Feb 1, 2014
వర్ణన రత్నాకరము-3(రసికజన మనోరంజనము)
Posted by
Unknown
0
comments
వర్ణన రత్నాకరము-2 (కవిజన చకోర చంద్రోదయము)
Posted by
Unknown
0
comments
Jan 30, 2014
వర్ణన రత్నాకరం -1 (ఒడయనంబి విలాసం నుండి)
Posted by
Unknown
2
comments
Jan 29, 2014
వర్ణన రత్నాకరం
Posted by
Unknown
0
comments
May 18, 2013
మరచిపోలేని మంచిరోజు
Posted by
Unknown
3
comments
Mar 12, 2013
నా అనువాద పద్యాలు(సంస్కృత శ్లోకాలకి)
ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలకు నేను చేసిన తెలుగు పద్యానువాదాలు.పెద్దలు తప్పులున్న తెలియజేయ ప్రార్థితులు
వేత్తి గాన రసం ఫణిఃI
కోవేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవాII
శిశువులు పశువులు పాములు
వశులగుదురు గానమునకు వసుధను చూడన్
వశమా కవితా తత్త్వము
శశిధరునకు నైనతెలియ? శక్తులె యితరుల్?
చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీI
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃII
చితి చింతల రెంటి నడుమ
చితి కంటెను చింత యధిక చింతా కరమౌ
చితి కాల్చును నిర్జీవిని
చితి లేకయె కాల్చు చింత జీవముతోనే.
మితం దదాతి హి పితా
మితం మాతా మితం సుతఃI
అమితస్య తు దాతారం
భర్తారం కాన పూజయేత్II
మితముగ నిచ్చును తండ్రీ
మితమును మించకయె యిత్రు మాతా సుతులున్
మితమును లేకయె యిచ్చును
పతి యెప్పుడు సతికి కాన ప్రణతులు సేయున్.
వృశ్చికస్య విషం పుచ్ఛం
మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రా
సర్వాంగం దుర్జనే విషం.
విషముండు కొండి తేలుకు
విషముండును మక్షికముకు వెలయగ తలలోన్
విషముండు కోర పాముకు
విషముండును ఖలునకు నిలువెల్లను చూడన్.
రజనీకరః కిల శీతో
రజనీకరా చ్చందనో మహా శీతః
రజనీకరచ్ఛందనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.
రజనీ కరుడగు చల్లన
రజనీకరు మించి చలువ వ్రాసిన గంధం
రజనీకర గంధములకు
సుజనుల వచనములు మిన్న శుభములు గూర్చున్.
జీవితం ధర్మ కామౌచ
ధనే యస్మాత్ప్రతిష్ఠితౌ
తస్మాత్సర్వ ప్రయత్నేన
ధనహింసాం వివర్జయేత్.
ధనమాధారము బ్రతుకుకు
ధనమే కావలయు కామ ధర్మములకునై
ధనమును రక్షించవలయు
అనయము ధనహింసవిడచి అవనిలొ మనుజుల్.
సంతుష్టో భార్యయా భర్తా
భర్త్ర్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం
కల్యాణం తత్ర వై ధృవం.
సతి వలన సుఖము పతికిని
పతి వలనను సుఖము సతికి పదపడి కలుగున్
పతి సతుల గేహమందున
సతతము కల్యాణమౌను సందియ మేలా?
న జాతు కామః కామానాం
ఉపభోగేన శామ్యతి
హవిషా కృష్ణ వర్త్మేవ
భూయ ఏవా2భి వర్ధతే.
అనుభవించిన కోరిక లంత మగునె?
ననలు సాగుచు నుండు నంతంబు లేక
ఘృతము వోసిన భగ్గను హుతము వోలె!
కోరికల ద్రుంచ మే లొనగూడు భువిని.
మతయో యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి వానరాః
శాస్త్రాణి యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి తే నరాః.
మతులెటు నడపునొ తమ నా
గతులనె అవి పోవుచుండు కోతులు చూడన్
శృతులెటు నడపునొ తమ నా
గతులనె చనుచుంద్రు నరులు కాలములోనన్.
గీతే వాద్యే తథా నృత్యే
సంగ్రామే రిపు సంకటే
ఆహారే వ్యవహారే చ
త్యక్త లజ్జః సుఖీ భవేత్.
సంగీత నృత్యములలో
సంగ్రామములోన శతృ సంకట మపుడున్
ఓగిర వ్యవహారమ్ముల
మోమోటమి వదలువాడె మోదము నందున్.
గురు శుశ్రూషయా విద్యా
పుష్కలేన ధనేన వా
అథవా విద్యాయా విద్యా
చతుర్యా న్నోప లభ్యతే.
విద్యను గురు శుశ్రూషనె
విద్యను ధనమిచ్చి లేక విద్యను యొసగీ
విద్యను బడయగ వచ్చును
విద్యను పొందను మరియొక విధమే లేదే.
Posted by
Unknown
1 comments
Jan 23, 2013
మా పాఠశాలలో జరిగిన మా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
చాలా కాలం తర్వాత ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కారణం ఏమిటంటే మొన్నను ఆదివారం నాడు (20
జనవరి,2013 తేదీన) ఉండ్రాజవరం (మా స్వగ్రామం) లోని మల్లిన వెంకట నర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల
విద్యార్థులం (11 వ తరగతి 1963-1969 వరకు గల) అందరం మా పాఠశాలలో చేరి ఒకరితో ఒకరం మా పాతకాలం
నాటి తీపి గురుతులను నెమఱు వేసుకోవటం జరిగింది. కార్యక్రమం మొదటగా ఒక్కొక్కరు విడి విడిగా పాసుపోర్టు
సైజు ఫొటో దిగటం(సావనీరు నిమిత్తం), అల్పాహారం పూర్తి చేసుకొని అందరూ అందరితో సరదాగా కబుర్లు
చెప్పుకోవటం, ప్రతి తరగతిలోని విద్యార్థులు అందరూ తరగతులవారీగా రంగస్థలం మీదకి వచ్చి తమ తమ
పరిచయాలను క్లుప్తంగా చెప్పటం, తరువాత మా పాఠశాల నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారి వారసులను
సముచితంగా సత్కరించుకోవటం, మా పూర్వ ఉపాధ్యాయులను రంగస్థలం మీద అపురూపంగా సత్కరించు
కోవటం, గానా బజానా కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు (పిల్లలతో) చేయించటం, చివరగా మిమిక్రీ
కార్యక్రమం అంతా చాలా అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమం జరిగిన విధానాన్ని సావనీరు రూపంలో అచ్చొత్తించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాం. ఈ
కార్యక్రమానికి కావలసిన నిధులను మా పూర్వ విద్యార్థులంతా కలసి సమకూర్చుకున్నారు.ఈ కార్యక్రమ
నిర్వహణకు సహకరించిన సహ విద్యార్థులు ముఖ్యంగా మల్లిన శేషగిరి రావు, కుదప శివకేశవ రావు, గూడుపు
సుబ్బారావు, చిట్టూరి సుబ్బారావు, బూరుగపల్లి చిన్నారావు, మొదలైన (అందరి పేర్లూ రాయనందుకు మీరంతా
నన్ను క్షమించాలి) వారంతా ఎన్నో రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు. ఈ సందర్భంగా
మొగ్గతొడిగిన ఇంకో ఆలోచన ఏమిటంటే గత 50 సంవత్సరాలుగా మా పాఠశాలలో చదివిన విద్యార్థులమంతా తిరిగి
మళ్ళీ కలసి మా పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలను 50 గంటలపాటు నిరంతరాయంగా జరుపుకుంటే
బాగుంటుందనేది. ఈ కార్యక్రమాన్నీ ఇదే ఇనుమడించిన ఉత్సాహంతో పూర్తి చేసుకోగలమని నమ్ముతున్నాను.
ఇంక ప్రస్తుతానికి శెలవు.
Posted by
Unknown
2
comments
Dec 27, 2012
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ -2
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్నతల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిఱునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి. IIమా తెలుగుII
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక IIమా తెలుగుII
అన్నమయ కీర్తనల అపురూప భావాల
నర్తించు అలమేలు మంగమ్మ నాట్యమ్ము
రామదాసు నిలదీయు శ్రీరామచంద్రుడి
మొగమున చిప్పిల్లు చిఱునవ్వు మంత్రమ్ము IIమా తెలుగుII
కూచిపూడిని వెలయు భామాకలాపమ్ము
అందాల హరివిల్లు మన ఆంధ్రనాట్యమ్ము
నారాయణాచార్య నాట్య శివతాండవము
అలరించు మురిపించు మనసునే వెలిగించు IIమా తెలుగుII
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం-- నీ పాటలే పాడుతాం.IIమా తెలుగుII
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!
ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రచురించబడిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" డదివిన తర్వాత నాకు తోచిన రెండు చరణాలను చేర్చుదామనిపించి పై విధంగా వ్రాసాను. పెద్దలు నేను చేసినది సరైన పని కాదని అనుకుంటే వారిని క్షమించమని కోరుచున్నాను. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవం మఱియు నటరాజ రామకృష్ణ గారి ఆంధ్రనాట్యం కూడా వారి కాలానికి తరువాతివేమోనన్న శంక కూడా నాకు కలుగుతోంది. ఈ రెండూ వారి కాలంలోనివి కాకపోయినా కూడా వాటిని ఇక్కడ వ్రాయటం నాకు సమంజసం గా తోచి వ్రాసాను.తప్పైతే అంతా నన్ను క్షమించమని నా మనవి.
దీనితో పాటుగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ తరుణంలో నేను ఎప్పుడో బ్లాగిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ"ను కూడా క్రింది లింకులో వీక్షించగలరని తలుస్తున్నాను.
Posted by
Unknown
1 comments
Dec 15, 2012
శివమానస పూజా స్తోత్రం
శివమానసపూజా స్తోత్రంరత్నైః కల్పిత మాసనం హిమజలైః - స్నానం చ దివ్యాంబరంనానారత్న విభూషితం మృగమదా - మోదాంకితం చందనమ్జాతీచంపకబిల్వపత్రరచితం - పుష్పం చ ధూపం తథాదీపం దేవ దయానిధే పశుపతే - హృత్కల్పితం గృహ్యతామ్.సౌవర్ణే నవరత్నఖండరచితే - పాత్రే ఘృతం పాయసంభక్ష్యం పంచవిధం పయోదధియుతం - రంభాఫలం పానకమ్శాకానా మయుతం జలం రుచికరం - కర్పూరఖండోజ్జ్వలంతాంబూలం మనసా మయా విరచితం - భక్త్యాప్రభో స్వీకురు.ఛత్రం చామరయో ర్యుగం వ్యంజనకం - చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలా - గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా - హ్యేత త్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో - పూజాం గృహాయ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః - ప్రాణా శ్శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా - నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణవిధిః - స్త్రోత్రాణి సర్వా గిరో య ద్యత్కర్మ కరోమి తత్త దఖిలం - శంభో తవారాధనమ్. కరచరణకృతం వా కర్మవాక్కాయజయం వా శ్రవణ నయనజం వా మానసం వా 2 పరాధం విహిత మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఇతి శివమానస పూజా స్త్రోత్రం శివ మానస పూజా స్త్రోత్రం |
Posted by
Unknown
0
comments
Subscribe to:
Posts (Atom)