నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 28, 2010

గురువు లగు నొంటి సున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్

క.
గురువు లగు నొంటి సున్నల,
నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్
బొరసినవియు దీర్ఘములు, ని
తరములు లఘువులు గణములు త త్త్రియతంబుల్.22


ఏవేవి గురువులు, ఏవేవి లఘువులు వాటి వివరాలను చెపుతున్నాడు. పూర్ణానుస్వారము, విసర్గ, ఒత్తులతో కూడిన అక్షరములు - ఈ మూడింటికి ఎడమ ప్రక్కనున్న అక్షరములు గురువులు. ఇవి కాక మిగిలినవి లఘువులు.

క.
ఇందుఁడు గాంతి, వపుఃప్రభఁ
గందర్పుఁడు, స ప్తస ప్తి ఘనరుచి ననఁ జె
న్నందినయవి గురువులు చె
న్నొందిన విడుపులును; నట్ల యున్నవి లఘువుల్. 23


పై పద్యంలో గురువులు ఏవో లఘువులు ఏవో విశదీకరిస్తున్నాడు చూడండి. ఇందుఁడు లో ఇ, గాంతి లో గా, వపుఃప్రభ లో పు , గందర్పుఁడు లో గ మరియు దలు, స ప్తస ప్తి లో రెండు సలు, జె న్నందినలో జె మరియు న్న, తరువాత చెన్నొందిన లో చె మరియు న్నొ, నట్ల లో న , యున్నవి లో యు - ఇవి గురువులు. మిగిలినవి లఘువులు.

క.
కృతికఌపులును తృపిదృపులును
పితృభృతులును నిలుచు పదముపిఱుఁదన లఘువుల్,
కృతిలో నగణములును దీ
ర్ఘత నొందినయేని రెట్టిఁ గా దగు నెఱుఁగన్.24

1 comments:

కంది శంకరయ్య said...

నరసింహ గారూ,
మీ బ్లాగులో ఛందఃప్రకరణాన్ని చూస్తూనే ఉన్నా. మీ కృషి ప్రశంసనీయం. కాకపోతే ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యానాన్ని పోస్ట్ చేయలేదు. ఇకనుండి నా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాను.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks