నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 23, 2010

రామాయణం గుఱించి

                               శ్రీమద్రామాయణం
రామాయణం గురించి వ్రాద్దామనుకుంటుండగా భక్తి టి.వి.లో రామానంద్ సాగర్ గారి తెలుగు రామాయణ ప్రసారం మొదలయ్యింది. రామలక్ష్మణులు శబరి ఆశ్రమాన్నిదర్శించిన ఘట్టం ప్రసారమయ్యింది ఈరోజు. ఇలా ఈ పోస్టు ప్రారంభం కావటం ఓ శుభసూచన గా అన్పిస్తోంది నాకు.

రామాయణంలో సుందరకాండ ప్రాముఖ్యం గుఱించి ఎందరెందఱో ఎన్నెన్నో విధాలుగా చెప్తుంటారు. రామాయణ పారాయణాన్ని సుందర కాండతో ప్రారంభించాలని కూడా పెద్దలు చెప్తుంటారు. కాని ఎందువల్లనో తెలియదు 63 యేళ్ళు వచ్చినా కూడా ఇంతవరకూ నాకు సుందరకాండను వినే అదృష్టం కలగలేదు. కాకినాడలో మా స్నేహితుల ఇంటివద్ద శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సుందర కాండను గుఱించి చెప్తున్నారనితెలిసింది. తెలియటమే కాదు ఆ గృహస్థురాలు  మాయింటి ఆడవారికి ఫోనుచేసి నన్ను ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించారు కూడా.అది 5 రోజుల కార్యక్రమం.
మొదటి రోజు చివరి రోజు మాత్రమే వెళ్ళగలిగాను.మధ్యలో ఆఫీసు పనిమీద భాగ్యనగరానికి వెళ్ళటం చేత కార్క్రక్రమానికి వెళ్ళలేకపోయాను.చివరిరోజు కార్యక్రమానంతరం ఆయింటివారు అందరికీ గీతాప్రెస్సువారి సుందరకాండ పుస్తకాన్ని ఉచితంగా పంచిపెట్టారు.నాకూ ఓ కాపీ అందింది. దానిలో తెలుగు లిపిలో సంస్కృత శ్లోకం ఒకవైపునా దాని తెలుగు తాత్పర్యం ప్రక్కనే వచ్చేటట్లుగా రెండు వరుసల్లో ప్రింటింగు చేసారు.సంస్కృతం ఈ మధ్యన అధ్యయనం చేయటం
ప్రారంభించిన కారణంగా కొంచెం కొంచెం అర్థం అయ్యేది.మొదట్లో రోజుకు ఒక సర్గ కంటె ఎక్కువ చదవలేకపోయేవాడిని.
ఇప్పుడు నలభైయ్యోసర్గలో ఉన్నాను.కొంచెం వేగంగానే చదవగలుగుతున్నాను.రోజురోజుకీ చదువుతుంటే ఆనందం పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది.అది సుందరకాండ మాహాత్మ్యమేమో కూడా నాకు తెలియదు.

ఈ మధ్య బ్లాగుల్లోనే ఎక్కడో చదివిన విషయం ఒకటి గుర్తొస్తుంది.అది రామాయణ అనువాదాల గుఱించి.ఎంతోమంది కవులూ పెద్దలూ చాలా కాలంగా రామాయణాన్ని తెలుగులోనికి అనువాదం చేస్తూ వస్తున్నారు.వావిలికొలను సుబ్బారావు గారు మందరం పేరిట, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు,  వగైరా పండితులు,కవులూ యథావాల్మీకంగా రామాయణాన్నిపద్య గద్యాత్మకంగా అనువదించారు. కవిత్రయంలో ఒకరైన తిక్కనామాత్యుడు కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని వ్రాసాడు. అలాగే ఇంకా చాలామంది రామాయణాన్ని తెలుగు చేసారు.రంగనాథ రామాయణం, గోపీనాథం వేంకటకవి గారి గోపీనాథ రామాయణం మొల్లరామాయణం, భాస్కర రామాయణం విశ్వనాథ సత్యనారాయణ గారి   రామాయణ కల్పవృక్షం,ఉషశ్రీ రామాయణం ఆదిభట్ల నారాయణ దాసుగారి రామాయణం మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి. ఆటవెలది రామాయణం, ద్విపద రామాయణం ,మునిపల్లి సుబ్రహ్మణ్య కవిగారి అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో రూపాలలో రామాయణం ఆంధ్రీకరించబడింది. ద్విపద రామాయణం కూడా ఉన్నదని విన్నాను
దఱిమడుగు మల్లయ్యగారి రామాయణం కూడా ఒకటి ఉన్నది.

నేను చదివిన కామెంట్ ఏమిటంటే --యథావాల్మీకంగా అనువదించబడిన రామాయణ కావ్యాలకంటే కవుల స్వకపోల కల్పనలతోనిండి ఉన్న ఇతర రామాయణ కృతులకే తెలుగు వారు మొదటినుండీ పెద్దపీట వేస్తున్నారని.--ఇలా ఎందుకు జరుగుచున్నదని నాకు సందేహం కలిగి ఈ పోస్టు రాయటానికి పూనుకున్నాను. ఈ విషయంలో పెద్దల, విజ్ఞుల అభిప్రాయాలు తెలుసు
కోవాలనిపించింది. ఈ విషయమై ఇంకాముందుకు పోవటానికి ముందుగా అసలు తెలుగులో ఎన్ని రామాయణాలు ఎవరెవరు ఎప్పుడెపుడు ఏ ఏ రూపాల్లో వ్రాసారో తెలుసుకోవటం అత్యవసరం అనిపించింది.అందుకని పెద్దలందరూ వారి వారికి తెలిసిన రామాయణ గ్రంథాల్నిగుఱించి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ మొదటి భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.


         

8 comments

Sep 19, 2010

నా కోరిక

భాద్రపద శుద్ధ త్రయోదశి - సర్వధారి నామ సంవత్సరం - ఇది నా పుట్టిన తేదీ -


ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి - వికృతి నామ సంవత్సరం - ఇది నా 63 వ పుట్టిన తేదీ -
(నేను పుట్టినపుడు మా పెద్దలు వ్రాయించిన జాతకం కాగితంలోని వివరాల ప్రకారం.)
ఆ కాగితం వ్రాసిన ఆయన ఆంగ్ల తేదీని అందులో వ్రాయలేదు.
అందుకని ఎప్పుడూ ఆ తిథినాడే నా పుట్టిన రోజు జరుపుకుంటే బావుంటుంది కదాని నా కనిపించింది.
అవును, మనం మన అన్ని పండుగలనూ పబ్బాలనూ తెలుగు తిథుల ప్రకారమే జరుపు కుంటున్నాం కదా. మరి అటువంటప్పుడు మన పుట్టినరోజులను కూడా అదేవిధంగా తిథుల ప్రకారం ఎందుకు జరుపుకోకూడదు ?
ఒకప్పుడు మన కలన యంత్రాలలో ఆంగ్లభాషను మాత్రమే వాడేవాళ్ళం. కాని ఇప్పుడు మన తెలుగు భాషను కూడా ధారాళంగా వాడగలుగుతున్నాం కదా !
మన వాళ్ళలో చాలామంది కంప్యూటరు రంగంలో నిష్ణాతులైన వారెందరెందరో వున్నారు ! అటువంటప్పుడు మన కలన యంత్రాల్ని వారు తెలుగు సంవత్సరముల (ప్రభవ, విభవ మొ..60), తెలుగు నెలల(చైత్రము,వైశాఖము...12) , మరియు తెలుగు తేదీల (పాడ్యమి,విదియ ...మొ 15+15)వాలుపట్టీలు (dropdown boxes) కలదానినిగా ఎందుకు మార్చలేరు ?

అలా మార్చితే ఇంచక్కా అధికమాసాలొచ్చినప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన బ్రహ్మోత్సవాలను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటున్నట్లుగా మనం కూడా మన పుట్టిన రోజులను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుని ఆనందించవచ్చుగా.

అంతేకాదు

మనం మన పిల్లలను మన సంస్కృతీ సాంప్రదాయాలను మరచిపోకుండా ఉండే వారిగా కూడా
తీర్టి దిద్దుకోవచ్చు కదా ! అందర్నీ ఆలోచించమని ప్రార్థన .! క్రమ క్రమంగా మనం ఇప్పటినుండీ
ఇటువంటి కార్యక్రమాల్ని చేపడితే మన ముందు తరాల వారికి ఉపయోగం గా ఉంటుందని
నా అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో ఉండేవారు ఇంకా చాలామంది ఉండవచ్చుననే ఆశతో నేను
నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టును  ప్రచురిస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా
(ఆంగ్ల తేదీ ప్రకారం) శుభాకాంక్షలు తెలిపిన వారి కందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

6 comments

Sep 14, 2010

తిల్లాన - అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం - భాగ్యనగరంలో డిసెంబరు 24 - 26 వరకూ గచ్చిబౌలి స్టేడియంలో




0 comments

Jul 8, 2010

ప్ర ప రాప స మను సు ప్ర త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాజ్వ్య త్యవ ప

ప్రాది వళి నిరూపణము
క.
ప్ర ప రాప స మను సు ప్ర
త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాజ్వ్య త్యవ ప
ర్యుపసర్గ వింశతికి వళు
లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.
47

1.ప్ర - 2.పరా - 3.అప - 4.సమ్ - 5.అను - 6.సు - 7.ప్రతి - 8.అపి - 9.నిర్ - 10.దుర్ - 11.అధి - 12.ని - 13.ఉప - 14.అభి - 15.ఉత్ - 16.ఆజ్ - 17.వి - 18.అతి - 19.అవ - 20. పరి : ఇవి యిరువదియు నుపసర్గలు; ఇందు అప్యాజ్ అను నిరూపణ మప్రసిద్ధము. వీనిలో పరా, ఆజ్, అపి అన్నవి కాక మిగిలిన పదునేడును బరస్పర సంధి యైనప్పుడు స్వరయతి యైనను, వ్యంజనయతి యైనను బ్రయోగింప వచ్చును(ఛందోదర్పణము).

వీటి కన్నింటికీ ఉదాహరణలు క్రింది పద్యాలలో ఉన్నాయి.

శా.
ప్రారంభించు నశేషధర్మముల, సంపాదించు సత్కీర్తులన్            (ప్ర+ఆరంభించు  - పా)
బ్రారబ్ధంబులు నిర్వహించు ఫలర్యంతంబుగా నెప్పుడున్,           (ప్ర+రబ్ధంబులు - పరి+అంతము)
బ్రారబ్ధ ప్రతిలబ్ధ సంపదలచే రాగిల్లు నుల్లాసి యై,                      (ప్ర+ఆరబ్ధ - )
యీ రా జంచు నుతింతు రార్యు లిల విశ్వేశావనీవల్లభున్. 48       ( య+ - విశ్వ+శ )
తే. 
రిపుల విశసించు చోటఁ బరేతనాథుఁ,                                    ( ర+ - పర+తనాథు )
డుర్వి రక్షించుచోటఁ బరోభుజుఁడు                                    ( డ+ - పర+ఢ )
హుధనా వాప్తిచో ననపాయబుద్ధి,                                     ( - నను+అ+ఆయ )
యంతరరులకు నీ రా జపాయకరుఁడు. 49                             ( య్ +అంత - రాజు+అప+యకరుడు )


స్మయరహితంబు, వై భవమా గమ, మాహవధుర్యశౌర్య మ          ( స్మ - సమ్+ గమ )
వ్యయము, జయంబు విస్మయగ్రము, పాదవినమ్ర శాత్రవా         (  వ్య - సమ్+ గ్రము )
న్వయ పరిరక్షణం బభినవంబు, నయోచిత శాస్త్రవాచకా                 (శాత్రవాన్+య - వం )
న్వయనిపుణంబు చిత్త , మనయంబును విశ్వనరేంద్రభర్తకున్.         ( వాచకాన్+వయ -యంబు )
సీ.
సభావశీలి నిరంతరశ్రుతి శాలి I ర్థావబోధ నిర్గళుండు,
రాజన్యజన్య దురంత విక్రముఁడు దు, I వగాహవిద్యా విహారభూమి,
దానార్హ సంపదధ్యావాస మాయుధా I త వేదసశ్వదధ్యయనవేది
న్యాయ త ర్కాది నానాశాస్త్రకుతుకి వి I న్యస్తపూతార్థ మహాశయుండు. 42
ఆ.
ప్రచుర ఫలిత చతురుపాయాభిరాముఁ డు
పేంద్రభూపతనయుఁ డింద్రనిభుఁడు
భీమబలుఁడు జగదభీహిత శోభనా
భ్యర్థి విశ్వనాథుఁ వనివిభుఁడు. 43
క.
చంచలత లేక దానో I దంచితుఁ డగువిశ్వనాథ రణీశ్వరుచే
మించినసుకవీశ్వరుల దృ I గంచలముల మలయు సిరు లుదగ్రప్రీతిన్. 44
చ.
వ్యపగత దోషుఁ డవ్యసనర్గుఁ డుదంచిత మంత్రపంచక
వ్యపగతశత్రుమండలుఁ డయాన్వితుఁ డూర్జిత వైరిభూవర
ద్విపవరమత్త కేసరి యతీంద్రియఖేలనుఁ డార్య చర్యుఁ డ
త్యుపచితశౌర్యశాలి సుగుణోన్నతి విశ్వనరేంద్రుఁ డెప్పుడున్. 45
తే.
విశ్వ విశ్వంభరాసమా వేక్షణమున
డరు నీహిత బహుఫలావాప్తు లెల్లఁ ;
బ్రణతు లొనరింతు రఖిల పర్యంతనృపులు
ర్థి విశ్వేశ్వరునకుఁ బర్యాయగతుల. 46
పైన కొన్నింటిని విడదీసి వళులు గుర్తించే ప్రయత్నం చేసాను. కాని నా మట్టుకు నాకే నేను గుర్తించినవి సరియైనవా కావా అనే అనుమానం రావటం మొదలెట్టింది. అందుచేతనే పూర్తి చెయ్యకుండా విడిచిపెట్టాను.

0 comments

Jul 2, 2010

మ ర వ ల ఱ లేకతరవళు లరయగఁ దమతమక కవులయనుమతి వళులై

ఏకతర వళి నిరూపణము
క.
మ ర వ ల ఱ లేకతరవళు
లరయగఁ దమతమక కవులయనుమతి వళులై
బరఁగుఁ, బదాంతముకారము
పొరిఁబొందిన పు ఫు బు భు ము లు పొసఁగిన చోటన్
. 43
మ, ర, వ, ల, ఱ - ఇవి ఏకతరవళులు - పూర్వ కవుల అనుమతితో ఇవి ఒకటొకటే ( తమకు తామే )యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి . వీటికి ఉదాహరణలు చూడండి.
ఆ.
ధురవచనుఁ డార్యమాననీయాగ్రణి I సికవరుఁడు రాజరాజనిభుఁడు
రుస యెఱిఁగి సుకవిరులకు నిచ్చిన I చ్చి విశ్వవిభునిలాగు మెచ్చు. 44
ఆ.
జ్జు లాని యీగి ఱావడి సభలోన I ఱేసి పోరి లోన ఱిచ్చఁ బొఱసి
ఱెన్న మడుగుపుడమిఱేండ్ర నేలనుతింప I నకు విశ్వనాథుఁ డొనరియుండ. 45

ముకారవళినిరూపణము
తే.
పుడమి విశ్వవిభునిభుమునకుఁ దొడవు I ఫుల్లపద్మాలయ వితీర్ణమునకు బోటి
బుధులు విద్యావివేచనమునకు సాక్షి I భువనములు కీ ర్తి కి నివాసములు దలంప. 46

పు ఫు బు భు లు పదము చివరిలోగల ము కారముతో యతి సాజాత్యం కలిగి ఉంటాయి.

0 comments

Jul 1, 2010

కా కై కౌ లట కత్వము కీ కేలు కృ కూృలు నట్లె , కిత్వము వళులై

కాది వర్గమునకు గుణితస్వరవళి నిరూపణము
క.
కా కై కౌ లట కత్వము
కీ కేలు కృ కూృలు నట్లె , కిత్వము వళులై
కూ కోలు కుత్వమునకును
జేకొను దత్కాదిళాంత సిద్ధార్ణతతిన్.
38

క గుణితం లోని అక్షరాలు వేటి కేవి యతులుగా ఉంటాయో చెప్తున్నాడు. క కి కా, కై, కౌలు యతులు. అలాగే కి కి కే, కృ కూృలు యతులు. కు కి కూ కోలు వళులౌతాయి.

