క.
గురు లఘువులు గలములు; లఘు
గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్;
గురులఘువులు త్రితయము లై
మురిసిన నవి మగణ నగణములు నాఁ బరఁగున్ 19.
ఒక గురువు ఒక లఘువు కలసి UI గల ములు అవుతుంది. ఒక లఘువు ఒక గురువు IU వ గణము, ఒక గురువు ఒక లఘువు UI హ గణము అవుతుంది. మూడేసి గురువులు UUU మ గణముగాను, మూడేసి లఘువులు III న గణము గాను అవుతాయి.
ఆ.
మగణ రచన కాది మధ్యాంత లఘువులు
గలిగె నేని య ర త గణము లయ్యె
నగణ రచన మొదల నడుమను గడ గురు
వుండెనేని భ జ స లొప్పు మిగులు. 20
మగణమునకు UUU మొదటను, మధ్యను, చివరను ( గురువుకు బదులుగా ) లఘువు ఉంటే య ర త గణములు . IUU య గణము, UIU ర గణము, UUI త గణము ఏర్పడుతాయి. అదేవిధంగా న గణమునకు III మొదటను, మధ్యను, చివరను ( లఘువుకు బదులుగా ) గురువు గనక ఉంటే UII భ గణము, IUI జ గణము, IIU స గణము ఏర్పడుతాయి.
క.
లోవంక వ్రాయ గురు వగు;
నేవంకయు లేనివ్రాఁత యెసఁగును లఘువై
జైవాతృక రేఖాయుత
భావజశరనిభము లండ్రుఁ ప్రాజ్ఞులు మఱియున్. 21
లోపలి వైపు వంక వచ్చునట్లుగా వ్రాస్తే U అది గురువుకు చిహ్నం అవుతుంది. ఏ వంకా లేకుండా తిన్నని గీతలా వ్రాస్తే I అది లఘువుకు చిహ్నమవుతుంది. వీటిని రెండింటినీ మన్మధుని యొక్క విల్లనీ బాణమనీ ప్రాజ్ఞులు పేర్కొంటారు.
Jun 26, 2010
గురు లఘువులు గలములు; లఘు గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్
ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర
క.
ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర ; ని
త్యశ్రీల నొసఁగు మగణ I ప్రశ్రయముఖకవిత చెప్పఁ బని దనుఁ దలపన్.11
ధీశ్రీస్త్రీ అనగా మూడు గురువులు గలది. ఇది మగణము. దీనికి అధిదైవతము విశ్వంభర, అంటే భూదేవి. ఎప్పుడూ ధనాన్ని ఒసగుతుంది . మగణము తో ప్రారంభించి కావ్యాన్ని వ్రాయటం మొదలుపెడితే ధనప్రాప్తి .
క.
జగతి వరాహా యనగా I యగణం బుదయించె నుదక మధిదైవత మై,
యగణప్రయోగములయెడఁ I దగిలించున్ సిరులుఁ దన్నుఁ దలఁపున నిలుపన్.12
వరాహా అనగా ఒక లఘువు రెండు గురువులు . ఇది యగణము. దీని కధిదైవతము నీరు. యగణ ప్రయోగము వలన సిరులు కలుగుతవి. దీనిని తలపులో ఉంచుకొని కావ్యారంభం చేస్తే సిరులు కలుగుతాయట.
తే.
బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ
మయ్యె ; నధిదైవతము వహ్ని యయ్యెఁ గానఁ,
గవితముఖమున ర గణంబు గట్టునపుడు
వహ్నిఁ దలంపగఁ బగఱకు వచ్చుఁ జావు. .13
కాగుహా రనునది ఒకగురువు ఒకలఘువు ఒకగురువు తో ఉంటుంది. ఇది ర గణము. దీనికి అధిదైవతము అగ్ని. అగ్నిని ధ్యానించి. ర గణాన్ని దృష్టిలో ఉంచుకొని కావ్యాన్ని ప్రారంభిస్తే కవి గారి శత్రువుకు చావు తప్పదన్నమాట.
క.
గతికై ఫణి వసుధా సని I మతిఁ దలఁచిన సగణ మయ్యె ; మారుత మధిదై
వత మండ్రు; సగణముఖ మగు I కృతి పగఱకు మగుడులేని కీ డొనరించున్. 14
పింగళుడు వసుధా సని అంటే రెండు లఘువులు ఒక గురువు అన్నమాట . ఇది సగణ మోతుంది. దీనికి వాయువు అధిదైవతము. సగణ ముఖంగా కృతి చెపితే కవి గారి పగవారికి తిరుగులేని కీడును కలిగిస్తుందన్నమాట
క.
సాకేత్వ దనుడుఁ దగణము I జాతం బై శూన్య మగుడు, జద లధిదైవం
బై తనరె ; దగణముఖకృతి I శ్రీతుం డగు నృపుని నైన హీనుం జేయున్. 15
సాకేత్వ అంటే రెండు గురువులు ఒక లఘువు ఇది తగణమౌతుంది. దీనికి శూన్యాన్ని కలిగించటం లక్షణం. దీని కధిదైవతం ఆకాశము . తగణ ముఖం గా కృతి చెప్పినపుడు శ్రీమంతుడైన రాజు లాంటి వాడైనా సరే శత్రువు హీనుడుగా మారిపోతాడట.
ఆ.
తనరఁ బింగళుఁడు కదాస జనన్ జగ
ణము జనించెఁ, దదధినాథుఁ డినుఁడు;
తొలుతఁ గృతిని జెప్పఁ దొణఁగుచో నర్కునిఁ
దలఁప నరికి రోగతతులు వొడము. 16
పింగళుడు కదాస అని అనగా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటాయి. ఇది జగణమౌతుంది. దీని కధినాథుడు సూర్యుడు. జగణం తో మొదలుపెట్టి కృతిని చెప్తే కవిగారి శత్రువుకు సకల రోగబాధలూ కలుగుతాయట.
క.
ఖగపతి కింవద భన నది
భగణం ; బుడురాజు తదధిపతి ; భగణాద్యం
బుగనుం గృతి చెప్పునపుడు
మృగాంకుఁ దలపంగ నగు సమీహిత కాంతుల్. 17
పింగళుడు కింవద అని అనగానే ఒక గురువు రెండు లఘువులు కలిగిన భగణం పుడుతుంది. దీనికి అధిదైవతం ఉడురాజు. భగణంతో కృతి చెప్పినపుడు చంద్రుని తలుచుకుంటే సమీహిత కాంతులు కలుగుతాయట.
క.
సహస నని పలుక నగణం
బహతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుడు; త
ద్విహితస్మృతి నాయువు గడు
విహితం బగు నగణముఖ వినిర్మాణములన్18
పింగళుడు సహస అని పలగ్గానే మూడు లఘువుల నగణం ఏర్పడుతుంది. దాని కధిదైవతం ప్రాణుడు. దీనితో కావ్యనిర్మాణం సాగిస్తే ఆయువు క్షీణిస్తుందట.
Jun 25, 2010
పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై
| క. | |||||
| పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై యు |
| త్కటయతిలయమయతాళ I స్ఫుటవికటచ్ఛంద మందముగ నొనరించెన్. 6 |
| మహా నటుడైన ఈశ్వరుడు పూర్వం వాచకాన్ని అభినయించే సందర్భంలో అధికమైన యతిలయ తాళములతో కూడిన స్ఫుటమైన వికటఛందాన్ని అందముగా కూర్చినాడట. క. |
| సృజియించి యిచ్చె నజునకు నజుఁడును భరతునకునిచ్చెనమ్మునివరుడున్ ఋజుమతి యగు పింగళుఁ డను భుజగమునకు నిచ్చె భుజగభోజను డచటన్. 7 శివుడు ఛందశ్శాస్త్రాన్ని సృష్టిచేసి బ్రహ్మదేవునికి ఇచ్చాడట. బ్రహ్మ భరతు డనే మహామునికి, ఆ ముని పింగళుడనే నాగరాజుకు ఇచ్చాడట. అక్కడ ఉన్న గరుత్మంతుడు అప్పుడు, క.
గిరిజాకృతులు తత్ప్రకృతములు గణముల్ గరుడినిపై పింగళఫణి విరచించిన తెఱఁగు వరుస వివరింతుఁ దగన్. 9 గురువు శంకరుడు, లఘువు పార్వతీ దేవి ఆకృతులనుండి ఉద్భవించాయి. వాటినుండి ఏర్పడిన గణములతో కూడిన ఛందాన్ని గరుడినిపై పింగళఫణి విరచించిన విధంగా వరుసగా తెలియపరుస్తాను, అంటున్నాడు. వ. అవి యెయ్యవి యనిన --- ధీశ్రీస్త్రిమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్, సాతేక్వత్, కదాసజ్, కింవదభ్, సహసన్: ఇట్లని గరుడ భయంబుననుం దిర్యగుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణంబు నకునై పింగళనాగంబుచేత నుచ్ఛరితంబు లగు తద్వాక్యాంతరంబులం బొల్లులై తోఁచు మకార - యకార - రేఫ - సకార - తకార - జకార - భకార - నకారంబులు గణాభిదానంబులకు నాద్యక్షరంబు లగుటచేత మగణ - యగణ - రగణ - సగణ - తగణ - జగణ - భగణ - నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ, దత్స్వరూపంబులునుం దదధిదైవతంబులం బరిపాటిం బ్రకటింతు నెట్లనిన 11 అవి ధీశ్రీస్త్రీ U U U మ గణము వరాహా I U U య గణము కాగుహా U I U ర గణము వసుధా I I U స గణము సాతేక్వ U U I త గణము కదాస I U I జ గణము కింవద U I I భ గణము సహస I I I న గణము లు. ఇవి గరుడని వలని భయంబు చేత గాని తిర్యగ్జాతుల స్వభావం నుండి సహజంగా పుట్టే ధ్వనులుగా పింగళ నాగము నుండి వెలువడిన ధ్వనులు గణాలుగా రూపాంతరం చెందినవి. ఆ వాక్యాంతము లందుండే హల్లక్షరాలే వాటికి నామాక్షరములు గా ఏర్పడినవి. వాటి వివరములను వాటి వాటి అధిదైవతములను క్రమంగా తెలియ పరుస్తాను, అంటాడు.. |
Jun 24, 2010
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
కావ్యాలంకార చూడామణి -- సప్తమోల్లాసము -- ఛందః ప్రకరణము
క.
శ్రీ విశ్వేశ్వరునకునై I భావిత విశ్వేశ్వరాంఘ్రిపద్మునకై సం
భావిత పద వాక్య కళాI కోవిదునకై నయగుణ విశేష గుణ నిధునకునై. 1
విన్నకోట పెద్దయ మహాకవి ఎలమంచిలి పంచధారల ప్రాంత దేశపాలకుడైన చాళుక్య రాజు విశ్వేశ్వర భూపతికి ఆశ్రితుడు. ఈ విశ్వేశ్వర భూపతి రాజ రాజ నరేంద్రుని వంశములోని వాడు. కవి తన కావ్యాలంకార చూడామణిని తన ప్రభువుకు అంకితమిస్తూ ప్రతాపరుద్రీయములో వలెనే అన్నిటికిని ప్రభువునే విషయముగాఁ జేసి లక్ష్యములను వ్రాసినాడు. ఈ ఛందో ప్రకరణాన్ని కూడా తన ప్రభువు కొఱకే నని పైన చెప్తున్నాడు.
క.
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
నాయతమై యామ్నాయ పI దాయిత మగు ఛంద మొప్పిదముగ నొనర్తున్. 2
పింగళు డనబడే నాగము, హలాయుధుడు, జయదేవుడు మొదలైన ఆర్యులచే వేదములనుండి విస్తారముగా ఉద్ధరింపబడిన ఛందశ్శాస్త్రమును ఒప్పిదముగా చెబుతానంటున్నాడు.
క.
