ఆ.వె.
ఒకటి రెడ్ల పార్టి ఒకటి కమ్మ పార్టి
కాపు పార్టి ఒకటి కాన రాదు
అనుచు పార్టి పెట్టె ఆ చిరంజీవియు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ఆ.వె.
వయిటు కార్డ్లు తనకు వోట్లు వర్షించని
ఎఱ్ఱ కార్డ్లు అన్నిఏఱి వేసె
పెరిగినట్టి ధరలు పీక కోయును గదా
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ఆ.వె.
ఓట్ల కొఱకు '' ఫ్రీ" గ అన్ని చేసెదమంచు
పార్టి లన్ని చేయు ప్రామిసు లను
ఓటు వేయు దాక ఓడ మల్లన్నంద్రు
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
0 comments:
Post a Comment