నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 14, 2009

పవరు ఇండ్ల కిచ్చి పవరు పొందు కొఱకు

ఆ.వె.
పవరు ఇండ్ల కిచ్చి 'పవరు' పొందు కొఱకు
'పవరు కట్టు' పెడితి 'ఫాక్టరి' లకు
'పవరు' వుండొ ? వూడొ ? భవితలొ నేనెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

ఆ.వె.
ఎన్ని కలలు ప్రజకు ? యెన్నికలన్నచో
అన్ని కల్లలయ్యె ! అంద ఱొకటె !
వోటు వేయు వారి వోట్లతొ నే నెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

ఆ.వె.
మైళ్ళ కొలది నడిచె - పాద యాత్రలొ తాను,
కాళ్ళు బొబ్బ లెక్కె కాదె ! నిజము ! !
మైలు కొక్క కోటి పైనె మిగిలె ; నికెట్లు
కోట్లు కూడఁ బెడుదు ? కుర్చి నెక్కి.

1 comments:

Amar said...

శెభాష్.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks