కావ్యాలంకార చూడామణి -- సప్తమోల్లాసము -- ఛందః ప్రకరణము
క.
శ్రీ విశ్వేశ్వరునకునై I భావిత విశ్వేశ్వరాంఘ్రిపద్మునకై సం
భావిత పద వాక్య కళాI కోవిదునకై నయగుణ విశేష గుణ నిధునకునై. 1
విన్నకోట పెద్దయ మహాకవి ఎలమంచిలి పంచధారల ప్రాంత దేశపాలకుడైన చాళుక్య రాజు విశ్వేశ్వర భూపతికి ఆశ్రితుడు. ఈ విశ్వేశ్వర భూపతి రాజ రాజ నరేంద్రుని వంశములోని వాడు. కవి తన కావ్యాలంకార చూడామణిని తన ప్రభువుకు అంకితమిస్తూ ప్రతాపరుద్రీయములో వలెనే అన్నిటికిని ప్రభువునే విషయముగాఁ జేసి లక్ష్యములను వ్రాసినాడు. ఈ ఛందో ప్రకరణాన్ని కూడా తన ప్రభువు కొఱకే నని పైన చెప్తున్నాడు.
క.
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
నాయతమై యామ్నాయ పI దాయిత మగు ఛంద మొప్పిదముగ నొనర్తున్. 2
పింగళు డనబడే నాగము, హలాయుధుడు, జయదేవుడు మొదలైన ఆర్యులచే వేదములనుండి విస్తారముగా ఉద్ధరింపబడిన ఛందశ్శాస్త్రమును ఒప్పిదముగా చెబుతానంటున్నాడు.
క.
ఛందో విభ్రమ విధితోఁ I బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యరI వింద భవుని వదనములకు విభవం బొసగెన్. 3
ఛందశ్శాస్త్ర విభ్రమ విభవాన్ని పొందటం వల్లనే కదా వేదశాస్త్రములకు ఆ అరవింద భవుడైన బ్రహ్మ దేవుని నాలుగు వదనములకు వాక్కు అనబడే సరస్వతీ దేవి మందిరములg అనబడే వైభవం కలిగింది !
శా.
పొందై , గౌరవలాఘవప్రకృత మై , పూర్ణాక్షర స్నిగ్ధ మై,
యందం బై , శ్రుతిసమ్మతప్రకట మై , ప్రాపించు నానా విధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్య రత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లునే ఏరికిన్ ? 4
పొందు కలిగిన దై, తేలికగా గౌరవాన్ని పొందిన దై, పూర్ణాక్షరములతో స్నిగ్ధమైన సౌందర్యం కలిగి అందమైన దై, వేదములచే సమ్మతింపబడి ప్రకటితమైన దై ప్రాపించే నానా విధములైన ఛందస్సూత్రములు ఒకే లోకములో కదలుచున్న వాక్యములనబడే రత్నాలతో కూడిన సమూహములు ఎవరికైనా కంఠభూషణములుగా ఉంటాయా ?
క.
ఛందము వాఙ్మయ విద్యాI కందము యతిగమక సమకగణవృత్తకృతా
నంద మమందార్థకళాI విందము వాణీకరారవిందము ప్రతిభన్.5
ఛందస్సు విద్యకు అందాన్ని చేకూరుస్తుంది. ప్రతిభలో యతి గమకములతో కూడినదై వృత్తములతో చేయబడిన గొప్ప అర్థాలు కలిగిన కళావిందము , సరస్వతీ దేవి చేతికి అరవిందమై ఒప్పుతుంది.
తరువాత ఈ ఛందశ్సాస్త్ర మెలా ఉత్పన్నమైనదో చెపుతాడు.
Jun 24, 2010
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
Posted by
Unknown
4
comments
Jun 3, 2010
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సేనాపతి
Posted by
Unknown
0
comments
Jun 2, 2010
పరమపురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు
| ||||||||
Posted by
Unknown
0
comments
Jun 1, 2010
వలచి వచ్చితి నేను వానికిఁ గాను
దేసాళం వలచి వచ్చితి నేను వానికిఁ గాను నెలవై మీ గొల్ల వాడనే తానుండు న(ంటా)టా IIపల్లవిII చెందమ్మికన్నులవాఁడు చేతిపిల్లఁ గోవివాఁడు యిందు వచ్చెఁ గంటిరా యేమిరే యమ్మా మందలపసువులవాఁడు మకరాంకములవాఁడు యెందు నున్నాఁడు చెప్పరే యేల దాఁచేరమ్మా IIవలచిII నెమలిపించెమువాఁడు నీలమేఘకాంతివాఁడు రమణుఁ డాతఁడు, మొక్కే రమ్మనరమ్మా జమళి చేతులవాఁడు సంకుఁజక్రములవాఁడు అమర మీపాలఁ జిక్కునట చూపరమ్మా. IIవలచిII పచ్చఁబైడిదట్టివాఁడు పక్షివాహనపువాఁడు యిచ్చినాఁడు నా కుంగర మిదివో యమ్మా చెచ్చెరఁ గొనేటివాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు వచ్చి నన్నుఁ గూడినాఁడు వాఁడువో యమ్మా. IIవలచిII 18-14 | |||||
Posted by
Unknown
1 comments
May 25, 2010
సందడి విడువుము సాసముఖా
ధన్నాసి
సందడి విడువుము సాసముఖా
మంధర ధరునకు మజ్జన వేళా IIపల్లవిII
అమరాధిపు లిడుఁ డాలవట్టములు
కమలజ పట్టుము కాళాంజి
జమిలి చామరలు చంద్రుఁడ సూర్యుఁడ
అమర నిడుఁడు పరమాత్మునకు. IIసందII
అణిమాదిసిరుల నలరెడు శేషుఁడ
మణిపాదుక లిడు మతి చెలఁగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును. IIసందII
వేద ఘోషణము విడువక సేయుఁడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీ దేవుండగు శ్రీ వేంకటపతి
ఆదరమున సిరు లందీ వాఁడె. IIసందII 1-12
కాళాంజి = తమ్మపడిగము, పతద్గ్రాహము ( పిల్లి అంటే బిడాలము అన్నట్టుంది కదూ)
Posted by
Unknown
1 comments
May 21, 2010
సారెకు నంటకురే జడనందురు
శంకరాభరణం సారెకు నంటకురే జడనందురు ధీరుఁడాతఁడున్నతపు దేహియట IIపల్లవిII బాయిటఁ బెట్టకురే పక్షులు పారెడిపొద్దు వోయమ్మ బాలులకు నొప్పదందురు మాయపుఁ బులుగొకటి మచ్చికనీ బాలుని చేయిచ్చి యెక్కించుకొనఁ జేరీనట. IIసారెII పంచలఁ దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు కొంచెపుబాలులఁ బై కొనునందురు మించిన పామొకటి మెరసి యీ బాలుని దించక యెక్కించుకొనఁ దిరిగీనట. IIసారెII అలమి పట్టకురే అంటఁ గాకుండెడివారు తొలరమ్మ బాలులకు దోసమందురు కలికి యీ తిరువేంకటపతిఁ గదిసిన చెలఁగి వేగమే చీరచిక్కీనట. IIసారెII 5-247 |
Posted by
Unknown
0
comments
May 20, 2010
రాధామాధవరతిచరితమితి
రీతిగౌళ రాధామాధవరతిచరితమితి బోధావహం శ్రుతిభూషణం IIపల్లవిII గహనే ద్వావసి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి విహరత స్తదా విలసంతౌ విహత గృహాశౌ వివశౌ తౌ . IIరాధాII లజ్జాశబళ విలాసలీలయా కజ్జలనయన వికారేణ హృజ్జావ్యవహృత (హిత?) హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా. IIరాధాII పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజై ర్వా పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా గిరం వినాపి వికిరతి ముదం. IIరాధాII హరి సురభూరుహ మర్హతివస్వ -( మారోహతీవ ?) చరణేన కటిం సంవేష్ట్య పరిరంభణ సంపాదిత పులకై - స్సురుచిర్జాతా సుమలతికేవ. IIరాధాII విధుముఖదర్శన విగళతిలజ్జా - త్వధరబింబఫలమాస్వాద్య మధురోపాయనమార్గేణ కుచౌ నిధివద (ద్ద?) త్వా నిత్యసుఖమితా. IIరాధాII సురుచిరకేతక సుమదళ నఖరై - ర్వరచిబుకం సా పరివృత్య (వర్త్య?) తరుణిమసింధౌ తదీయదృగ్జల - చరయుగళం సంస్తకం చకార . IIరాధాII వచన విలాసైర్వశీకృత (త్య?) తం నిచులకుంజ మానితదేశే ప్రచురసైకతే పల్లవశయనే రచితరతికళా రాగేణాస. IIరాధాII అభినవకల్యాణాంచిత రూపా - వభినివేశ సంయతచిత్తౌ బభూవతు స్తత్పరౌ వేంకట - విభుణా (నా?) సా తద్విధినా సతయా. IIరాధాII సచ లజ్జావీక్షణో భవతి తం కచభరం (ర?) గంధం ఘ్రాపయతి నచలతిచేన్మానవతీ తథాపి కుచసంగాదనుకూలయతి. IIరాధాII అవనత శిరసాప్యతి సుభగం వివిధాలా పైర్వివశయతి ప్రవిమల కరరుహరచన విలాసై - ర్భువనపతి(తిం?) తం భూషయతి. IIరాధాII లతాగృహమేళనం నవసై - కతవై భవ సౌఖ్యం దృష్ట్వా తత స్తతశ్చరసౌ (శ్చరతస్తౌ?) కేలీ - వ్రతచర్యాం తాం వాంఛంతౌ. IIరాధాII వనకుసుమ విశదపరవాసనయా ఘనసారరజోగంధైశ్చ జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ. IIరాధాII ఏవం విచరన్ హేలా విముఖ - శ్శ్రీ వేంకటగిరి దేవోయం పావనరాధా పరిరంభసుఖ - శ్రీ వైభవసుస్థిరో భవతి. IIరాధాII 5-166 |
Posted by
Unknown
0
comments
నా బ్లాగు రెండవ వార్షికోత్సవం.
నా బ్లాగు ప్రయాణంలో-------- | ||||
ఇదే రోజు . రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటి బ్లాగును ప్రారంభించాను. అదే "నరసింహ" పేరుతో. | నేను బ్లాగు మొదలుపెట్టడానికి కారణమైన బ్లాగు మాత్రం తెలుగు పద్యం బ్లాగు . ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. | క. బ్లాగెడిది భాగవతమట బ్లాగించెడి వాఁడురామభద్రుండట నే బ్లాగిన భవహర మగునట బ్లాగెద వేరొండు గాథ బ్లాగగ నేలా . అసలు ఈ 'బ్లాగు' అనే ఆంగ్ల పదానికి సరియైన తెలుగు అర్థం ఎవరైనా పెద్దలు తెలియజేస్తే కృతజ్ఞుడినై వుంటాను. భక్త కవి పోతన గారికి క్షమాపణలతో--- |
Posted by
Unknown
4
comments
Apr 28, 2010
నిర్వచన రామాయణం
సంగ్రహ నిర్వచన రామాయణం - ఈ పుస్తకాన్ని ఎప్పుడు కొన్నానో గుర్తు లేదు. ఈ రోజే చదువుదామని మొదలు పెట్టాను. పుస్తకం క్రింద పెట్టకుండా చదివించింది. ఉదయం మొదలుపెట్టి సాయంకాలానికి పూర్తిచెయ్యగలిగాను. దీని రచయిత కీర్తి శేషులు దరిమడుగు మల్లయ్య గారు. కుల్లూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ప్రకాశకులు:దరిమడుగు మల్లికార్జునరావు,కర్నూలు రోడ్డు, ఒంగోలు - 2. టి.టి.డి. వారి ఆర్ధిక సహాయంతో ప్రచురించబడింది. మొదటి ముద్రణ ఏప్రియల్ 1988. వెల 27 రూపాయలు. రామాయణ గాథను ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా - పద్యకావ్యాల రూపంలో గాని, వచనకావ్యాలు గా గాని, ద్విపదలుగా గాని , వ్యాఖ్యాన సహిత మందరాలుగా గాని, కల్పవృక్షాలుగా గాని, ఆటవెలదుల రూపంలోగాని, గద్యపద్యాత్మకంగా గాని, నిర్వచన గ్రంథాలుగా గాని నాటక రూపంలో గాని - ఇలా ఎన్నెన్ని ప్రక్రియలు అందుబాటులో ఉంటే అన్నన్ని ప్రక్రియలలోనూ మన ఆంధ్రులు వ్రాసుకుని, చదువుకుని , పాడుకుని, ఆడుకుని ఆనందిస్తూ ఉన్నారు. ఇన్నిన్ని రకాలుగా ఇందరిందరు ఆదరిస్తున్నారంటే అది ఆ కథ కున్న గొప్పదనం, ఆదర్శ పురుషుడుగా రూపొందించబడ్డ ఆ శ్రీరామావతారపు గొప్పదనం. దానిని ఆదికవి వాల్మీకి తీరుగా మలచి మన కందించిన రామాయణ గ్రంథం గొప్పదనం. దరిమడుగు మల్లయ్య గారి గ్రంథం లో ఉత్తరకాండ లేదు. వీరి రచన పూర్తి ద్రాక్షాపాకం. సులభమైన శైలి. నిఘంటువులు చూడాల్సిన అవసరం కలగదు. మంచి ధారతో సాగిపోతుంటాయి వీరి పద్యాలు. ఉదాహరణ ప్రాయంగా కొన్నింటిని ఇక్కడ ఉదాహరిస్తాను. రామ కథను గుఱించి-- సీ. పుడమి పాలకులకే పురుషోత్తముని రాజ్య మాదర్శమై నేటి కలరుచుండు ఏకపత్నీ వ్రతాస్తోక ధర్మమునకే వాని వర్తన కొలబద్ద యయ్యె ఎనలేని పితృభక్తి కే వీరుని చరిత్ర తరతరాలకు మార్గదర్శి యయ్యె పట్టాభిషేకంబు వనవాస గమనంబు సమదృష్టి గై కొన్న శాంతు డెవడు తే. ఎవని సహధర్మచారిణి యిద్ధ చరిత మఖిల లోకాల కాదర్శమై వెలింగె అట్టి గుణనిధి శ్రీరాము డనవరతము కీర్తనీయుండు గాదె యఖిల జనులకు. తే.అట్టి ఆదిపురుషుని యవతార మందు నాది కావ్య మగుటను వేదాను కారి యగుట భక్తి పారాయణ మొనర్చి వాంఛితార్థ సిద్ధి గనుచుందురనుట ప్రసిద్ధమెగద ! శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ -- చ. అనుపమ రూప సద్గుణ గణాధికుడై జనకోటి చిత్త రం జనుడయి సర్వమానవ విశాల సుదృక్పధుడై ప్రసన్నుడై మనునిభుడై గురూత్తముల మాన్యుల ముందు వినమ్రుడై వివ ర్ధను డగుచుండె చూపరకు ధన్యత గూర్చుచు రాము డెంతయున్. అహల్యా వృత్తాంతంలో అహల్యను గుఱించి అంటారిలా -- తపసి సేవలందు దనియుదురే వయః పరిణతాంగులైన భామలెందు. గీ.భూర్భువంబులందు బుట్టెడి జీవులు కామ విజయమింత గాంచగలరే గరళమాహరించు పరమేశ్వరుడు దక్క నన్నమయ శరీరు లర్హులెట్లు. అంటారు.చాలాచోట్ల సామెతలవంటి ప్రయోగాలు చాలా చేసారీయన తన రచనలో. పాపపు ఫలమేల తప్పు బలియుర కైనన్. వికసిత హృదయంబులు రెం డొకటిగ నతుకుటయె పెండ్లి యువతీయువకుల్ ఆడుపులి గాదె వృద్ధాప్యమక్క టకట. తలచిన పనులేలగావు ధరణీశులకున్ --------------------------స్వార్ధ పరులు పరిగణింతురె సుంతైన పరులబాధ. పతి సమీపము సతికెంత పరమ సుఖమొ. పెక్కు ధనములున్న మక్కువ సుతులున్న నాతి భర్త లే కనాథ గాదె! (లేక+అనాథ) తాపసుల కెగ్గొనర్చిన పాపాత్ములు సేమమందు వారలె యెందున్. భువన భారంబు శేషుడే పూనవలయు వానపాముల కలవియే వసుధ దాల్ప. రవి యుదయింపకున్న తిమిరం బడగించెడి దీపమున్నదే. ------------------------------------------ అధోముఖంబుగా పరగునె యగ్నికీలలెటు తిప్పిన నుత్పధగాములే గదా ! పతికి నెనయగు దైవంబు పత్ని కేది ? దుష్టశిక్షణంబు శిష్టరక్షణంబు సలుపలేని వాడు క్షత్రియుండె ! కుడిచి కూర్చుండ నేరక కొంపగూల్చు కొనెడి తలసీలగల్గెనో కోయటంచు. చేటుకాలమునకు చెడుబుద్ధులన్నట్లు పరహితంబున నసువు లర్పణ మొనర్చు జన్మమే జన్మమది భువి సార్ధకంబు. ధనువిదేల నాకు తనువిదేల ? యత్నమొనరించి జాడ దీయంగ వలయు యత్నపరులకె దైవ సహాయ మొదవు. ---- సద్వర్తనులైన మానవులనే కీడుల్ వరించుం గదా ! కష్టపడియును ఫలితంబు గాంచనైతి. చావు సహజంబు పుట్టిన జంతుతతికి గాన రణరంగ మరణమే కాంక్షితంబు. ప్రాణ మున్నంతకే గదా పగలు వగలు. కాలచక్రమునకు గమనంబు నిల్చునే క్షణము వెనుక క్షణము జరుగుచుండు. దిక్కరి చావనైనను పతివ్రత మానము గోలుపోవునే. కంతు జయంబు మర్త్యులకు గల్గిన మృత్యుజయంబు గల్గదే ? పరశురామ ప్రీతి బరగజేసె. ఇటువంటి అందమైన నుడులు నానుడులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇవేకాక కథాసందర్భంనుంచి విడిగా చెప్పుకోదగిన పద్యాలు కూడా చాలా ఉన్నాయి. మచ్చుకు ఒకటి రెండు.. స్నేహితుని గుఱించి - తన శుభంబుల గాంచి సంత సిలువాడు కడు దరిద్రంబు లోన రొక్కమిడువాడు ఆపదల నాదు కొనగలయట్టి వాడు జీవితంబున కొక్కడే స్నేహితుండు.కర్మమునబుట్టు జంతువు కర్మముననవృద్ధి బొందు కర్మమున జెడున్ కర్మమె దైవంబని తా నిర్మల కర్మం బొనర్ప నేర్వగ వలయున్. కనకపు గట్టెంకించెడి ఘనతరమగు నాసజూపు కాలంబందే ఎనలేని దుఃఖసముదయ మునకు న్నిష్కరుణ ద్రోయు పో విధి యెందున్. వృద్ధమగల ప్రార్ధనోక్తులు వలతురే పడుచుదనము గల్గు భామలెందు వేడుచున్నకొలది ద్వేషింతురే గాని అసమ వయసు మతుల నతుకవశమె.రాజ్యకాంక్ష జేసి రమణుల తనుజుల నైన నమ్మకుందు రధిపులెందు నమ్మినట్ల యుండి నమ్మమి యురవగు నీతియండ్రు ధర్మనిపుణమతులు. అయోధ్యా కాండం ప్రారంభంలోని అందమైన సీస పద్యాన్నోసారి గమనించండి. మోముపై చర్మంబు ముడుతలు తఱుచగు చూపుపై నరచేయి ప్రాపుగొనును తరుణి దూరంబగు తలయెల్ల తెల్లనౌ మిసమిసమీసాలు పసదొలంగు తనువున బలసంపద తొలంగు దంతంబు లను బంధులొక్కొక్కరవల దొలగు భత్యమియ్యని భృత్యు కైవడి యావదింద్రియములు నాజ్ఞమీరు జరభరంబున కోర్వక శిరము వడకు వార్థకపు భూషణంబగు వంకుకర్ర యేమఱకయుండు ముదివగ్గు నేమిజెప్ప నాడుపులిగాదె వృద్ధాప్య మక్కటకట. ఆయువల్పమైన నాసయు నధికమై చేతులుడుగుచుండ చింతలెదుగు పడుచువారి చేష్టలుడికించు వృద్ధుల ముసలితనముకంటె ముప్పుగలదె. సీతారాములవివాహసమయంలో వారు ఒకర్నొకరు ఈ విధంగా చూసుకున్నారట. సీ. వరుని చూపులుతన్వి శిరముపై వ్రాలి మో మునజేరి కన్నుల మున్గితేలి చెక్కిళ్ళపైనుండి జక్కవ చనుదోయి దూరి మధ్యంబు పై దొడరి పాద తలమున జేరంగ తన్వి వీక్షణములు వరుని పాదాబ్జంబులరసి పెరిగి జానుయుగ్మకము విశాల వక్షస్థలి నరసి సుందర వదనారవింద మందుబ్రాకియు సిగ్గుచేనచటనుండి మరలిస్వస్థానమునజేరు నిరువురిట్లు ప్రియునపాంగ వీక్షణముగల నూతనప్రేమవీక్షణోపేతులైరి. ఇంకా ఇంకా చాలా చాలానే వ్రాయాలనుంది కాని చదువరులకు ఇబ్బంది కలగొచ్చునేమో అనిపించి యిక్కడితో ముగిస్తున్నాను. మీ మీ అభిప్రాయాలు తెలియపరిస్తే సంతోషించగలవాడను. |
Posted by
Unknown
1 comments
Apr 27, 2010
త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే
త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే తదంత రస్య సర్వస్య, తదు సర్వ స్యాస్య బాహ్యతః. 5 కం. అది కదలును మఱి కదలదు అదెవరి కందనిది గాని యందఱ కందున్ అది యన్నిటిలోపలఁ గల దది యన్నిటి బయటఁ గూడ నగపడుచుండున్. ఆయాత్మ కదులును, అది కదలదు, అది దూరముగ నున్నది. అట్లే దగ్గరగ నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క లోపల నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క వెలుపలను ఉన్నది. |
Posted by
Unknown
0
comments
Subscribe to:
Posts (Atom)