వర్ణన రత్నాకరము - భాగవతము - బమ్మెర పోతన - స్త్రీధర్మములు
శరద్రాత్రి యందు గోపికలు గానము చేసెడి శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చే ఘట్టంలో ఆ గోపికలతో కృష్ణుడు వారిని వారిస్తూ చెప్పిన పలుకులు.
సీ.
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణి విభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ గులు సేయు
దలిదండ్రు లెఱిఁగిన దలలెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తివొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బలిసి చెఱుతు
ఆ.
రితరు లెఱిఁగి రేని నెంతయుఁ జులుకఁగాఁ, జూతు రిందు నందు సుఖము లేదు
యశము లేదు నిర్భయానందమును లేదు , జారుఁ జేరఁ జనదు చారుముఖికి. 10 పూర్వ.977
పోతన గారి శైలి దాని అందం వర్ణింప నలవి కానివి. కదా!
క.
నడవడి గొఱగాకున్నను, బడుఁ గైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
జడుఁ డైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్. స్కంద 10 పూర్వ, పద్య 978
నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాల్ని చెప్తూ శూద్ర ధర్మాల్ని వివరించే ఘట్టంలోని పద్యాలు.
సీ.
నిలయము వాటించి నిర్మల దేహి యై, శృంగార మే ప్రొద్దుఁ జేయవలయు
సత్యప్రియాలాప చతుర యై ప్రాణేశు, చిత్తంబు ప్రేమ రంజింప వలయు
దాక్షిణ్య సంతోష ధర్మ మేధావుల , దైవత మని ప్రియుఁ దలఁప వలయు
నాథుఁ డేపద్ధతి నడచు నా పద్దతి, నడచి సద్బంధుల నడప వలయు
ఆ.
మార్దవమునఁ బతికి మజ్జన భోజన, శయనపాన రతులు జరప వలయు
విభుఁడు పతితుఁ డైన వెలఁది పాతివ్రత్య, మహిమఁ బుణ్యు జేసి మనుప వలయు. 7-416
క.
తరుణి దన ప్రాణ వ ల్లభు, హరిభావముగా భజించి యతఁడును దానున్
సిరి కైవడి వర్తించును, హరిలోకమునందు సంతతానందమునన్. 7-417
క.
ఉపవాసంబులు వ్రతములుఁ, దపములు వేయేల భర్త దైవత మని ని
ష్కపటతఁ గొల్చిన సాధ్వికి, నృపవర! దుర్లభము లేదు నిఖిల జగములన్. 7-418
0 comments:
Post a Comment