నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 1, 2009

క్షీరాబ్ధితరఁగలో శ్రీపయోధరములో

వారింకా తమ కష్టాలనిలా చెప్పుకుంటున్నారు
గీ.
దానవుల కడకత్తెరలోని పోఁక
చందమగు నేను ప్రాణాలు జవుకు జవుకు
గాఁగ--42.
క.
మధుసూదన ! నేను నుష
ర్బుధుడును దేవతల మనుట పోయి పదార్థ
ప్రథ మిగిలినాము జ్ఞానాం
బుధి మిగిలినాము ముదురుపాకమునఁబడి యచటన్.43
క.
ఇటు వేదములను జరివెద
రటుల బృహస్పతిమతంబు నగ్గింతురు నొ
క్కట వారిఁ బట్టవచ్చునె
చిటారుకొమ్మెక్కినారు శ్రీదర్పితులై. 44
గీ.
తల్లి చెవులను ద్రెంచెడు దట్టునకును
బిన్నతల్లి చెవుల్ సన్నబీరపూవు 48

ఉ.
మేరలు దాఁటియున్ బిదప మేలిమి యూఁదిన చిన్నమెత్తు బం
గారము తొల్త---55

కేశవుడు ప్రజాపతి పురుషుని చేతిలో నున్న పాయసం లోనికి ప్రవేసించిన ఘట్టంలో--

సీ.
ప్రామిన్కుగమిఁ బంటఁబట్టి నీళ్ళులఁ ద్రవ్వు
కొనిపోవు నసుర వెన్కొనిన మీను
శరధిలో మున్ను మంథర మాఁడ బైడిప్పఁ
గుదురుచేసిన చిన్న కూర్మరాజు
హేమాక్షుఁడను తుంగ నెగచి ముట్టియను బా
తాళంబు గ్రుమ్మిన దట్టుపోత్రి
స్తంభంబున సకలాంతర్యామితకు సాక్ష్య
ముగఁ జీల్చి వెలసిన మృగ విభుండు
గీ.
విఱిచి పెరిగించుం దననేర్పు వెలయ క్షత్ర
జాతిఁ బోకార్చి వెలయింపఁ జాలుటకును
బరశుధనువులతో మూర్తిపట్టు వెలుఁగు
జనపతికరస్థ మగు పాయసమునఁ జొచ్చె. 111
సీ.
క్షీరాబ్ధితరఁగలో శ్రీపయోధరములో
తొలి పాముపొలసులోఁ దూఁగు శయ్య
చలువవెన్నెలచాలొ మలయు నెండలవాలొ
యగ్గిమంటలడాలొ నిగ్గుచూపు
ప్రామిన్కుల చివళ్ళొ బహుళసృష్టి మొదళ్ళొ
యచ్చ తెల్వి కరళ్ళొ యసలుమూర్తి
తెఱగంట్లహాళికో దితిజాళిమోళికో
వట్టిన కేళికో వచ్చునటన
గీ.
ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్రుహృదయ
మందొ తనదహరాకాశమందొ యైన
చిత్తు నానందమును మించు సత్తొకండు
జనపతికరస్థ మగు పాయసమున జొచ్చె.112

పోతన గారిని జ్ఞాపకం చేస్తున్నారు విశ్వనాధ.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks