గక్కన శంఖము వ్రాయఁ గన్నెరో నీగళమాయ
జక్కవల వ్రాయఁగా నీచన్నులాయను
అక్కరఁ దామరలు వ్రాయఁగా నీకరములాయ
నిక్కి సింహము వ్రాయఁగా నీనడుమాయను. IIసంగII
పులినము వ్రాయఁగాను పొలఁతి!నీపిరుఁదాయ
తెలియ నరఁటులు వ్రాసితేఁ దొడలాయ
కలసితివి శ్రీ వేంకటేశ్వరుఁడనుఁ దాను
బలుచిగురులు వ్రాయఁ బాదాలాయను. IIసంగII ౧౮-౪౪౭
పులినము=ఇసుకదిన్నె,సైకతము.
Dec 9, 2008
సంగడికి రాగఁదవే సరిచూచేను
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment