నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 16, 2009

పవరు 'ఫ్రీ' గ నిత్తు పన్నెండు గంటలు

ఆ.వె.
పవరు 'ఫ్రీ' గ నిత్తు పన్నెండు గంటలు-
పగలు ; అనుచు బాబు వగలు పోవు
'పవరు' కొఱకె గాదె ? పలు బాస లిన్నెట్లు
కోట్లు కూడఁ బెడుతు ? కుర్చి నెక్కి.

2 comments:

amma odi said...

పద్యం చాలా బాగుందండి.

ఆత్రేయ కొండూరు said...

ఓట్లకు నేతల పాట్లివి
కోట్లుగ డించిన తరగని కోర్కెల చిట్టా
పొట్లము మరిగిన ఓటరు
ఎట్లెరుగును దేశపుగతి వేదుల సింహా ?

కుక్కలు నేతలు నిజమే
పిక్కలు నోటికి కరిచియె పీకిరి జనులన్‌
చుక్కలు చూచుచు నేడ్చిరి
నిక్కము నీజను లెపటికి నేర్తురొ సింహా !!

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks