నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 30, 2009

భావయామి గోపాలబాలం మన-

Get this widget | Track details | eSnips Social DNA

ధన్నాసి
భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేయం సదా IIపల్లవిఈఈ

కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా-
పటలనినదేన విభ్రాజమానం

కుటిలపదఘటితసంకుల శింజితే నతం

చతులనతనాసముజ్జ్వలవిలాసం. IIభావII

నిరతకరకలితనవనీతం బ్రహ్మాది-
సురనికరభావనాశోభితపదం

తిరువేంకటాచలస్థిత మనుపమం
హరిం
పరమపురుషం గోపాలబాలం. IIభావII
అన్నమయ్య సంకీర్తనలలో సాధారణంగా మూడేసి చరణాలు ఉంటాయి. కాని ఈ సంకీర్తనలో మాత్రం రెండు చరణాలు మాత్రమే ఉన్నాయెందుచేతనో. ఇది సంస్కృతభాషలో రచింపబడిన సంకీర్తన. అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.నాకు సంస్కృతభాషా పరిచయం బాగా తక్కువ.అయినా ఎలానో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.తప్పులను- పెద్దలు, తెలిసినవారూ- తెలియజేస్తే కృతజ్ఞుడిని. భావయామి=భావించుచున్నాను
గోపాలబాలం=బాలునిరూపంలో ఉన్న గోపాలుని

సదా
=ఎల్లప్పుడూ

మనస్సేవితం=మనస్సుతో సేవించబడుచున్న
తత్ పదం=ఆ గోపాలబాలుని పదములను
చింతయ ఇయం=నేను చింతనచేస్తున్నాను


కటి=కటిప్రదేశము(నడుము భాగము)నందు
ఘటిత=ఉంచబడిన
మేఖలా=వడ్డాణముయందు
ఖచితమణిఘంటికా=తాపడము చేయబడ్డ మణులఘంటలయొక్క
పటల=సమూహము
విభ్రాజమానం=ప్రకాశితమగుచున్నది.
కుటిలపదఘటిత=వంకరగానున్నపదములయందుంచబడిన

శింజితే నతం=మువ్వలచప్పుడు(?),శింజితానతం అని ఉండవచ్చేమో అంటూ ఏమైనా అర్థమంత సరిగా దోపదు అని అథోసూచికలో సూచించారు.

చటులనటనా=నటనలతో చలించున్న

సముజ్జ్వలవిలాసం=సముజ్జ్వలమైన విలాసముతో కూడుకున్నది

నిరత=మిక్కిలి ఆసక్తికొన్న

కరకలిత=అరచేతియందలి

నవనీతం=వెన్నపూస

బ్రహ్మాదిసురనికరభావనాశోభితపదం =బ్రహ్మదేవుడు మొదలుగాగల దేవతల సమూహము చేత
భావింపబడిన అందమైన పదములు
తిరువేంకటాచలస్థితమ్=శ్రీవేంకటాచలపర్వతమందున్న

అనుపమం హరిం=చక్కనివాడైన శ్రీహరిని

పరమపురుషం=పరమపురుషుడైన

గోపాలబాలం=గోపాలబాలునిని

భావయామి=భావించుచున్నాను.





1 comments:

భాను said...

చాలా బాగా చెప్పారు నరసింహ గారు.
ఈ పాటకి రెండే చరణాలు ఉన్నట్టు మీరు చెప్పే దాకా తట్టలేదు సుమండీ.ఆలోచిస్తుంటే ఇలా రెండు చరణాలే ఉన్న కీర్తన ఇంకొటి గుర్తొస్తుంది.
"పరమ పురుషా నిరుపమాన" అనే కీర్తనలో కూడా ఇలాగే రెండు చరణాలే ఉన్నాయి.
ఈ కీర్తనలో రెండో చరణంలో ఉన్న "కుటిల పదఘటిత" లో బాలగోపాలుని తప్పటడుగుల గురించి ప్రస్తావించినట్టుగా తోస్తుంది.
ఈ కీర్తన గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks