మూల పాఠం దేసాక్షి | |||||
వేదవేద్యులు వెదకేటి మందు ఆది నంత్యము లేని ఆ మందు. అడవిఁ మందులు గషాయములు నెల్లవారు కడగానక కొనఁ గాను తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి- నడియాలమైనట్టి ఆ మందు . లలితరసములుఁ దైలములు నెల్లవారు కలకాలము గొనఁ గాను చెలువైన దొకమందు చేరె మాకు భువి- నలవిమీఱిన యట్టి యా మందు . కదిసిన జన్మరోగముల నెల్లవారు కదలలేక వుండఁ గాను అదన శ్రీవేంకటాద్రి మీఁది మందు అదివో మా గురుఁ డిచ్చె నా మందు. ఇప్పుడు ఛందం లో ఉంచి మంజరీ ద్విపదకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసిన పాఠం.
వేదవేద్యులు వెదకేటి మందేది
ఆది నంత్యము లేని ఆ మందు చూడు
అడవిమందులుఁ గషాయములు నెల్లండ్రు
కడగానక కొనఁగానామందునున్ను
తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాల మైనట్టి ఆ మందు చూడు.
లలితరసములుఁ దైలములెల్లవారు
కలకాలము గొనఁగానామందునున్ను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవి మీఱినయట్టి యా మందుచూడు
కదిసిన జన్మ రోగములెల్లవారు
కదల లేకుండఁగా నామందునున్ను
అదన శ్రీవేంకటాచలమున్న మందు
అదివొ మా గురుఁ డిచ్చె నా మందు నేడు 1-2.
తొడిఁబడ |
Jul 10, 2014
అన్నమయ్య సంకీర్తనలు - ఛందస్సు(కొనసాగింపు-1)
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment