నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 19, 2010

నా కోరిక

భాద్రపద శుద్ధ త్రయోదశి - సర్వధారి నామ సంవత్సరం - ఇది నా పుట్టిన తేదీ -


ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి - వికృతి నామ సంవత్సరం - ఇది నా 63 వ పుట్టిన తేదీ -
(నేను పుట్టినపుడు మా పెద్దలు వ్రాయించిన జాతకం కాగితంలోని వివరాల ప్రకారం.)
ఆ కాగితం వ్రాసిన ఆయన ఆంగ్ల తేదీని అందులో వ్రాయలేదు.
అందుకని ఎప్పుడూ ఆ తిథినాడే నా పుట్టిన రోజు జరుపుకుంటే బావుంటుంది కదాని నా కనిపించింది.
అవును, మనం మన అన్ని పండుగలనూ పబ్బాలనూ తెలుగు తిథుల ప్రకారమే జరుపు కుంటున్నాం కదా. మరి అటువంటప్పుడు మన పుట్టినరోజులను కూడా అదేవిధంగా తిథుల ప్రకారం ఎందుకు జరుపుకోకూడదు ?
ఒకప్పుడు మన కలన యంత్రాలలో ఆంగ్లభాషను మాత్రమే వాడేవాళ్ళం. కాని ఇప్పుడు మన తెలుగు భాషను కూడా ధారాళంగా వాడగలుగుతున్నాం కదా !
మన వాళ్ళలో చాలామంది కంప్యూటరు రంగంలో నిష్ణాతులైన వారెందరెందరో వున్నారు ! అటువంటప్పుడు మన కలన యంత్రాల్ని వారు తెలుగు సంవత్సరముల (ప్రభవ, విభవ మొ..60), తెలుగు నెలల(చైత్రము,వైశాఖము...12) , మరియు తెలుగు తేదీల (పాడ్యమి,విదియ ...మొ 15+15)వాలుపట్టీలు (dropdown boxes) కలదానినిగా ఎందుకు మార్చలేరు ?

అలా మార్చితే ఇంచక్కా అధికమాసాలొచ్చినప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన బ్రహ్మోత్సవాలను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటున్నట్లుగా మనం కూడా మన పుట్టిన రోజులను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుని ఆనందించవచ్చుగా.

అంతేకాదు

మనం మన పిల్లలను మన సంస్కృతీ సాంప్రదాయాలను మరచిపోకుండా ఉండే వారిగా కూడా
తీర్టి దిద్దుకోవచ్చు కదా ! అందర్నీ ఆలోచించమని ప్రార్థన .! క్రమ క్రమంగా మనం ఇప్పటినుండీ
ఇటువంటి కార్యక్రమాల్ని చేపడితే మన ముందు తరాల వారికి ఉపయోగం గా ఉంటుందని
నా అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో ఉండేవారు ఇంకా చాలామంది ఉండవచ్చుననే ఆశతో నేను
నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టును  ప్రచురిస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా
(ఆంగ్ల తేదీ ప్రకారం) శుభాకాంక్షలు తెలిపిన వారి కందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

6 comments:

rākeśvara said...

జన్మదిన శుభాకాంక్షలు.

నా పుట్టిన తిదిని నేను సైతం మార్గశిర బహుళ పంచమి నాడు జరుపుకుంటాను, ఈ పట్టు నుండి.
నేను అమెరికాలో వుండడంవలన ఆ తిది రాకపోకలు తెలియవు. దయచేసి ఆనాడు నాకు శుభాకాంక్షలు తెలియఁజేయగలరు :)

Unknown said...

ధన్యవాదాలండీ. తప్పకుండా ఆ రోజు మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తాను. మాసాలలో కెల్లా మార్గశిరం గొప్పదంటారు. గీతలో భగవానుడు కూడా తనను మాసాలలో మార్గశీర్షాన్ని నేను అని చెప్తాడు కదా. మీరు పుట్టిన సంవత్సరం పేరు తెలియజేయగలరు.

రాఘవ said...

మీ జన్మదినసందర్భంగా వందనములండీ.

జ్యోతి said...

జన్మదిన శుభాకాంక్షలు

Unknown said...

Dear Narsimha Rao Garu!!
I conveyed my best wishes earlier when I was prompted by some dot.com about the likely date according to English Calendar.I know that,you would have been very happy had I conveyed them in our Telugu script,but Narsimha Rao Garu!Please bear with me for some more time as I need practicing for which I am hardly finding any time.
Any way,my Best Wishes are once again conveyed for this "Panchami" Birth day.Number 5 is very auspicious for me-may be because of this only GOD gave me a friend like you.And incidentally,I may say that I joined my Bank exactly on this day i.e 19 th September 1966 which incidentally happenned to be Bhadrapada Shuddha Panchami-the next day to "Ganesh Chathurthi.Now,I feel very nostalgic & also somewhat relieved that since I joined my Bank after worshipping Ganapahi on the previous day,my sailing in service all through was very smooth with A Plus ratings of my performance through out.You may wonder if I say that this 19 th September also happens to be the Birth Day of our "Racchabanda"friend -Karavadi Raghava Rao.

Normally,in these days,every one has three Birth Days-One is official which is got entered in to the scool records by the parents at the time of his first admission in the school which need not be the same & exact DOB for various reasons.Second is the exact one as per the English Calendar & the third one is according to our Telugu-say of the Regional language's Calendar. According to Telugu Calendar I was born on Bhadrapada Shuddha "Thritheeya" i.e.one day prior to Ganesh Chathurthi,but the exact time is entered no where by my elders.It is possible that it could have encroached the next festive day of "Ganesh Chathurthi"also.
Good Luck & May GOD bless u Narsimha Rao Garu!!

Jwala's Musings said...

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆలస్యంగా తెలియచేస్తున్నాను. నేను గత ఐదు రోజులుగా ఇన్‍టర్నెట్ దగ్గర లేను. మా వూరికి వెళ్లాను. మీరు తప్పక తిధుల ప్రకారం జరుపుకుంటే బాగుంటుంది. నా పుట్టిన రోజు శ్రావణ శుద్ధ చవితి. నాకు కూడా అలానే జరుపుకోవడం ఇష్టం.
జ్వాల

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks