శ్రీమద్రామాయణ కల్పవృక్షము- విశ్వనాధ వారు ఉపయోగించిన అరుదుగా వాడే ఛందో ప్రక్రియలు
అందరు కవులూ సాధారణంగా వారి వారి కావ్యాలలో ఉపయోగించే ఛందస్సులు ఉత్పల,చంపక మాలలు; మత్తేభశార్దూలాలు; ఆటవెలది, తేటగీతులు; సీస,కంద పద్యాలు. ఎక్కడైనా ఒకటో అరో ఇతర ఛందస్సులను కూడా అక్కడోటీ అక్కడోటీగా బహు తక్కువగా వాడుతుంటారు.కాని విశ్వనాధ వారు వారి రామాయణ కల్పవృక్షంలో ఇతర ఛందస్సులను కూడా ఎక్కువ ధారాళంగానే వాడారు. వారి రామాయణం చదువు తుంటే పాఠకుల సౌకర్యార్థం వారు వాడిన ఛందస్సులనన్నింటినీ ఓచోట ఏర్చికూర్చితే ఎలాగుంటుందనే ఊహ కలిగింది. అందుకే ఆవిషయం గురించే ఈ ప్రత్యేకమైన టపా.
నెం. చందస్సు గణవిభజన వళి
1।అంతరాక్కఱ(1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము మొత్తం 4గణములుంటాయి నాల్గవ గణాధ్యక్షరం యతి.ప్రాస నియమం కలదు)
కమలమిత్రుండు సురరాజగణ యుగంబు
కమలశత్రునితోఁ జెంది కందళింప
నమరుఁ బ్రావళ్ళు నర్థంబు నతిశయిల్ల
నమల మగు నంతరాక్కర మబ్ధిసంఖ్య.
2.అజిత ప్రతాపము(స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు).ప్రాసనియమం కలదు.పాదమునకు 12 అక్షరములు.ప్రాస నియమం కలదు
సజసాగణావలిఁ బ్రసన్న నభా
గ్రజరపంక్తి నభిరామరూపమై
యజితప్రతాపచెలువారుఁ గృతి
న్విజయవిక్రమణ విశ్వభూవరా.
3.అపరాజితము (న, న, ర, స, వ) 9(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ననరసలగముల్ దనర్చిన సత్కృతిం
దనరఁగ నపరాజితంబు కవిస్తుతిన్.
4।అలసగతి
५.అల్పాక్కఱ(3 గణములు,2 ఇంద్రగణములు,1 చంద్రగణము.3వ గణాద్యక్షరము యతి.)
*సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల.
*ఇది గీత పద్యము వలె నున్నది।
6.అశ్వగతి ( భ,భ,భ,భ,భ,గ)10
7.అశ్వలలితము (న, జ, భ, జ, భ, జ, భ, వ)12(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నజభజము ల్భజంబులకు నచ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రజనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా.
8.అశ్వవిలసితము
9.అష్టమూర్తి (మ, న, త, స, ర, భ, జ, య)
10.అసంబాధ (మ, త, న, స, గ, గ) 12
11.ఆటవెలది(బేసి పాదములలో3 సూర్యగణములు,2 ఇంద్ర గణములు, సరిపాదములలో 5సూర్యగణములు) ప్రాస లేదు నాల్గవ గణాద్యక్షరం యతి. ప్రాసయతి చెల్లును
ఇనగణత్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది
12.ఆపాతలిక
13.ఆర్య
14.ఇంద్రవజ్రము (త, త, జ, గ, గ) 8(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.ఈతాజగానిర్మితి నింద్రవజ్రా - నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్.
15.ఇంద్రవంశము (త, త, జ, ర) 8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
ఈ తా జ రా కల్పన నింద్రవంశకా
ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా.
16.ఇల
17.ఉత్కలిక
18.ఉత్పలమాల (భ, ర, న, భ, భ, ర, ల, గ) 10(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.
19.ఉత్సాహము
గీ.
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె;
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి.
ఉత్సాహము.
ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జుగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్.
20.ఏకరూప
21.కందము
కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.
అందును గందంబులు నా
నందంబులు భజసనలగాఖ్యలచే వా
నిం దగు నెఱుగం బ్రాసము
ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్.
ఆదిమ వర్ణము వళి నిడు
పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పాదాదుల నిలుపందగు
గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్.
నిడుదలగు పాదములకును
వడి నాలవగణము మొదల వలయు నిలుప న
క్కడలను గురువును మూఁడవ
యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్.
*ఇందు పుర బాణనగముల
కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
గందములకు నార్యాదుల
చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్.
*ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7
కందము నర్థంబులతుద
నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ
బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్.
క్రమమునఁ బథ్యార్యార్థము
లమరంగా వీడుపడిన నది గాథాభే
దముగాఁగం బరఁగు ప్రపం
చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్.
22.కపాలి
23.కమలనగీతి
24.కవికంఠభూషణము
25.కవిరాజ విరాజితము (న, జ, జ, జ, జ, జ, జ, ల,గ) 8,7,7 మఱియు ఇంకొక పక్షమున 8, 14(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
క్రమమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
రమును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా.
26.కర్ణాటచతుష్పదము
27.కరిబృంహితము( భ, న, భ, న, ర ) 13 ( అతిశక్వరి ఛందము) పాదమునకు 15 అక్షరములు. ప్రాస నియమం కలదు.
28.కిరీటము
29.కుసుమవిచిత్రము
30.కౌముది
31.ఖచరప్లుతము ( స, భ, భ, మ, స, స, వ)12(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నభభముల్ మససంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా.
32.గజవిలసితము
33.చంచరీకావళి (మ, మ, ర, ర, గ) 7
34.చంద్రకళ (ర, స, స, త, జ, జ, గ)11(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు.ప్రాస నియమం కలదు.
వ్యక్తరీతి రసాతజజగ్రాయత్త గకారనిరూఢిచే
సక్త దిగ్విరమంబన నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్.
35.చంద్రరేఖ
36.చంద్రిక (న, న, త, ర, గ) 8
చంద్రిక(న, న, ర, వ) 7 (త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
సలలితముగఁ జంద్రికాహ్వయం
బలరు ననరవాంక మై కృతిన్.
37.చంద్రవర్త్మ
38.చంపకమాల (న, జ, భ, జ, జ, జ, ర) 11(ప్రకృతిచ్ఛందం) పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.
39.చపల
40.చతుష్పద
41.చామరము
42.చిత్రపదము(భ, భ, గ, గ) (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరములు.ప్రాస నియమము కలదు.
చిత్రపదం బన భాగా - చిత్రయతిప్రతిపత్తిన్.
43.జఘనచపల
44.జలదము (భ, ర, న, భ, గ) 10(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ఈ భ ర నంబుల న్భగురు లెక్కుచు నిం
పై భజియించె నేని జలదాహ్వయ మౌ.
45.జలధరమాల (మ, భ, స, మ) 9(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం
బ్రద్యోతించున్ మ భ స మ భద్రాప్తిన్.
46.జలోద్ధతగతి (జ,స, జ,స)
47.తరలము(ధృవకోకిల)( న, భ, ర, స, జ, జ, గ)12(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నభరసంబులు జాగవర్గము నచ్చి యీశ్వరవిశ్రమ
ప్రభవమై తరలం బనంజను రాజవంశశిఖామణీ.
48.తరళము (భ, స, న, జ, న, ర) 11
చారుభసన భూరి జన రసాంద్రగణములన్ దిగా
సార విరతినందముగ నిజంబు వరలి చెన్నగున్.
49.తన్వి
50.త్రిపద
51.తురగము
52.తురగవల్గితవృత్తం(న, న, న, న, స, జ, జ, గ)15(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు.ప్రాస నియమం కలదు.
మెఱయు న న న న స జ జ గములను మేలుగా రచియించినన్
వఱలు మనుయతి వలనను దురగవల్గితంబను వృత్తమై.
53.తేటగీతి
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి. 1సూర్యగణము, 2 ఇంద్రగణములు, 2 సూర్యగణములు. ప్రాస లేదు. యతి నాల్గవగణాద్యక్షరము యతి. ప్రాసయతి చెల్లును.
54.తోటకము (స, స, స, స) 9(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
సరసం బయి సాసససంభృతంమై
విరచించినఁ దోటకవృత్తమగున్.
55.తోదకము (భ,భ,భ,గ,గ)7(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం
కామితభత్రయ గాయుత మై వి
శ్రామపుఁ దోదక సంజ్ఞతఁ జెందున్.
తోదకము(న, జ, జ, య) 8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
సలలిత మైన నజాయగణంబుల్
విలసిత తోదకవృత్తముఁ జెప్పున్.
56.త్వరితపదగతి(న, న, న, న, న, గ, గ)11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
త్వరితపదగతి యనఁగఁ ద గు న న న నాగా
విరచితయు దశమయతి విలసితయు నైనన్.
57.త్రిభంగి(న, న, న, న, న, న, స, స, భ, మ, స, గ) చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు. పాదమునకు 34 అక్షరములు.
లలి న న న న స న ములు ససభమములు నతిసగయుక్తిఁ జరింపం బ్రసరింపం బాటివహింపం
జెలువుగనవకలి నిలుపఁగదగునెడ వెలయుఁద్రిభంగి సురక్తిం బదభక్తిం బ్రాసనియుక్తిన్.
58.దుర్మిలా
59.దృతవిలంబితము (న, భ, భ, ర) 7(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
ద్రుతవిలంబితరూపితవృత్తిచేన్
బ్రతతమయ్యె నభారగణంబులన్.
60.ద్విపద
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ
ద్విపదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విపద తో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు రెంటను గూర్ప నది యయుక్తంబు
61.ద్విరదగతి
62.దోధకము
63.ధరణి
64.ధరణిధరగతి
65.ధృతమధ్య
66.నదీప్రఘోషము(ర, ర, ర, ర, -మొదటి పాదము,-జ, త, జ, ర మిగిలిన 3 పాదములు) స్వస్థాన విషమ వృత్తము
భారరంబుల్మొగిం బ్రాగుపేతంబులై
చరించుచుండం జతజస్థరేఫలం
బరత్రిపాదంబులఁ బర్వునొప్పుఁగన్
దిరంబుగా మూఁట నదీప్రఘోషమై.
67.నరేంద్ర
68.నర్కుటము(న, జ, భ, జ, జ, వ)11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నజభజముల్ జవంబులఁ దనర్చిన నర్కుటక
ప్రజననమొప్పు దిగ్యతిని రాజకులాబ్ధిశశీ.
69.నవనందిని (స, జ, న, గ, గ) 9
70.నాగరము
71.నారాచము
72.నారీనుతము
73.నియోగిని
74.నిశా
75.పంక్తి
76.పంచచామరము (జ, ర, జ, ర, జ, గ) 10
త్వరాస దృగ్విధీయమాన దానతోయ శోషితాం
బురాశి వర్ధనాతి కృత్ప్రభూత కీర్తి మండల
స్ఫురత్సుధా మయూఖ వైరి భూమి భృచ్చిరోల్లస
త్కిరీట రత్న రాజితకాంతి దీపితాంఘ్రి పంకజా.
77.పంచపది
78.పథ్య
79.పణవము
80.పద్మనాభము (త, త, త, త, త, త, త, గ, గ)
81.ప్రగుణ వృత్తం(సుప్రతిష్ఠాచ్ఛందం) పాదమునకు 5 అక్షరములు. (స, గ, గ) ప్రాస నియమం కలదు.
సగణాసక్తిం - గగసంయుక్తిన్ - బ్రగుణాఖ్యంబై - తగు నింపారన్.
82.ప్రభాతము (న, జ, జ, ర, గ) 8(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
మొదల నజారగము ల్ప్రభాతసంజ్ఞం
బొదవఁగ జేయు నపూర్వకల్పనోక్తిన్.
83.ప్రహేయము
84.ప్రమాణి (జ, ర, వ) (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరములు.ప్రాసనియమం కలదు.
జకారమున్ రకారమున్ - వకారముం బ్రమాణికిన్.
85.ప్రహరణకలిత (న, న, భ, న, వ) 8(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ప్రహరణకలితంబయి న స భ స వల్
బహువిధయతులం బ్రథఁ జెలు వడరున్.
86.పరావతి
87.ప్రియంవద (స, భ, జ, ర)
88.పృథ్వి (జ, స, జ, స, య, ల, గ)
89.ఫలసదనము (న, న, న, న, స, గ)
90.బంధురము (న, న, స, స, స, భ, భ, గ)
91.భద్రకము (భ, ర, న, ర, న, ర, న, గ)
భద్రకము (ర, న, ర)(బృహతీచ్ఛందము) పాదమునకు తొమ్మిది అక్షరములు.ప్రాస నియమం కలదు.
భద్రకంబు రనరంబులన్ - భద్ర విశ్వనృపమన్మథా.
92.భాస్కరవిలసితము(భ, న, జ, య, భ, న, న, స, గ, గ)13(అభికృతిచ్ఛందం) పాదమునకు 25 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సారసహితయతి సంగతవృత్తి స్సంచిత భ న జ య భ న న స గం బుల్
పౌరవకులజలరాశిమృగాంకా, భాస్కరవిలసిత మన విలసిల్లున్.
93.భుజంగప్రయాతము (య, య, య, య)8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
భుజంగప్రయాతంబు పొం దారు నందం
బజస్రంబుగా నయ్యయాయంబు లొందన్.
94.భుజంగవిజృంభితము(మ, మ, త, న, న, న, ర, స, వ)10(ఉత్కృతిచ్ఛందం) పాదమునకు 26 అక్షరములు. ప్రాసనియమం కలదు.
ధీవైదగ్ధ్య శ్రీవిక్రాంతా దిగిభదశమపదవిరతిన్ భుజంగవిజృంభితం
బై విశ్రాంతుల్ దైవాఱం జెన్నగు మ మ త న న ర స హారియై లగసంయుతిన్.
95.భుజగశిశిరుతము( న, న, య) (బృహతీచ్ఛందము) పాదమునకు తొమ్మిది అక్షరములు. ప్రాస నియమం కలదు. భుజగశిశురుత మయ్యెన్ - ఋజు ననయ ములచేతన్.
96.భూనుతము (ర, న, న, భ, గ, గ) 10(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
అందమై ర న న భ తతి నంది గగంబుల్
పొందఁగా బదగతిఁగని భూనుతమయ్యెన్.
97.భోగినివిలసితము
98.భ్రమరవిలసితము
99.మంగళమహాశ్రీ (భ, జ, స,న, భ, జ, స, న, గ, గ) 9, 17(ఉత్కృతిచ్ఛందం) పాదమునకు 26 అక్షరములు. ప్రాస నియమం కలదు.
సత్తుగను రత్నముల సప్తదశమంబునను సద్యతులు మంగళమహాశ్రీ
వృత్తమున కౌభజసవృత్తిన భజల్మనలపై గురులురంగనృపధీరా.
100.మందాక్రాంత (మ, భ, న, త, త, గ,గ) 11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
కాంతా కాంతా మభనతతగా క్రాంత సంక్రాంత మందా
క్రాంతంబయ్యెన్ విరమదశమాక్రాంతి విశ్రాంత మైనన్.
101.మంజరి
102.మంజుభాషిణి (స, జ, న, జ, గ, గ) 9
103.మణిభూషణము (ర, న, భ, భ, ర)10(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
విశ్వభూప మణిభూషణవృత్త మనంజనున్
శశ్వదుక్త ర న భా ర దిశాయతిఁగూడినన్.
104.మణిమాల (స, జ, స, జ, స, జ, స)10(ప్రకృతిచ్ఛందం).పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
వరుసన్ సజత్రితయము న్బ్రసక్త సగణంబుతోడ నొనరం
బరఁగున్ దిగంతవిరతిం బ్రధానపదమై చళుక్యమదనా.
105.మణిరంగము (ర,స,స,గ)
106.మత్తకోకిల (ర, స, జ, జ, భ, ర) 11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.
107.మత్త మయూరము (మ, త, య, స, గ)8(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సంబోదార్థంబై వలసన్మత్త మయూరా
ఖ్యం బింపొప్పారున్ మతయాగ్య్రాత్త సగాప్తిన్.
మత్తమయూరము (న, న, భ, భ, గ) 8
108.మత్తాక్రీడ
109.మత్తేభవిక్రీడితము (స, భ, ర, న, మ, య, వ)14(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా.
110.మథ్యాక్కఱ
111.మదరేఖ
112.మదనదర్పణము
113.మద్రకము
114.మధ్యాక్కఱ(రవీంద్రచంద్రాఖ్య గణాలలో 6 గణములు ఉంటాయి, 2 ఇంద్ర గణములు,1 సూర్యగణము,2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, నాల్గవ గణాద్యక్షరము యతి)
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
కరమొప్ప నీపాట నాఱు గణముల మధ్యాక్కరంబు
విరచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ.(నన్నయ గారు 5వగణాద్యక్షరం యతి వేసిరి)
115.మధుమతి(మదనవిలసితము)
116.మధురగతిరగడ (నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు
గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము)
117।మధురాక్కఱ(రవీంద్రచంద్రాఖ్య గణాలలో 5 గణములు ఉంటాయి,3 ఇంద్ర గణములు,2 సూర్యగణములు,నాల్గవ గణాద్యక్షరము యతి)
తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు।
118.మనోరమ
119.మనోహర
120.మనోజ్ఞము (న, జ, జ, భ, ర)10(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
వరుస మనోజ్ఞమనంగ వచ్చు నజాభర
స్థిరగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై.
121।మహాక్కఱ(రవీంద్రచంద్రాఖ్య గణాలలో 7 గణములు ఉంటాయి, 1 ఇనగణము,5 ఇంద్రగణములు, 1చంద్రగణము)
వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నారయ రెండవ నాలవచోట్ల నర్కుండయిననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు।
122.మహాస్రగ్ధర (స, త, త, న, స, ర, ర, గ) 9, 16(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
రహిఖండగ్లౌకళా విశ్రమములను మహాస్రగ్ధరా వృత్తమౌ శ్రీ
సహితౌ దార్యాసతానల్ సరర గురువులున్ శ్రీరంగ రంగభూపా.
123.మానిని (భ, భ, భ, భ, భ, భ, భ, గ) 7, 13,19(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
కారము లున్క్రియ గన్గొన నేడు భ కారములొక్క గకారముతో
గారవమై చన గావళు లన్నియు గల్గిన మానిని కామ నిభా.
124.మాలిని (న, న, మ, య, య) 9(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
నవ విరమణ యుక్తిన్ నామయాసంగతం బై
యవని దగును మాలిన్యాఖ్య చేరంగ ధీరం .
125.ముఖచపల
126.మేఘవిలసితము
127.మేఘవిస్ఫూర్జితము (య, మ, న, స, ర, ర, గ)12(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు. ప్రాస నియమం కలదు.
మృదున్యస్తార్థంబై దినకరయతి న్మేఘవిస్ఫూరితాఖ్యం
బుదాత్తశ్రీఁ జేర్చున్ యమనసర రప్రోత గప్రాప్తిచేతన్.
128.మేదిని (న, జ, భ, జ, ర, గ)11(అష్టిచ్ఛందం) పాదమునకు16అక్షరములు.ప్రాస నియమం కలదు
న జ భ జ రేఫగంబునఁ దనర్చు మేదినీవృ
త్తజనికి మూలమై దిగుదితస్థ విశ్రమం బై
129.రథగమన మనోహరము
130.రథోద్ధతము(నరాంతికము) (ర, న, ర, ల, గ) 7 (త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
రక్తిఁ బేర్చి రనరంబు పై లగం
బుక్త మైనను రథోద్ధతం బగున్.
131.రసాలి
132.రుగ్మవతి (భ,మ,స,గ) 6 (పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రుగ్మవతిం జేరున్ భమసంబుల్ - తిగ్మరుచిద్యుద్దీప్త గయుక్తిన్.
133.లయగ్రాహి(భ, జ, స, న, భ, జ, స, న, భ, య) పాదమునకు 24 మాత్రలు ,30 అక్షరములు 9 అక్షరముల కొక ప్రాస యతి
ఎమ్మె వెలయన్ భజసనమ్ములు మఱిన్ భజసనమ్ముల పయిన్ భయగణమ్ములు లయగ్రా
హిమ్మఱయు రంగనృప ! యిమ్మహిని బ్రాసయతులెమ్మెఱపి నాల్గు చరణమ్ములను వేడ్కన్.
134.లయహారి(న, న, న, న, న, న, న, న, న, న, న, స, గ) 10 పైఁ బ్రాసయతి,పాదమునకు 37 అక్షరములు, చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
పదునొకఁడు నగణములఁ బొదలి సగణము గురువు
మృదులపదరచనఁ దగి యొదవి మితివ్రాలన్
ముదమొసఁగు సభల నని చదువుదురు కవివరులు
హృదయములఁ జతురతలుగదుర లయహారిన్.
135.లాటీవిటము (స, స, స, స, మ, త, య)13(ప్రకృతిచ్ఛందం).పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
స స సా మత యంబులు భానుయతి న్సాకంబై లాటీవిటవృత్తం
బెసకంబెసగున్ విరచించిన విశ్వేశా, చాళుక్యక్షితిపాలా.
136.వంశస్థము(జ, త, జ, ర) 8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
జతంబులం జెందిన జంబు రేభయున్
నుతింప వంశస్థ మనుక్రమక్రియన్.
137.వనమయూరము (భ, జ, స, న, గ, గ) 9(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ఉన్నతములై వనమయూర కృతిలోలిన్
ఎన్నగ భజంబుల పయిన్ సనగగం బుల్
చెన్నొదవ దంతి యతి చెంది యలరారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.
138.వరాహము
139.వసంత తిలకము (త, భ, జ, జ, గ,గ) 8 (శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
స్థాపించినం ద భ జ జంబు చళుక్య విశ్వ
క్ష్మాపా వసంతతిలకంబగు గా నియుక్తిన్.
140.వాతోర్మి (మ, భ, త, ల, గ) 7(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు.ప్రాస నియమం కలదు.
తద్వాతోర్మిన్ మభతంబుల్ లగమున్
సద్విశ్రామస్థితి సంధిల్లుచుండున్.
141.వితానము
142.విచికిలితము
143.విచిత్రము
144.విజయభద్రము
145.వితానము
146.వితాళచతుష్పద
147.విపుల
148.విభూతి వృత్తం (ర, జ, గ) పాదమునకు 7 అక్షరములు.(ఉష్ణిక్కుచ్ఛందం) ప్రాస నియమం కలదు.
స్వస్థ సద్విభూతి దా - రస్థ జస్థగంబునన్
149.విమానము
150.వియోగిని
151.విశ్వదేవి (మ, మ, య, య)8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
మాయావర్ణం బొప్పం గ్రమన్యాసవృత్తిన్
జేయున్ భూభృ ద్విశ్రాంతిచే విశ్వదేవిన్.
152.విచిత్ర వృత్తము (గాయత్రీచ్ఛందం) పాదమునకు 6 అక్షరములు.(య, య) ప్రాస నియమం కలదు.
విచిత్రంబునందున్ - రుచించున్ యయంబుల్.
153.విజయమంగళము
154.విషమసీసము
155.వ్రీడ
156.వృంత
157.వృషభగతి
158.వేగవతి
159.వైతాళీయము
160.శంభువృత్తము
161.శార్దూలవిక్రీడితము (మ, స, జ, స, త, త, గ) 13(అతిధృతిచ్ఛందం) పాదమునకు 19 అక్షరములు ప్రాస నియమము కలదు.
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్.
162.శాలూరము
163.శిఖరిణి (య, మ, న, స, భ, వ)12(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
వివస్వ ద్విశ్రాంతి న్య న స భ వా విష్కృతగతిం
గవిశ్రేణీరక్తిన్ శిఖరిణియనంగాఁ దగుఁబ్రథన్.
164.శ్రీరమణము(భ,మ,త,గ- మెదటిపాదము(ఉపక్రాంత), భ, భ, భ, గ,గ(నికటము) తరువాతి 3 పాదములు)పరస్థాన విషమ వృత్తము
ఆరభమవ్యాయత్తసగవ్యా
పారము నాదిమ పాదము సెందన్
జారు భభాగగసంగతిచేతన్
శ్రీరమణంబని చెప్పిరి మూఁటన్.
165.శ్యేని (ర, జ, ర, వ) 7 (త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాస నియమం కలదు.
శ్యేనికై రవంబు చెప్పి పైరవం
బూనఁజేయు టెల్ల నొప్పు నెప్పుడున్.
166.షట్పద
१६७.షట్పది
సురపతులిరువురు సురపతులిద్దఱు
సురపయుగమ్ముతో సోముండును
బరువడిఁబెనఁగొన నదురుగ షట్పది
సరిఁబ్రాసంబులు దనరారంగను.
168.సీసము
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !
ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు
క.
అమరంగ విషమసీసము
సమసీసము లనఁగఁ రెండుచందము లందున్
బ్రమితమగు విషమసీస
క్రమ మెఱుఁగఁగవలయుఁ జతురకవిజనములకున్.
గీ.
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె;
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి.
విషమ సీసము
గీ.
వడి దనర్పఁ బ్రాసవైభవం బలరార
నిట్ల గణనిరూఢి నెసక మెసఁగఁ
గీ ర్తితాతిమధురగీతియుఁ బైగల్గ
నదియ విషమసీసమండ్రు కృతుల.
సమసీసము
గీ.
వెలయు సమసీసములు పంచ విధములయ్యె
నరయ నవకలిసీ సాహ్వయంబుఁ, బ్రాస
సీస, మక్కిలిప్రాససీసాఖ్యసీస
ము,వడిసీస, మక్కిలివడిసీసమును ననంగ.
క.
తన పాదంబులు నాలుగు
మొనసిన పై గీతిపాదములు రెండును గా
నినుమూఁడై సీసమునకు
జను నడుగులు వ్రాలు వళ్ళు సరి యిన్నిటికిన్.
అవకలి సీసము
క.
అలవడిసీసము పాదము
నలుతునుకలు చేసి మూఁట నలనామగణం
బుల రెంటి నిడి య
వ్వలితునుక నహంబు లిడఁగవలయు న్వరుసన్.
సీ.
సామంబుచేఁ దుల్యభూమీశ్వరులు దన, తోడిమిత్రతకు నఱ్ఱాడుచుండ,
దానంబుచే నతిమానమానవనాథు లేర్పడ నక్కఱఁ దీర్చుచుండ,
ఖేదంబుచేత దుర్మోదమహీశు లందంద సంక్షిప్తత నొందుచుండ,
దండంబుచేత నుద్దండమాండలికు లాజ్ఞాచక్ర మౌదల మోచియుండ.
గీ.
శశ్వదనురక్తిఁ జాళుక్యవిశ్వనిభుఁడు
వాలి వసుమతి లీలమై నేలుననుచుఁ
జెప్ప నవకలిసీస మిట్లొప్పునండ్రు,
పూని గావ్యకళావేదులైనకవులు.
ప్రాస సీసము
క.
సీసమునకు నాఱడుగులఁ
బ్రాసము లిడి యోలి సర్వపదఖండములన్
భాసురముగ వళ్ళలవడఁ
జేసిన నది కృతులఁ బ్రాససీసంబయ్యెన్.
సీ.
చక్రవాళాచల చంద్రకాంతములకు సంతతార్ద్రత్వంబు జరపి జరపి,
చక్రీశలోక సంచర దురు సంతమసంబుల వడిఁ బాఱఁ జదిపి చదిపి,
శక్రేభశంకరశంకరాచలశశి చారుదీధుతులపైఁ జాఁగిచాఁగి,
చక్ర స్తనీకుచ సాంద్ర చంద్రనరసచర్చలపైఁ గేలి సలిపి సలిపి,
గీ.
విక్రమప్రతాప విశ్రుతమూర్తియై
విశ్వభూమివిభుని విశదకీర్తి
ప్రక్రమప్రసక్తిఁ బ్రసరించు నని చెప్పఁ
బ్రాససీస మనఁగ బరఁగు నెందు.
అక్కిలిప్రాససీసము
క.తుదిగీతి నాలుగడుగులు
వదలక ప్రాసంబు నిలిపి వళ్ళింపారం
గదిరినఁ గదురకయున్న
న్నది యక్కిలి ప్రాససీస మనఁగాఁ బరఁగున్.
సీ.
క్రమయుక్తి విద్యల కందువ యెఱుఁగుచుఁ, గవులనే ర్పారసి గారవించి,
సమరసంక్రీడనక్షమసుభటాటోప సంచారములకు నుత్సాహమూఁది,
నమితాహితక్షమానాథులరాజ్యంబు నాననాఁటి కొనర నున్నుచేసి,
ప్రముదితారాతుల భంజించి వేలుపుం బడఁతుల కిపారుపతులఁ జేసి,
గీ.
విమలకీర్తుల దిక్కులు విప్పనేర్చు
శమితవినుతుండు విశ్వేశచక్రవర్తి
సముచితంబుగ నని చాల సన్నుతింప
నమరు నక్కిలిప్రాససీసాహ్వయంబు.
వడిసీసము
క.
ఏపాదమునకు నే వడి
యాపాదింపంగఁబడియె నది ఖండములం
బ్రాపింపఁ జెప్పఁగ వళిని
రూపితసీసంబు నాఁగ రూఢికినెక్కున్.
సీ.
గ్రహదంష్ట్ర సోఁకని గ్రహరాజు, ప్రియవచః కథనంబు నేర్చినకల్పభూజ,
మలరుఁదూపులు కేల నంటని కందర్పు, డమ్ముచే నింకని యంబురాశి,
కన్నులు పెక్కులు గల్గని యింద్రుండు, కఱకేది వంగని కనకనగము,
తనువెత్తి క్రాలెడు ధర్మదేవత, రూపుఁ దాల్చిన రాజవిద్యావిభూతి,
గీ.
నయవిదుండు రాజనారాయణుఁడు విశ్వ
నాథుఁ - డనుచు వర్ణనములుసేయ
వరుస నిట్లు కృతుల వళిసీస మన నొప్పు
వసుధ వైభవాలవాల మగుచు.
అక్కిలి వడిసీసము
గీ.
సీసఖండంబు వళ్లిట్లు చెప్పి గీతి
ఖండవళి రెంటి కొక్కఁడుగా నొనర్ప
నదియ యక్కిలివడిసీసమండ్రు కృతుల
లక్ష్యములు చూచి యెఱుఁగుఁ డీలాగు లెల్ల.
క.
సీసములకు గీతులకుం
బ్రాసములును వళ్ళుఁ గలయఁబడి కవితల ను
ద్భాసిల్లఁ దఱచు నియమ
వ్యాసక్తియుఁ గలుగుఁ జెప్పవలసినచోటన్.
169.సుందరి (భ, భ, ర, స, వ) 9(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భా ర స వంబుల నొప్పుఁ బద్మజవిశ్రమం
బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై.
సుందరీ వృత్తం (భ, గ, గ) (సుప్రతిష్ఠాచ్ఛందము) పాదమునకు 5 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సుందరి యొప్పుం - జెంది భగా నిం - పొంద నియుక్తిన్ - గందుకలీలన్.
170.సుకేసరము (న, జ, భ, జ, ర)10(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
నజభజరేఫలం గదియ వచ్చి దిగ్యతిన్ సుజనమతి న్సు కేసరము శోభితంబగున్.
171.సుగంధి (ర, జ, ర, జ, ర) 9 ప్రాస లేదు
దంబుజం బురంబు జంబు రంబు చెన్నుమీరగా
దొమ్మిదింట విశ్రమంబు తోరమై సుగంధికిన్.
172.సుముఖి
173.స్రగ్ధర ( మ, ర, భ, న, య, య, య,)8,15(ప్రకృతిచ్ఛందం) పాదమునకు21 అక్షరములు.ప్రాస నియమము కలదు.
సారెస్ నాగాధి రాట్పంచదశ విరమతన్ స్రగ్ధరా వృత్తమౌ గాం
తా రాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసి యై రంగభూపా.
174.స్రగ్విణి (ర, ర, ర, ర) 7(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
స్ఫారితంబై యకూపా ర ర శ్రేణితో
సార మై స్రగ్విణీచారువృత్తం బగున్.
175.హంసరుతము
176.హంసి
177.హరనర్తనము
178.హరిగతి
179.హరిణగతి
180.హరిణి (న, స, మ, ర, స, ల, గ)11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
హరిణి యనువృత్తంబయ్యెన్ శంకరాత్తయతిప్రథన్
స రి న స మ రే ఫావక్రాంతోపేత సస్థలంగంబులన్.
181.హయప్రచారము
182.హలముఖి(ర, న, స) (బృహతీచ్ఛందము) పాదమునకు 9 అక్షరములు. ప్రాస నియమం కలదు.
కామితక్రియ హలముఖీ - నామ మొప్పు రనసలచేన్.
183.క్షమ
184.క్ష్మాహారము
వీటి గణాలు, యతిప్రాసలు వగైరా తెలుసుకోవాల్సిఉంది.
Jul 1, 2009
విశ్వనాధ గారు వాడిన అరుదైన ఛందో ప్రక్రియలు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
చాలా బావుందండీ శ్రమపడి మీరు చేసిన ఈ జాబితా. నేను అనుకోవడం చాలా ఛందస్సుల వివరాలు అప్పకవీయంలో దొరుకుతాయేమోనని, చూడాలండీ. :)
అప్పకవీయం నా దగ్గఱ కూడా ఉండాలి.చూస్తాను.మీరు కూడా చూడండి.హైదరాబాదులో ఉన్నప్పుడు ఎక్కడో గుర్తులేదు, కాని ఓ లైబ్రరీలో ఉన్న పుస్తకంలో చాలా ఛందోవిషయాలు ఉన్నవి చూసాను.కాని అన్ని విషయాలూ కాపీ చేసుకోలేదు.మనప్రయత్నం మనం చేద్దాం. ఇంటర్నెట్ లో అన్ని వివరాలూ ఒకేచోట దొరికే అవకాశం ఉందేమో కూడా చూడాలి.మన బ్లాగాడిస్తా వారి సహాయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఇన్ని రకాల చందస్సులున్నాయా?
వాటిలో పద్యాలను వ్రాసిన వ్యక్తి ఒకరున్నారా?
వారి గొంతుక వినటమూ (ఈమాట లో), ఫొటో చూడటం మనం చేసుకొన్న అదృష్టమేమో.
ఇవికాక మరిన్నిరకాలు సుందరకాండలో ఉన్నాయన్న కొసమెరుపు మరొకటా?
విశ్వనాధ వారిపట్ల నా గౌరవం మరింత పెరిగింది , మీ పోస్టు చదివాకా. ధన్యవాదములు.
చందస్సు తెలుగుకు మాత్రమే పరిమితమైన ప్రక్రియ అంటారు. నిజమేనాండీ. వీలైతే తెలుపగలరు.
మీ బ్లాగు చూసి చాలా కాలమైంది. మధ్యలో అలా చూసి వెళ్లిపోయానే తప్ప కామెంటలేదు. మన్నించాలి. చాలా గొప్పగా, వివిధ విషయపరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నారు.
రాబోయే కాలంలో ఈ బ్లాగు ఒక రిఫరెన్సు లాగ ఉంటుందనటంలో ఏమాత్రం సందేహంలేదు.
బ్లాగులను ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తూ, దైవ కృపను పొందుతున్న మీ సంకల్పానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
అనేకానేక అభినందనలు, వందనములతో
భవదీయుడు
బొల్లోజు బాబా
బాబా గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలు. ఛందస్సులు ఇవేకాక ఇంకా అనేకానేకం ఉన్నాయి. లక్షలలోనే ఉన్నాయవి. కేవలం తెలుగుకు మాత్రమే ప్రత్యేకం కాదు. అన్ని భాషలలోనూ ఛందస్సులు ఉంటాయి. అవి ఆయా భాషలలో విశేష పరిశ్రమ చేసినవారు మాత్రమే చెప్ప గలుగుతారు. పద్య రచన అన్ని భాషలలోనూ ఉన్నా అవధానం మటుకు తెలుగుకు ప్రత్యేకం అని అంటారు. కాని ఈమధ్య కన్నడంలోనూ అవధానాలు చేస్తున్నారని వింటున్నాం. మన భాష మనకు గొప్ప. అలానే ఎవరి భాష వారికి గొప్ప.
avunaa
thankyou sir
వీలైతే ఈ విషయాలను వికీలో పొ౦దు పరచ౦డి. చాలా మ౦చి విఙ్ఞాన స౦పదను ప౦చుతున్న౦దుకు ధన్యవాదాలు.
అవధానం స౦స్కృత భాషా ప్రక్రియ అని విన్నాను. క్రమ౦గా తెలుగులోనూ ప్రాచుర్య౦ పొ౦ది౦ది. తప్పయితే సవరి౦చగలరు.
పెదరాయుడు గారూ
మీ కామెంటుకి నా ధన్యవాదాలు.సంస్కృతంలో కూడా అవధానాలున్నై.బహుశః వాటినుంచే మన అవధానాలు కూడా ప్రారంభమయి వుండవచ్చుకూడా. కానీ కొన్ని కొన్ని విషయాలలో తెలుగు తన ప్రత్యేకతను నిలబెట్టు కుంటూనే వుంది. ఉదాహరణకు సంస్కృతంలో లేని యతిప్రాసలు వగైరాలు తెలుగు పద్యాలలో ఉన్నాయని పెద్దలు చెబుతారు.అలాగన్నమాట.
వనం జ్వాలా నరసింహా రావు
108-అత్యవసర వైద్య సహాయ సేవల మాజీ సలహాదారు,
హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం హ్యూస్టన్ లో 518-283-4183 లో)
నమస్కారమండీ,
మీరు చేసిన కృషి చాలా గొప్పది. ఇలాంటి ప్రక్రియే నేనొకటి చేపట్టి ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నాను. క్లుప్తంగా అదేంటో కింద వివరించాను. పూర్తయిన తర్వాత మీకు పంపిస్తాను. కవి-పండితులను అది చర్చించమని కోరుతున్నాను. నా మటుకు నాకు తెలుగు భాషలో ప్రవేశమే తప్ప ప్రావీణ్యం లేదు. కాకపోతే నన్ను ఆశ్చర్యపరిచేది ఒక్కటే. ఎందరో మహానుభావులు ఎందరినిగురించో రాస్తున్నారుగాని, వందేళ్ల క్రితమే మొట్టమొదటగా వాల్మీకాన్ని ఆంద్రీకరించిన వాసు దాసుగారిని గురించి అతితక్కువగా ప్రస్తావించడమెందుకని ?
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.
ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, ఉత్సాహం, పంచ చామరం, తరలం, లయగ్రాహి, చారుమతి, మధురగతిరగడ, వృషభగతిరగడ, మానిని, సుగంధి, స్రగ్విని, మనోరంజని, మత్తకోకిలం, తామరసం, పద్మనాభ వృత్తం, అంబురుహ వృత్తం లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.
వనం జ్వాలా నరసింహా రావు
వనం జ్వాలా నరసింహారావు గారికి నమస్కారములు.
మీ పేరూ నా పేరూ ఒక్కటే అయినందుకు చాలా సంతోషంగా ఉందండీ. మనమిద్దరం చేయటానికి సాహసించిన ప్రయత్నం కూడా ఒక్కలాంటిది కావటం విచిత్రం. వావిలికొలను వారి రామాయణం ఇంతవరకూ నాకు తారసపడలేదు. మందరం పేరు విన్నా కాని ఇంతవరకూ చూడలేదు. ఈ సారి భాగ్యనగరం సందర్శించినపుడు విశాలాంధ్రకి వెళ్ళి ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తాను. ఇంతవరకూ ఎవరూ ప్రయత్నించి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు--
మ.
ఒనరన్ దిక్కన నన్నయాది కవులీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్, దీనిన్ దెనింగించి నా
జననంబున్ సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్. (1-19)
అని ఓ మాటనేసుకుని ప్రయత్నించి చేయొచ్చు కదా అనేది నా అభిప్రాయం.
నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారికి,
మళ్లీ నమస్కారాలు.
పేరులోనే కాదు పుట్టిన సంవత్సరం కూడా ఒక్కటే. మీ కంటే ఒక నెల రోజులు పెద్దనుకుంటా. మూడెనిమిదుల వాడిని నేను. 8-8-48 న పుట్టాను. 8-8-08 న షష్టిపూర్తి చేసుకున్నాను.
వాసుదాసుగారు రాసిన ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలను చదివే ఓపికా-తీరికా లేని ఈ రోజుల్లో కనీసం కొంతమందితో నన్నాచదివించాలన్న తలంపుతో, ఐదేళ్ళక్రితం అమెరికా వచ్చినప్పుడు తొలుత "సుందర కాండ" మందరాన్ని "సుందరకాండ మందర మకరందం" గా సాధ్యమైనంత శిష్ఠ వ్యావహారిక భాషలో సంక్షిప్తీకరించాను. వాసుదాసుగారే "వక్త" గా, నేను కేవలం "అనువక్త-వాచవి" గా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేశాను. "బాపు" ముఖ చిత్రంతో ప్రధమ ముద్రణ 2004 ఆగస్ట్ లో ( నా పుట్టిన రోజు ఆవిష్కరణ), ద్వితీయ ముద్రణ 2009 ఆగస్ట్ లో ( నా పుట్టిన రోజున ఆవిష్కరణ)- (రెండూ ఆర్భాటం లేని ఆవిష్కరణలే, ఇంట్లోనే) చేసాను. మార్కెట్ లో అమ్మకానికి పెట్టలేదు. ప్రాప్తం వున్నవాళ్లకే లభించింది. ఎవరన్నా పాతికో-పరకో ఇస్తే మా వూళ్లోని ముత్తవరం రామాలయానికి సమర్పించుకున్నాను. ఈ మధ్య మళ్లా అమెరికా వచ్చాను. మొదట చేసిన పని "బాల కాండ మందర మకరందం" పూర్తి చేయడం. ఇండియా వెళ్లగానే ఎవరన్నా దాతలుంటే ముద్రణకు నోచుకుంటుంది. దీని సాఫ్ట్ కాపీ వుంది. మీరు చదువుతాను అంటే jwala99@gmail.com కు మీ మేలైడీ పంపండి.
రామాయణం అంటే "ఆంధ్ర వాల్మీకి రామయణమే". అది చదివితే ఇంకేమీ చదవ బుద్ధి వేయదు. మందరాలు దొరికేది కడపలో గాని, తెనాలి దగ్గర అంగలకుదురులో వాసుదాసుగారు స్థాపించిన "శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం" లో గాని దొరికుతాయి. ఒక్కో కాండ కనీసం 700 పేజీలకు తక్కువ వుండదు. ప్రతి కాండ ఒక విజ్ఞానసర్వస్వం అనొచ్చు.
వాసుదాసుగారి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో అపురూపమైన ఛందో ప్రయోగాలున్నాయి. ఏ ఏ పద్యం అందరూ వాడని వృత్తాల్లో రాసారో, దాని ఛందస్సు ఏంటో వివరిస్తూ నేను రాస్తున్న చిన్ని పుస్తకం దాదాపు పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతూ, చిన్న సందేహం కలిగినప్పుడు, నివృత్తి చేసుకోవలని ఇంటర్ నెట్ ను ఆశ్రయించినప్పుడు మీ బ్లాగ్ కనిపించింది.
అందుకే ఈ పరిచయం.
వనం జ్వాలా నరసింహా రావు
హ్యూష్టన్ లో ఉన్న మిమ్మల్నీ పెద్దాపురంలో నున్న నన్నూ కలిపిన ఇంటర్నెట్ కి ధన్యవాదాలు.
నా ఈ మెయిల్ చిరునామా పంపించాను. బాలకాండ సుందర మకరందాన్ని పంపించగలరు. చదివి అభిప్రాయం తెలుపగలను.
మధురాక్కఱ ఛందోలక్షణం తప్పుగా ఇవ్వబడింది. ఒక ఇన గణం 3 ఇంద్రగణాలు ఐః చంద్రగణం ఉంటాయి. ప్రాస ఉంటుంది. యతి 4 వ గణం మొదటి అక్షరం.🙏🙏
ఐః బదులుఒక అని చదువుకొన గలరు.
Post a Comment