క. | |||||
పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై యు |
త్కటయతిలయమయతాళ I స్ఫుటవికటచ్ఛంద మందముగ నొనరించెన్. 6 |
మహా నటుడైన ఈశ్వరుడు పూర్వం వాచకాన్ని అభినయించే సందర్భంలో అధికమైన యతిలయ తాళములతో కూడిన స్ఫుటమైన వికటఛందాన్ని అందముగా కూర్చినాడట. క. |
సృజియించి యిచ్చె నజునకు నజుఁడును భరతునకునిచ్చెనమ్మునివరుడున్ ఋజుమతి యగు పింగళుఁ డను భుజగమునకు నిచ్చె భుజగభోజను డచటన్. 7 శివుడు ఛందశ్శాస్త్రాన్ని సృష్టిచేసి బ్రహ్మదేవునికి ఇచ్చాడట. బ్రహ్మ భరతు డనే మహామునికి, ఆ ముని పింగళుడనే నాగరాజుకు ఇచ్చాడట. అక్కడ ఉన్న గరుత్మంతుడు అప్పుడు, క.
గిరిజాకృతులు తత్ప్రకృతములు గణముల్ గరుడినిపై పింగళఫణి విరచించిన తెఱఁగు వరుస వివరింతుఁ దగన్. 9 గురువు శంకరుడు, లఘువు పార్వతీ దేవి ఆకృతులనుండి ఉద్భవించాయి. వాటినుండి ఏర్పడిన గణములతో కూడిన ఛందాన్ని గరుడినిపై పింగళఫణి విరచించిన విధంగా వరుసగా తెలియపరుస్తాను, అంటున్నాడు. వ. అవి యెయ్యవి యనిన --- ధీశ్రీస్త్రిమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్, సాతేక్వత్, కదాసజ్, కింవదభ్, సహసన్: ఇట్లని గరుడ భయంబుననుం దిర్యగుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణంబు నకునై పింగళనాగంబుచేత నుచ్ఛరితంబు లగు తద్వాక్యాంతరంబులం బొల్లులై తోఁచు మకార - యకార - రేఫ - సకార - తకార - జకార - భకార - నకారంబులు గణాభిదానంబులకు నాద్యక్షరంబు లగుటచేత మగణ - యగణ - రగణ - సగణ - తగణ - జగణ - భగణ - నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ, దత్స్వరూపంబులునుం దదధిదైవతంబులం బరిపాటిం బ్రకటింతు నెట్లనిన 11 అవి ధీశ్రీస్త్రీ U U U మ గణము వరాహా I U U య గణము కాగుహా U I U ర గణము వసుధా I I U స గణము సాతేక్వ U U I త గణము కదాస I U I జ గణము కింవద U I I భ గణము సహస I I I న గణము లు. ఇవి గరుడని వలని భయంబు చేత గాని తిర్యగ్జాతుల స్వభావం నుండి సహజంగా పుట్టే ధ్వనులుగా పింగళ నాగము నుండి వెలువడిన ధ్వనులు గణాలుగా రూపాంతరం చెందినవి. ఆ వాక్యాంతము లందుండే హల్లక్షరాలే వాటికి నామాక్షరములు గా ఏర్పడినవి. వాటి వివరములను వాటి వాటి అధిదైవతములను క్రమంగా తెలియ పరుస్తాను, అంటాడు.. |
0 comments:
Post a Comment