సాళంగనాట
సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాఁ డిందరిభాగ్యమువలెను. IIపల్లవిII
జలకమాడి వున్నాఁడు సర్వేశ్వరుఁడు నిగ్గు-
గలిగిన మంచి నల్లకలువవలె
యెలమిఁ గప్పురకాపు ఇదె చాతుకున్నవాఁడు
వెలలేనియట్టి పెద్దవెండికొండవలెను. IIసేవింII
అందముగఁ దట్టుపుణుఁ గలదుక వున్నవాఁడు
కందువ ఇంద్రనీలాలగనివలెను
ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాఁడు
పొందినసంపదలకు పుట్టినిల్లువలెను. IIసేవింII
మించి యలమేలుమంగ మెడఁ గట్టుకున్నవాఁడు
పొంచి బంగారుతామెరపువ్వువలెను
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె కొలువై వున్నవాఁడు
నించినదాసులపాలినిధానమువలెను. IIసేవింII ౨౦-౪౦౬
Dec 14, 2008
సేవింపరో జనులాల చేరి మొక్కరో
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment