నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 21, 2009

నక్షత్రపుఁ బేరిటి చెలి, నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,

మొన్నటి పద్యప్రహేళికకు ఇంకా ఎవ్వరూ సమాధానం పంపలేదు. అందుకనే ఇంకో చిన్న క్లూ ను కూడా ఇద్దామనిపించింది.

ఓ చాటుకవి ఆ కావ్యాన్ని గుఱించి అలా అన్నాడట.
కం.

నక్షత్రపుఁ బేరిటి చెలి,

నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,

నక్షత్రమునకు రమ్మని,

నక్షత్రముఁ బట్టి యీడ్చె నక్షత్రేశున్.


ఇప్పటికైనా అర్థం అవుతుందనుకుంటాను.

3 comments:

కామేశ్వరరావు said...

ఇప్పుడు తెలిసిందండి!

నక్షత్రపుఁ బేరిటి చెలి (- తార)

నక్షత్ర సుఖంబు (- ఆశ్లేష) గోరి నక్షత్రములోన్ (- చిత్త?),

నక్షత్రమునకు (- మూల) రమ్మని,

నక్షత్రముఁ (- హస్త) బట్టి యీడ్చె నక్షత్రేశున్ (- చంద్రుడు)

కాబట్టి ఆ పద్యం తారాశశాంకంలోది అయ్యుండాలి.

Unknown said...

అవునండి. దానిలోనిదే ఈ పద్యం. ఎన్నో మంచి మంచి పద్యాలు ఇటువంటివి చాలా ఉన్నాయి. దానిలో. కొన్నిటినయినా పోస్టు చేద్దామనుకుంటున్నాను. మీకు నూటికి నూఱు మార్కులు.

Unknown said...

మీ కొక్క మార్కు తగ్గించాల్సొస్తున్నందుకు బాధగా వుందండి.
ఆ గ్రంధం పేరు తారా శశాంకం కాదు, శశాంక విజయము శేషము వేంకట కవి ప్రణీతము.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks