నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 26, 2010

గురు లఘువులు గలములు; లఘు గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్

క.
గురు లఘువులు గలములు; లఘు
గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్;
గురులఘువులు త్రితయము లై
మురిసిన నవి మగణ నగణములు నాఁ బరఁగున్ 19.


ఒక గురువు ఒక లఘువు కలసి UI గల ములు అవుతుంది. ఒక లఘువు ఒక గురువు IU వ గణము, ఒక గురువు ఒక లఘువు UI హ గణము అవుతుంది. మూడేసి గురువులు UUU మ గణముగాను, మూడేసి లఘువులు III న గణము గాను అవుతాయి.

ఆ.
మగణ రచన కాది మధ్యాంత లఘువులు
గలిగె నేని య ర త గణము లయ్యె
నగణ రచన మొదల నడుమను గడ గురు
వుండెనేని భ జ స లొప్పు మిగులు. 20


మగణమునకు UUU మొదటను, మధ్యను, చివరను ( గురువుకు బదులుగా ) లఘువు ఉంటే య ర త గణములు . IUU య గణము, UIU ర గణము, UUI త గణము ఏర్పడుతాయి. అదేవిధంగా న గణమునకు III మొదటను, మధ్యను, చివరను ( లఘువుకు బదులుగా ) గురువు గనక ఉంటే UII భ గణము, IUI జ గణము, IIU స గణము ఏర్పడుతాయి.

క.
లోవంక వ్రాయ గురు వగు;
నేవంకయు లేనివ్రాఁత యెసఁగును లఘువై
జైవాతృక రేఖాయుత
భావజశరనిభము లండ్రుఁ ప్రాజ్ఞులు మఱియున్. 21


లోపలి వైపు వంక వచ్చునట్లుగా వ్రాస్తే U అది గురువుకు చిహ్నం అవుతుంది. ఏ వంకా లేకుండా తిన్నని గీతలా వ్రాస్తే I అది లఘువుకు చిహ్నమవుతుంది. వీటిని రెండింటినీ మన్మధుని యొక్క విల్లనీ బాణమనీ ప్రాజ్ఞులు పేర్కొంటారు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks