ఇక మూడవ సంకీర్తన హీనదశలఁ బొంది యిట్ల నుండుట కంటె నానా విధులను నున్న నాఁ డే మేలు. అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి పరిభవములనెల్లఁ బడితిఁ గాని యిరవైన చింత నాఁ డింత లేదు యీ- నరజన్మము కంటె నాఁ డే మేలు. తొలఁ గక హేయజంతువుల యందుఁ బుట్టి పలు వేదనల నెల్లఁ బడితిఁ గాని కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁ గి నలఁగి తిరుగుకంటె నాఁ డే మేలు. కూపనరకమునఁ గుంగి వెనకకు నేఁ బాప విధుల నెల్లఁ బడితిఁ గాని యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె నాపాలఁ గలిగిన నాఁ డే మేలు. 1-3 దీనిని కూడా ఛందం లో ఉంచి మార్పులు చేర్పులు చేయగా అది పాత గణన పద్ధతిలో చూడగా "అల్పాక్కర" గా రూపుదిద్దుకుంది. చూడండి.
దేసాక్షి
అల్పాక్కర
హీనదశలఁ బొంది ట్లున్న కంటె
నానా విధుల నున్న నాఁ డే మేలు.
అరుదైన క్రిమి కీటకముల బుట్టి
పరిభవముల బడియుంటి గాని
యిరవైన చింత నాఁ డింత లేదీ
నరజన్మమున కంటె నాఁ డే మేలు.
తొలఁ గక హేయ జంతువుల బుట్టి
పలు వేదనల నెల్లఁ బడితిఁ గాని
కలిమియు లేమియుఁ గాన నేఁ డు
నలఁ గి తిరుగు కంటె నాఁ డే మేలు.
కూపనరకమునఁ గుంగి నేఁ ను
బాపవిధులనెల్లఁ బడితిఁ గాని
యేపునఁ దిరువేంకటేశ యిట్లు
నాపాలఁ గలిగిన నాఁ డే మేలు. 1-3
|
Jul 10, 2014
అన్నమయ్య సంకీర్తనలు - ఛందస్సు (కొనసాగింపు -2)
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment