ఏకతర వళి నిరూపణము
క.
మ ర వ ల ఱ లేకతరవళు
లరయగఁ దమతమక కవులయనుమతి వళులై
బరఁగుఁ, బదాంతముకారము
పొరిఁబొందిన పు ఫు బు భు ము లు పొసఁగిన చోటన్. 43
మ, ర, వ, ల, ఱ - ఇవి ఏకతరవళులు - పూర్వ కవుల అనుమతితో ఇవి ఒకటొకటే ( తమకు తామే )యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి . వీటికి ఉదాహరణలు చూడండి.
ఆ.
మధురవచనుఁ డార్యమాననీయాగ్రణి I రసికవరుఁడు రాజరాజనిభుఁడు
వరుస యెఱిఁగి సుకవివరులకు నిచ్చిన I లచ్చి విశ్వవిభునిలాగు మెచ్చు. 44
ఆ.
ఱజ్జు లాని యీగి ఱావడి సభలోన I ఱేసి పోరి లోన ఱిచ్చఁ బొఱసి
ఱెన్న మడుగుపుడమిఱేండ్ర నేలనుతింప I మనకు విశ్వనాథుఁ డొనరియుండ. 45
ముకారవళినిరూపణము
తే.
పుడమి విశ్వవిభునిభుజమునకుఁ దొడవు I ఫుల్లపద్మాలయ వితీర్ణమునకు బోటి
బుధులు విద్యావివేచనమునకు సాక్షి I భువనములు కీ ర్తి కి నివాసములు దలంప. 46
పు ఫు బు భు లు పదము చివరిలోగల ము కారముతో యతి సాజాత్యం కలిగి ఉంటాయి.
Jul 2, 2010
మ ర వ ల ఱ లేకతరవళు లరయగఁ దమతమక కవులయనుమతి వళులై
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment