నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 3, 2009

దిక్కు లెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ

మాళవి
దిక్కు లెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ-
నెక్కడ చూచినఁ దానే యేఁగీ సేవించరో. IIపల్లవిII

అదివో శ్రీహరితేరు అదె గరుడధ్వజము
కదలేటి ఘనతురంగము లవిగో
పొదలుఁ బూదండ లవే పూఁచి వాఁగే ఘంటలవే
యెదుటఁ దిరువీధుల నేగీ సేవించరో. IIదిక్కుII

వారె అచ్చరలేమలు వారె మునులు రుషులు
వారక కొలిచే దేవతలు వారే
వీరే యనంతగరుడవిష్వక్సేనాదులు
యీరీతిఁ బ్రతాపాన నేఁగీ సేవించరో. IIదిక్కుII

వీఁడె శ్రీవేంకటేశుఁడు వీఁ డలమేల్మంగపతి
వీఁడె శంఖచక్రాదుల వెలసినాఁడు
పోఁడిమి వరములిచ్చీఁ బొసఁగ దాసులకెల్లా
యేఁడేఁడు దప్పకుండాను యేఁగి సేవించరో. IIదిక్కుII౩-౫౦౧

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks