దేసాళం వలచి వచ్చితి నేను వానికిఁ గాను నెలవై మీ గొల్ల వాడనే తానుండు న(ంటా)టా IIపల్లవిII చెందమ్మికన్నులవాఁడు చేతిపిల్లఁ గోవివాఁడు యిందు వచ్చెఁ గంటిరా యేమిరే యమ్మా మందలపసువులవాఁడు మకరాంకములవాఁడు యెందు నున్నాఁడు చెప్పరే యేల దాఁచేరమ్మా IIవలచిII నెమలిపించెమువాఁడు నీలమేఘకాంతివాఁడు రమణుఁ డాతఁడు, మొక్కే రమ్మనరమ్మా జమళి చేతులవాఁడు సంకుఁజక్రములవాఁడు అమర మీపాలఁ జిక్కునట చూపరమ్మా. IIవలచిII పచ్చఁబైడిదట్టివాఁడు పక్షివాహనపువాఁడు యిచ్చినాఁడు నా కుంగర మిదివో యమ్మా చెచ్చెరఁ గొనేటివాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు వచ్చి నన్నుఁ గూడినాఁడు వాఁడువో యమ్మా. IIవలచిII 18-14 | |||||
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
1 comments:
Audio IEలో మాత్రమే వస్తోంది. Firefoxలో వినరావటంలేదు, ఏంచెయ్యాలో ఎవరైనా తెలిస్తే చెప్పగలరు.
Post a Comment