వర్ణన రత్నాకరము -స్త్రీ ధర్మములు -శ్రీమదాంధ్ర మహా భారతము -నన్నయ - ఆదిపర్వము
పాండవులు లాక్షాగృహదహనం వలని అపాయన్నుండి బయటపడిన తర్వాత అడవులలో పరిభ్రమిస్తూ ఏకచక్రపురంలో ఓ బ్రాహ్మణుని ఇంట ప్రచ్ఛంన్నంగా గడుపుతున్న సమయంలో ఆ రోజు వారుంటున్న ఇంటి యజమాని గృహంలోనుంచి ఏడుపులు వినవస్తాయి.
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, త్కృతి దానికి సమము సేఁత మధ్యమము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యత్తమంబు కృతబుద్ధులకున్. 6-244
అని కుంతి భీమునితోఅనగా భీముడు ఆపద ఏదైనా నేను తీర్చగలను అని అంటాడు. సరే విషయం కనుక్కుని వస్తానని కుంతి వారింటికి వెళ్తుంది.
అప్పుడు
బకాసురునికి ఆహారంగా వెళ్ళటానికి వారింటి వంతు రావటం చేత ఆ యింటి యజమాని
భార్యనుగాని, కొడుకును గాని,కూతురును గానీ పంపటానికి ఇష్టపడక తానే ఆహారంగా
వెళ్ళటానికి నిశ్చయించు కుంటాడు. ఆ ఘట్టంలోఅప్పుడు బ్రాహ్మణునితో ఆతని భార్య ఈ విధంగా అంటుంది.
క.
మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపగాఁ, జన దని యెఱిఁగియును దగునె సంతాపింపన్. 254
వ.
ఆ రక్కసున కే నశనం బయ్యెద మీరు వగవ కుండుఁడు భార్యయందుఁ బడయం బడు నపత్యంబు(సంతానము) నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక .
ఆ.
పురుషుకంటె మున్ను పరలోక మే గిన, సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత, యయ్యు జగము చేతఁ బ్రయ్యఁబడదె. 256
ఆ.
పడిన యామిషంబు పక్షు లపేక్షించు, నట్లు పురుషహీన యయినయువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు, రిదియుఁ బాప మనక హీనమతులు. 257
ఆ.
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార, సంగ్రహము సేఁత శాస్త్రమతము
పతి విముక్త యయినసతి కన్యపురుషు సం, గ్రహము సేఁత లోక గర్హితంబు. 258
అందుచేత నేనే బకాసురునికి ఆహారంగా వెళ్తానని బ్రాహ్మణి అంటుంది.
0 comments:
Post a Comment