గౌళ
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా. IIపల్లవిII
కొంకక నేనే నీకొంగు వట్టి తీసితేను
అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా
మంకుల నెన్ని సేసినా మగవాని కమరును
జంకించి యాఁటదానికి చలివాయఁ జెల్లునా. IIనీ చిII
వొద్దనుండి నిన్నుఁ జూచి వూరకే నే నవ్వితేను
అద్దో యిదెంతగబ్బి యనకుండేవా
కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడనీ కమరు
చద్ది బింకము రాణివాసములకుఁ దగునా. IIనీ చిII
ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె
మించిన పట్టపుదేవి మేర మీఁర జెల్లునా. IIనీ చిII౧౪-౩౫౦
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
1 comments:
నరసిమ్హాఖ్యుల దర్శనంబు వలనన్ నా కాంక్షలీడేరె నే
డరుదైనట్టి మహత్వ మబ్బినటులై యాకాంక్షలే మాసి సద్
వర భాషా పర భావవీధి నిలిచెన్ భవ్యంబుగా చిత్తమే
సరసుండా! కృప గాంచవయ్య. నను మీ సఖ్యున్ సదా సమ్మతిన్.
ఇట్లు
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు
19-02-2009
Post a Comment