లలిత
పరమపురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు
మురహరుఁడు యెదుట ముద్దుగారీ నిదివో II పల్లవిII
వేదపురాణములలో విహరించే దేవుఁడు
ఆదిమూలమైనట్టి అలబ్రహ్మము
శ్రీదేవిపాలిటఁ జెలఁగే నిధానము
సేద దేరి యశోదకు శిశు వాయ నిదివో. IIపరమII
మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మఁ గొడుకుఁగాఁ గన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై యాటలాడీ నిదివో. IIపరమII
దేవతలఁ గాచుటకు దిక్కయిన విష్ణుఁడు
భావము లొక్కరూపైన భావతత్త్వము
శ్రీ వేంకటాద్రిమీఁద జేరున్న యా వరదుఁడు
కై వసమై గొల్లెతల కాఁగిళ్ళ నిదివో. IIపరమII 12- 17
| ||||||||
0 comments:
Post a Comment