సామంతం
పరుస మొక్క టేకాదా పయిఁడిగాఁ జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమీ. IIపల్లవిII
వనజనాభునిభక్తి వదలకుండినఁ జాలు
మనసు యెందు దిరిగినా మరియేమి
మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు
తనువెంతహేయమైనా దానికేమి. IIపరుసII
శ్రీ కాంతునామము జిహ్వఁ దగిలితే జాలు
యేకులజుఁడైనాను హీనమేమి
సాకారుఁడై నహరి శరణుచొచ్చినఁ జాలు
చేకొని పాపము లెన్ని చేసిననేమి. IIపరుసII
జీవుఁ డెట్టున్నా నేమి జీవునిలో యంతరాత్మ
శ్రీ వెంకటేశున కాచింతయేమి
యేవలనఁ బరమైన యిహమైన మాకుఁ జాలు
కై వశమాయ నతఁడు కడమలింకేమీ. IIపరుసII౧-౩౭౩
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
2 comments:
అయ్యా! సాయి మహిమ చిత్రంలో సినారె వ్రాసిన సాయిదేవ అనే ఈ గీతం లోని పాదాలను అవధరించండి.
’పాపులనైనా పునీతుల చేసే పావన మంత్రం నీ బోధ
పరుసవేదిని తాకిన లోహం పసిడి ఔను కాదా’
బాగుందండి.
Post a Comment