నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 26, 2010

ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర

క.
ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర ; ని
త్యశ్రీల నొసఁగు మగణ I ప్రశ్రయముఖకవిత చెప్పఁ బని దనుఁ దలపన్.
11

ధీశ్రీస్త్రీ అనగా మూడు గురువులు గలది. ఇది మగణము. దీనికి అధిదైవతము విశ్వంభర, అంటే భూదేవి. ఎప్పుడూ ధనాన్ని ఒసగుతుంది . మగణము తో ప్రారంభించి కావ్యాన్ని వ్రాయటం మొదలుపెడితే ధనప్రాప్తి .

క.
జగతి వరాహా యనగా I యగణం బుదయించె నుదక మధిదైవత మై,
యగణప్రయోగములయెడఁ I దగిలించున్ సిరులుఁ దన్నుఁ దలఁపున నిలుపన్.
12

వరాహా అనగా ఒక లఘువు రెండు గురువులు . ఇది యగణము. దీని కధిదైవతము నీరు. యగణ ప్రయోగము వలన సిరులు కలుగుతవి. దీనిని తలపులో ఉంచుకొని కావ్యారంభం చేస్తే సిరులు కలుగుతాయట.

తే.
బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ
మయ్యె ; నధిదైవతము వహ్ని యయ్యెఁ గానఁ,
గవితముఖమున ర గణంబు గట్టునపుడు
వహ్నిఁ దలంపగఁ బగఱకు వచ్చుఁ జావు. .
13

కాగుహా రనునది ఒకగురువు ఒకలఘువు ఒకగురువు తో ఉంటుంది. ఇది ర గణము. దీనికి అధిదైవతము అగ్ని. అగ్నిని ధ్యానించి. ర గణాన్ని దృష్టిలో ఉంచుకొని కావ్యాన్ని ప్రారంభిస్తే కవి గారి శత్రువుకు చావు తప్పదన్నమాట.

క.
గతికై ఫణి వసుధా సని I మతిఁ దలఁచిన సగణ మయ్యె ; మారుత మధిదై
వత మండ్రు; సగణముఖ మగు I కృతి పగఱకు మగుడులేని కీ డొనరించున్
. 14

పింగళుడు వసుధా సని అంటే రెండు లఘువులు ఒక గురువు అన్నమాట . ఇది సగణ మోతుంది. దీనికి వాయువు అధిదైవతము. సగణ ముఖంగా కృతి చెపితే కవి గారి పగవారికి తిరుగులేని కీడును కలిగిస్తుందన్నమాట

క.
సాకేత్వ దనుడుఁ దగణము I జాతం బై శూన్య మగుడు, జద లధిదైవం
బై తనరె ; దగణముఖకృతి I శ్రీతుం డగు నృపుని నైన హీనుం జేయున్.
15

సాకేత్వ అంటే రెండు గురువులు ఒక లఘువు ఇది తగణమౌతుంది. దీనికి శూన్యాన్ని కలిగించటం లక్షణం. దీని కధిదైవతం ఆకాశము . తగణ ముఖం గా కృతి చెప్పినపుడు శ్రీమంతుడైన రాజు లాంటి వాడైనా సరే శత్రువు హీనుడుగా మారిపోతాడట.

ఆ.
తనరఁ బింగళుఁడు కదాస జనన్ జగ
ణము జనించెఁ, దదధినాథుఁ డినుఁడు;
తొలుతఁ గృతిని జెప్పఁ దొణఁగుచో నర్కునిఁ
దలఁప నరికి రోగతతులు వొడము.
16

పింగళుడు కదాస అని అనగా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటాయి. ఇది జగణమౌతుంది. దీని కధినాథుడు సూర్యుడు. జగణం తో మొదలుపెట్టి కృతిని చెప్తే కవిగారి శత్రువుకు సకల రోగబాధలూ కలుగుతాయట.

క.
ఖగపతి కింవద భన నది
భగణం ; బుడురాజు తదధిపతి ; భగణాద్యం
బుగనుం గృతి చెప్పునపుడు
మృగాంకుఁ దలపంగ నగు సమీహిత కాంతుల్.
17

పింగళుడు కింవద అని అనగానే ఒక గురువు రెండు లఘువులు కలిగిన భగణం పుడుతుంది. దీనికి అధిదైవతం ఉడురాజు. భగణంతో కృతి చెప్పినపుడు చంద్రుని తలుచుకుంటే సమీహిత కాంతులు కలుగుతాయట.

క.
సహస నని పలుక నగణం
బహతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుడు; త
ద్విహితస్మృతి నాయువు గడు
విహితం బగు నగణముఖ వినిర్మాణములన్
18

పింగళుడు సహస అని పలగ్గానే మూడు లఘువుల నగణం ఏర్పడుతుంది. దాని కధిదైవతం ప్రాణుడు. దీనితో కావ్యనిర్మాణం సాగిస్తే ఆయువు క్షీణిస్తుందట.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks