ఆ.వె.
వ్యక్తి గుణము కాదు అతని సేవయుఁ గాదు
డబ్బు ఖర్చు సేయు డాబు యొకటె
పార్టి సీటు కొఱకు పలుకు బడగు నెట్లు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ఆ.వె.
నాలుగేండ్లు రేట్లు ఆలాగె విద్యుత్కు
ఉంచినాము; పెంచ కుంచి నాము
అటులె పెంచబోము అయిదు వత్సరములు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
0 comments:
Post a Comment