ఛందో విభ్రమ విధితోఁ I బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యరI వింద భవుని వదనములకు విభవం బొసగెన్. 3
ఛందశ్శాస్త్ర విభ్రమ విభవాన్ని పొందటం వల్లనే కదా వేదశాస్త్రములకు ఆ అరవింద భవుడైన బ్రహ్మ దేవుని నాలుగు వదనములకు వాక్కు అనబడే సరస్వతీ దేవి మందిరములg అనబడే వైభవం కలిగింది !
శా.
పొందై , గౌరవలాఘవప్రకృత మై , పూర్ణాక్షర స్నిగ్ధ మై,
యందం బై , శ్రుతిసమ్మతప్రకట మై , ప్రాపించు నానా విధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్య రత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లునే ఏరికిన్ ? 4
పొందు కలిగిన దై, తేలికగా గౌరవాన్ని పొందిన దై, పూర్ణాక్షరములతో స్నిగ్ధమైన సౌందర్యం కలిగి అందమైన దై, వేదములచే సమ్మతింపబడి ప్రకటితమైన దై ప్రాపించే నానా విధములైన ఛందస్సూత్రములు ఒకే లోకములో కదలుచున్న వాక్యములనబడే రత్నాలతో కూడిన సమూహములు ఎవరికైనా కంఠభూషణములుగా ఉంటాయా ?
క.
ఛందము వాఙ్మయ విద్యాI కందము యతిగమక సమకగణవృత్తకృతా
నంద మమందార్థకళాI విందము వాణీకరారవిందము ప్రతిభన్.5
ఛందస్సు విద్యకు అందాన్ని చేకూరుస్తుంది. ప్రతిభలో యతి గమకములతో కూడినదై వృత్తములతో చేయబడిన గొప్ప అర్థాలు కలిగిన కళావిందము , సరస్వతీ దేవి చేతికి అరవిందమై ఒప్పుతుంది.
తరువాత ఈ ఛందశ్సాస్త్ర మెలా ఉత్పన్నమైనదో చెపుతాడు.
Jun 3, 2010
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సేనాపతి
Jun 2, 2010
పరమపురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు
| ||||||||
Jun 1, 2010
వలచి వచ్చితి నేను వానికిఁ గాను
| దేసాళం వలచి వచ్చితి నేను వానికిఁ గాను నెలవై మీ గొల్ల వాడనే తానుండు న(ంటా)టా IIపల్లవిII చెందమ్మికన్నులవాఁడు చేతిపిల్లఁ గోవివాఁడు యిందు వచ్చెఁ గంటిరా యేమిరే యమ్మా మందలపసువులవాఁడు మకరాంకములవాఁడు యెందు నున్నాఁడు చెప్పరే యేల దాఁచేరమ్మా IIవలచిII నెమలిపించెమువాఁడు నీలమేఘకాంతివాఁడు రమణుఁ డాతఁడు, మొక్కే రమ్మనరమ్మా జమళి చేతులవాఁడు సంకుఁజక్రములవాఁడు అమర మీపాలఁ జిక్కునట చూపరమ్మా. IIవలచిII పచ్చఁబైడిదట్టివాఁడు పక్షివాహనపువాఁడు యిచ్చినాఁడు నా కుంగర మిదివో యమ్మా చెచ్చెరఁ గొనేటివాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు వచ్చి నన్నుఁ గూడినాఁడు వాఁడువో యమ్మా. IIవలచిII 18-14 | |||||
May 25, 2010
సందడి విడువుము సాసముఖా
ధన్నాసి
సందడి విడువుము సాసముఖా
మంధర ధరునకు మజ్జన వేళా IIపల్లవిII
అమరాధిపు లిడుఁ డాలవట్టములు
కమలజ పట్టుము కాళాంజి
జమిలి చామరలు చంద్రుఁడ సూర్యుఁడ
అమర నిడుఁడు పరమాత్మునకు. IIసందII
అణిమాదిసిరుల నలరెడు శేషుఁడ
మణిపాదుక లిడు మతి చెలఁగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును. IIసందII
వేద ఘోషణము విడువక సేయుఁడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీ దేవుండగు శ్రీ వేంకటపతి
ఆదరమున సిరు లందీ వాఁడె. IIసందII 1-12
కాళాంజి = తమ్మపడిగము, పతద్గ్రాహము ( పిల్లి అంటే బిడాలము అన్నట్టుంది కదూ)
May 21, 2010
సారెకు నంటకురే జడనందురు
| శంకరాభరణం సారెకు నంటకురే జడనందురు ధీరుఁడాతఁడున్నతపు దేహియట IIపల్లవిII బాయిటఁ బెట్టకురే పక్షులు పారెడిపొద్దు వోయమ్మ బాలులకు నొప్పదందురు మాయపుఁ బులుగొకటి మచ్చికనీ బాలుని చేయిచ్చి యెక్కించుకొనఁ జేరీనట. IIసారెII పంచలఁ దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు కొంచెపుబాలులఁ బై కొనునందురు మించిన పామొకటి మెరసి యీ బాలుని దించక యెక్కించుకొనఁ దిరిగీనట. IIసారెII అలమి పట్టకురే అంటఁ గాకుండెడివారు తొలరమ్మ బాలులకు దోసమందురు కలికి యీ తిరువేంకటపతిఁ గదిసిన చెలఁగి వేగమే చీరచిక్కీనట. IIసారెII 5-247 |
May 20, 2010
రాధామాధవరతిచరితమితి
| రీతిగౌళ రాధామాధవరతిచరితమితి బోధావహం శ్రుతిభూషణం IIపల్లవిII గహనే ద్వావసి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి విహరత స్తదా విలసంతౌ విహత గృహాశౌ వివశౌ తౌ . IIరాధాII లజ్జాశబళ విలాసలీలయా కజ్జలనయన వికారేణ హృజ్జావ్యవహృత (హిత?) హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా. IIరాధాII పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజై ర్వా పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా గిరం వినాపి వికిరతి ముదం. IIరాధాII హరి సురభూరుహ మర్హతివస్వ -( మారోహతీవ ?) చరణేన కటిం సంవేష్ట్య పరిరంభణ సంపాదిత పులకై - స్సురుచిర్జాతా సుమలతికేవ. IIరాధాII విధుముఖదర్శన విగళతిలజ్జా - త్వధరబింబఫలమాస్వాద్య మధురోపాయనమార్గేణ కుచౌ నిధివద (ద్ద?) త్వా నిత్యసుఖమితా. IIరాధాII సురుచిరకేతక సుమదళ నఖరై - ర్వరచిబుకం సా పరివృత్య (వర్త్య?) తరుణిమసింధౌ తదీయదృగ్జల - చరయుగళం సంస్తకం చకార . IIరాధాII వచన విలాసైర్వశీకృత (త్య?) తం నిచులకుంజ మానితదేశే ప్రచురసైకతే పల్లవశయనే రచితరతికళా రాగేణాస. IIరాధాII అభినవకల్యాణాంచిత రూపా - వభినివేశ సంయతచిత్తౌ బభూవతు స్తత్పరౌ వేంకట - విభుణా (నా?) సా తద్విధినా సతయా. IIరాధాII సచ లజ్జావీక్షణో భవతి తం కచభరం (ర?) గంధం ఘ్రాపయతి నచలతిచేన్మానవతీ తథాపి కుచసంగాదనుకూలయతి. IIరాధాII అవనత శిరసాప్యతి సుభగం వివిధాలా పైర్వివశయతి ప్రవిమల కరరుహరచన విలాసై - ర్భువనపతి(తిం?) తం భూషయతి. IIరాధాII లతాగృహమేళనం నవసై - కతవై భవ సౌఖ్యం దృష్ట్వా తత స్తతశ్చరసౌ (శ్చరతస్తౌ?) కేలీ - వ్రతచర్యాం తాం వాంఛంతౌ. IIరాధాII వనకుసుమ విశదపరవాసనయా ఘనసారరజోగంధైశ్చ జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ. IIరాధాII ఏవం విచరన్ హేలా విముఖ - శ్శ్రీ వేంకటగిరి దేవోయం పావనరాధా పరిరంభసుఖ - శ్రీ వైభవసుస్థిరో భవతి. IIరాధాII 5-166 |











