నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 25, 2008

ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మఱి

ముఖారి
ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిది గాక వైభవం బిక నొకటి గలదా. IIపల్లవిII

అతివ జన్మము సఫలమై పరమయోగివలె-
నితర మోహాపేక్షలిన్నియును విడిచె
సతికోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞానవాసనలవోలె నుండె. IIఇదిII

తరుణి హృదయము కృతార్థతఁ బొంది విభుమీఁది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయె.IIఇదిII

శ్రీవేంకటేశ్వరునిఁ జింతించి పరతత్త్వ-
భావంబు నిజముగాఁ బట్టె చెలి యాత్మ
దేవోత్తమునికృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు తిరమాయ.IIఇదిII౧౨-౧౭

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks