http://www.esnips.com/doc/32d3c7cd-f515-4a30-bc6d-6a6fbcebf950/NALLANI-MENI-NAGAVU-CHOOPULA-VAADU
నాట
నల్లనిమేని నగవు చూపులవాఁడు
తెల్లని కన్నుల దేవుఁడు. IIపల్లవిII
బిరుసైన దనుజుల పీచమణఁచినట్టి-
తిరుపుఁ గై దువతోడి దేవుఁడు
చరిఁబడ్డ జగమెల్లఁ జక్కఁ జాయకుఁ దెచ్చి
తెరువు చూపినట్టి దేవుఁడు IIనల్లనిII
నీటఁ గలసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుఁడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు-
తీఁట వాపినట్టి దేవుఁడు. IIనల్లనిII
గురుతు వెట్టఁగరాని గుణముల నెలకొన్న-
తిరువేంకటాద్రిపై దేవుఁడు
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుఁడు. IIనల్లనిII 5-244
Jun 3, 2009
నల్లనిమేని నగవు చూపులవాఁడు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Super. but y/how is this a sringara sankeertana.. ? Pl clarify.
సుజాత గారు, ఈ వర్గీకరణ ఎవరు ఎప్పుడు చేశారో తెలియదు గానీ అన్నమయ్య సంకీర్తనల్ని రెండు వర్గాలుగానే విభజించారు. ఒకటి శృంగారం, రెండోది వైరాగ్యం. శృంగారం ప్రత్యక్షంగా లేకుండా ఈ పాటలాగా ఆ స్వామి రూపాన్ని, గుణగణాల్ని కీర్తిస్తూ ఎన్నో పదాలు అన్నమయ్య రాశాడు - అవన్నీ కూడా శృంగార వర్గంలోకే పెట్టేశారు. ఈ రెండూ కాని వర్గం భక్తి అనో మరోటో పెట్టి ఉండాల్సింది.
సుజాత గారూ,కొత్తపాళీ గారూ,
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య సంకీర్తనలలో ఓ ఐదారు మాత్రమే వైరాగ్య(ఆధ్యాత్మ) సంకీర్తనలుగాను మిగిలిన అన్ని సంకీర్తనలు శృంగార సంకీర్తనలు గానే ప్రచురించబడ్డాయి. పై సంకీర్తన 5 వ సంపుటం అంటే శృంగార సంకీర్తనలలో మొదటి సంపుటం నుంచి గ్రహింప బడినది కాబట్టి అది శృంగార సంకీర్తనే.బహుశః ఈ విభాగం రేకులలో వ్రాయించిన లేక చెక్కించిన పెద తిరుమలయ్య, చిన తిరుమలయ్య లది అయివుంటుందని నా అనుకోలు. ఎందుకంటే ఆ రేకులలోనే ఈ విభజన వున్నదనుకుంటున్నాను. రేకుల సంఖ్యానిర్దేశం కూడా రేకులపైన ఉన్నదనుకుంటాను. దాన్నే పుస్తకాలు ప్రింటు చేసినప్పుడు అనుసరించారని నా భావన.
Post a Comment