ఆహిరి
కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి
తలపోసితే నీకు తరితీపు వంటిది. IIపల్లవిII
ఆసతోఁ జూచిన చూపు యంటు బచ్చలి వంటిది
పాసికూడినచూపు పండువంటిది
లాసి లాసి చూచేచూపు లాగవేగము వంటిది
సేసవెట్టి చూచేచూపు చిగిరింపు వంటిది. IIకలికిII
అల్లార్చి చూచినచూపు అట్టె గాలము వంటిది
చల్లుఁ జూపు కప్రపువాసన నంటిది
చిల్లరనాఁటుఁజూపులు చిమ్ముఁ దేనెలువంటివి
వెల్లవిరిఁ జూచేచూపు నిడుగూళ్ళవంటివి. IIకలికిII
మునుకొని చూచేచూపు మోహపుమొక్కు వంటిది
వినయపుఁ జూపు మోవివిందు వంటిది
యెనసె శ్రీవేంకటేశ యిన్నిటాను నిన్ను నీకె
తనిసిన నాచూపు తారుకాణ వంటిది. IIకలికిII ౧౬-౪౭౯
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
0 comments:
Post a Comment