ఇతరేతర వర్గజ వళి నిరూపణము
క.
ఇత రేత రవర్గజ వళి
తతికిఁ జవర్గువును శ ష స దగు నొక గమియై;
కృతులకు న హ య లు నేక
స్థితి నొకవంగళము; నణలుఁ జెలఁగు నొకటియై. 39
ఇతరేతర వర్గజ వళిలో చ వర్గము, శ ష స లు ఒక గుంపుగానూ, అ, హ, య లు మూడూ ఒక గుంపుగానూ, మరియు న, ణ ల రెండూను  ఒకదాని కొకటి యతిసాజాత్యాన్ని కలిగి ఉంటాయి.; వీటికి ఉదాహరణలను క్రింద ఇస్తున్నాడు చూడండి.
చ.
తుర చళుక్యవిశ్వవిభుశాసన మెక్కినరాజమౌళు ల
చ్చత మకుటోజ్జ్వలస్రగనుక్తము లై విలసిల్లు నెందు; నీ
తనము నీతిమంతులకు సాఁగిన నేమి కొఱంత ? సంతతో
జ్ఝితమదబుద్ధులుం గుశలసిద్ధులు పొందుట లెల్లఁ బోలవే. 40

ఆ.
తురుపాయబాహుక్తిక్షమావళి I బాఱ విడిచి చిత్రభానుసాక్షిఁ
బాఱె సర్వసిద్ధిద మేది ధరణీవ I రాహమునకు నోడి రాచకదుపు. 41
చ.
మమత కాస్పదంబు, వినయంబునకుం గుదు, రుబ్బులేనినె
య్యమునకు నాలవాలము, మహాగుణపంక్తికి జన్మభూమి, దా
మునకు నాదరం, బరిరక్రియ కుగ్రనికేతనంబు నా
మరుఁ జళుక్యవిశ్వమనుజాధిపుచిత్తమమత్తవృత్తియై. 42

0 comments

Jun 30, 2010

తుది నున్న ఙ ఞ ణ న మ లు వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్

వర్గవళి నిరూపణము

క.
తుది నున్న ఙ ఞ ణ న మ లు
వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్
వొదిఁ దనవంగడములలో
నదికిన నవ్వళులు వర్గజాఖ్యము లరయన్
. 36

వర్గాక్షరాలలో ప్రతి వర్గానికీ చివరను గల అనునాసికాక్షరములను విడిచి పెట్టి మిగిలిన వర్గాక్షరాలు తమ తమ వర్గంలోని ఇతర అక్షరాలతో అతికినప్పుడు ఆ యతులను వర్గజ యతులు అంటారు. అంటే క, ఖ ,గ, ఘ లు ; చ, ఛ, జ ఝ లు ; ట, ఠ, డ, ఢ లు ; ప. ఫ, బ, భ, లు -- ఇవి ఏ వర్గంలోని అక్షరాలు ఆ వర్గంలోని ఇతర అక్షరాలతో యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి.

సీ.
మనీయరాజశిఖామణి రిరాజర్వమహీధ్రనిర్ఘాతమునకు
తుర యశస్సిత చ్ఛత్త్రి కాయోధన యదాశ్వభంజళీ ఝుంపునకును
టంకితరాయకఠారిసాళువునకు డంభలాంఛన కోల  ఢాలునకును
త్త్వ పురాణకథా రసవేదికి దాన దయా ధర్మ ధామ మతికి
తే.
శుపతిప్రాప్త సామ్రాజ్యలున కబ్జ I బంధుబంధురతేజోవిభావసునకును
విశ్వవిభునకు సరి లేరు విశ్వజగతి I నిన నివి వర్గవళ్లకు చ్చు గృతుల. 37

0 comments

Jun 29, 2010

పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ

వళి ప్రాసములు
క.
పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ ; బ్రాసం బనఁగాఁ
బాద ద్వితీయవర్ణము I పాదచతుష్కమున కివియ ప్రాణము లెపుడున్.
29

పద్యపాదములోని మొట్టమొదటి అక్షరమును యతి అంటారు. ప్రాస అంటే పాదములోని ద్వితీయాక్షరము . పద్యం యొక్క నాలుగు పాదాలకూ యెప్పడూ యతి ప్రాస లనేవి ప్రాణం లాంటివి.
వళి భేదములు
క.
స్వరజలు వర్గజ లిత రే I తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ
బరపారు వళ్ళు నాలుగు ; I వరుసఁ దెనుంగునకు వాని వలయుం దెలియన్
. 30

స్వరజలు, వర్గజలు, ఇతరేతర వర్గజలు, ఏకతరజలు అని యతులు తెనుగులో వరుసగా నాలుగు విధాలుగా ఉంటాయి. వాటిని గుఱించి తెలిసికోవాలి. అంటున్నాడు పెద్దయ మహాకవి. కాని అనంతామాత్యుడు తన ఛందోదర్పణంలో యతులు ఐదు విధాలు అని వాటిని స్వర యతులు, వర్గయతులు, సరసయతులు, సంయుక్తయతులు, ప్రత్యేకయతులు అని విభాగం చేస్తాడు. అనంతుని సరసయతులు సంయుక్తయతులు రెండూ కలసి పెద్దయ గారి ఇతరేతరవర్గయతులు గా ఉంటాయన్నమాట.
క.
కోరి యకారము మొదలౌ I కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్
వారక యొండొంటికి నిం I పారఁగ వళ్ళయ్యె నాల్గు నైదును మూడున్. 31


అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఏ, ఐ, ఓ ఔ - ఈ పండ్రెండు అక్షరాలూ పరస్పరం ఈక్రిందివిధంగా యతి సామ్యం కలిగి ఉంటాయి.
అ, ఆ లకు ఐ, ఔ లు
ఇ, ఈ, ఋ,ౠ లకు ఏకారము
ఉ, ఊ లకు ఓకారము -- ఇవి స్వర యతులు. ఈ అచ్చులలో హ్రస్వాక్షరాన్ని చెపితే దీర్ఘాక్షరం కూడా దానిలో కలిసే ఉంటుంది. సంస్కృత భాషలోని సంధ్యాక్షరములలో హ్రస్వములు లేవు. అంటే ఎ ఒ లు లేవన్నమాట.

పై పద్యంలో నాల్గు నైదును మూడున్ అనేదాన్ని ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. పెద్దలెవరైనా వివరించగలరని నా ఆశ.
అజ్విరమము
క.
ఆ ఐ ఔ లత్వమునకు I నీ ఏలును ఋద్యయంబు నిత్వమునకుఁ దా
మూ ఓ లుత్వమునకు వళు I లాయచ్చుల దొరసి యుండ హల్లుల కెల్లన్
. 32

అ కారానికి ఆ, ఐ, ఔ లు
ఇ కారానికి ఈ, ఏ, ఋ, ౠ లు
ఉ కారానికి ఊ, ఓ లు యతులుగా అవుతాయి.
ఇవేకాకుండా ఈ అచ్చులతో కూడిన అన్ని హల్లులకూ కూడా ఇది వర్తిస్తుంది.
అకారవళి నిరూపణము
తే.
వని ధర్మజుఁబోలు నిత్యార్యచర్య,
నాదిరాజుల దొరయు నిత్త్యైంద్రభూతి
రులఁ బ్రహరించు బహుదండౌగ్ర్యమునను,
విధుకులాగ్రణి చాళుక్య విశ్వవిభుఁడు
. 33
ఇకారవళి నిరూపణము
ఆ.
నజుఁ డీగి, భారతీశుండు చతురత, I నేకవీరుఁ డాజి జుతయందు,
జరిపుఁడు సిరి, నహీనుండు భూవహ I మున విశ్వమనుజనాథవిభుఁడు
. 34
ఉకార వళి నిరూపణము
క.
ధరణీవరాహలాంఛితుఁ I డురరీకృత సకలవిద్యుఁ డూరీకృత సం
గరజముఁడు విశ్వభూవరుఁ I డురుకీర్తుల నెగడు నా బిడౌజో నిభుఁ డై. 35

0 comments

Jun 28, 2010

కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు

మ.
కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు ; గద్యంబు నా
నమరుం బాదనియంత్రణానియమవిన్యస్తప్రశాస్తార్థ మై
రమణీయాంఘ్రిచతుష్టయ స్ఫుట వళిప్రా సాభిరామంబు ప
ద్యము ; తత్పద్యము వృత్తజాతు లన రెండై పర్వుఁ గావ్యంబులన్. 25



కావ్యమనేది గద్య పద్యాలతో కూడుకున్నదై కమనీయంగా ఉంటుంది. గద్యానికి పాదనియమం అనేది ఉండకుండా సాగిపోతుంటుంది. కాని పద్యం మటుకు రమణీయమైన నాలుగు పాదాలతో కూడుకొని వళి ప్రాసలతో స్ఫుటమైన రీతిలో సాగుతుంది. ఆ పద్యములు మళ్ళీ రెండు రకాలు గా ఉంటాయి కావ్యములలో - వృత్తపద్యాలని, జాతి పద్యాలనిన్నీ.( జాతులలో జాతులు ఉపజాతులని రెండు వర్గాలు )

క.
వృత్తం బనఁ జతురంఘ్రి సు
వృత్తం బై వళుల వ్రాల వెలయును ; మాత్రా
యత్తగణంబులచేతఁ బ్ర
వృత్తాకృతిఁ బరఁగు జాతివితతులు కృతులన్.



వృత్తమనేది నాలుగు పాదాలతో కూడి మంచినడకతో యతిప్రాసలతో అలరారుతుంది. జాతి పద్యాలు మాత్రం మాత్రాగణాలతో నిర్దేశింపబడిన గణాలతో ప్రకాశిస్తుంటాయి.

తే.
విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ
ణాభిదాన విరామము లనెడి పేళ్ళు
యతికిఁ బర్యాయపదము లై యమరుఁ గృతిని ;
యుక్తి పదములఁ గృతియందు నునుపవలయు. 27


నిరతి, విశ్రామము, విశ్రాంతి, విరమము, విరమణము అనే పేర్లు యతికి పర్యాయపదాలు. ఉపాయంతో ఏయే పద్యాలకు ఎక్కడెక్కడ యతిని
ఉంచాలో ఆయా ప్రదేశాలలో ఆ యా నిర్దేశిత అక్షరాలను కృతులందు యతి రూపంలో నిలుపవలసి ఉంటుంది.

క.
కరి గిరి పుర నిధి శశి ది I క్పరిసంఖ్యానంబు గణితపరిభాషలచే
నరసి యతి నిలుపుచోటులు I పరికింపఁగవలయుఁ గావ్యబంధన వెలయన్.
28


ఈ పద్యంలో యతుల సంఖ్య వివరింపబడింది. కరి - అష్టదిగ్గజాలు 8, గిరి - నవగిరులు 9, పుర , నిధి - నవనిధులు 9, శశి - , దిక్ - అష్టదిక్కులు 8, వీని సంఖ్యానమును గణితపరిభాషలచే అరసి యతి నిలుపుచోటులు ఎన్ని వస్తాయో లెక్కతేల్చాలి అని నా భావన.నాకు ఈ లెక్క తెలియరాలేదు. పెద్దలు తెలియపరిస్తే ముందుగా వారికి నా కృతజ్ఞతలు .

0 comments

గురువు లగు నొంటి సున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్

క.
గురువు లగు నొంటి సున్నల,
నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్
బొరసినవియు దీర్ఘములు, ని
తరములు లఘువులు గణములు త త్త్రియతంబుల్.22


ఏవేవి గురువులు, ఏవేవి లఘువులు వాటి వివరాలను చెపుతున్నాడు. పూర్ణానుస్వారము, విసర్గ, ఒత్తులతో కూడిన అక్షరములు - ఈ మూడింటికి ఎడమ ప్రక్కనున్న అక్షరములు గురువులు. ఇవి కాక మిగిలినవి లఘువులు.

క.
ఇందుఁడు గాంతి, వపుఃప్రభఁ
గందర్పుఁడు, స ప్తస ప్తి ఘనరుచి ననఁ జె
న్నందినయవి గురువులు చె
న్నొందిన విడుపులును; నట్ల యున్నవి లఘువుల్. 23


పై పద్యంలో గురువులు ఏవో లఘువులు ఏవో విశదీకరిస్తున్నాడు చూడండి. ఇందుఁడు లో ఇ, గాంతి లో గా, వపుఃప్రభ లో పు , గందర్పుఁడు లో గ మరియు దలు, స ప్తస ప్తి లో రెండు సలు, జె న్నందినలో జె మరియు న్న, తరువాత చెన్నొందిన లో చె మరియు న్నొ, నట్ల లో న , యున్నవి లో యు - ఇవి గురువులు. మిగిలినవి లఘువులు.

క.
కృతికఌపులును తృపిదృపులును
పితృభృతులును నిలుచు పదముపిఱుఁదన లఘువుల్,
కృతిలో నగణములును దీ
ర్ఘత నొందినయేని రెట్టిఁ గా దగు నెఱుఁగన్.24

1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks