నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 4, 2009

అమ్మా! తమ్ముడు పుట్టినప్పుడు సుమంత్రారూఢమౌ మే ల్శతాం

రోమపాదుడు శాంతను ఋష్యశృంగుని అయోధ్య నుండి తీసుకొని వెళ్ళుట
వారు ప్రయాణం కట్టినపుడు--
ఆ.
సెలవుగొన్నవాఁడు సెలవుగొన్నట్లుగా
నెసఁగె రాజు ఋష్యశృంగునొద్దఁ
గౌగిలించు నామె కౌఁగిలించినయట్లె
చనియెఁ బట్టమహిషి శాంతయొద్ద. 146

ఆ ఆప్యాయతలు చూడండి. తెలుగు లోగిళ్ళలోనివే అచ్చంగా.
ఆ.
దాసి చంకనున్న తనయుఁడు నెగఁ బ్రాకు
దల్లికొఱకుఁ దల్లి తండ్రి కిచ్చుఁ
తండ్రి తల్లి కిచ్చుఁ దల్లి దాసి కొసంగు
సంభ్రమించి రిట్లు శాంతయు ముని. 147

శాంత కొడుకు గురించి.
శా.
అమ్మా! తమ్ముడు పుట్టినప్పుడు సుమంత్రారూఢమౌ మే ల్శతాం
గమ్మున్ బంపెద నీవు నీపతియు రాఁగా మాట నీ విచ్చి నా
వమ్మాటల్ మఱువంగఁబోకు మునికాంతా ! యంచుఁ గేళీరహ
స్యమ్మున్ గోసల రాజకన్య పలికెన్ శాంతామహాదేవితో. 148

చూడండి ! విశ్వనాథ వారి పద్యం నడక. మాటలు మాట్లాడుకుంటున్నట్లే ఎంత హాయిగా సాగుతుందో !
గీ.
ఎట్టకేలకు మగిడిరి పృథ్విపతియుఁ
బట్టమహిషియుఁ జూతు రా బాటవెంటఁ
బోయెడు రథాలపైనుండి మునియు శాంత
యు త్తలంబునఁ జూతు రయోధ్యవంక. 150

పంచచామరము.
సుమిత్ర రాజుతో నిదేమి చోద్యమో యసుప్రియుం
డు మౌని యెల్లకాల మిందునన్ వసించునా యనున్
సుమిత్ర రాణితో నిదేమి చోద్యమమ్మ ! శాంత తా
ను మౌని యెల్లకాల మిందునన్ వసించునా యనున్. 151

కొన్ని కొన్ని పదాల్ని --మళ్ళీ మళ్ళీ -- ఒకే పద్యంలో తిరిగి తిరిగి ఉపయోగించటం- - దీని వల్ల పద్యంలో ఓ అందం-- --ఓవిధమైన తూగు వచ్చి చదివిన పాఠకునికి ఓరకమైన రసనను చేకూరుస్తాయి. ఒకోచోట ఒకో విషయాన్ని కవి నొక్కి చెప్పదలచుకొన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయోగం బాగా ఉపయోగపడుతుంది. విశ్వనాథ వారు ఇటువంటి ప్రయోగాల్ని కల్పవృక్షంలో చాలా చోట్ల చేసారు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks