శ్రీరాగం
ప్రతిలేని పూజ దలఁపఁగఁ గోటిమణుఁగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయ. IIపల్లవిII
మానినీమణి మనసు మంచి యాసనమాయ-
నానందబాష్పజలమర్ఘ్యాదులాయె-
మీనాక్షికనుదోయి మించుదీపములాయ-
నాననసుధారసంబభిషేకమాయ. IIప్రతిII
మగువ చిరునవ్వులే మంచిక్రొవ్విరులాయ
తగుమేనితావి చందనమలఁదుటాయ
నిగనిగని తనుకాంతి నీరాజనంబాయ
జగడంపుటలుకలుపచారంబులాయ. IIప్రతిII
ననుపైన పొందులే నైవేద్యతతులాయ
తనివోని వేడుకలు తాంబూలమాయ
వనిత తిరువేంకటేశ్వరుని కౌఁగిటఁజేయు-
వినయవివరంబులరవిరిమొక్కులాయ. IIప్రతిII౫-౩౦౧
యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
8 hours ago
0 comments:
Post a Comment