శంకరాభరణం
శరణన్న విభీషణుఁ గరుణఁ గాచినవాఁడు
పరికింపఁ దారకబ్రహ్మమా యీ రాముఁడు. IIపల్లవి
ఆలికై విల్లు విఱిచి వాలికై యమ్ము వేసిన-
వాలుమగఁటిమిగలవాఁడా వీఁడు
ఱాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి
యేలెను జటాయువును యీతఁడా రాముఁడు. IIశరII
మింటికట్లు దెగవేసి యంటి పగసాధించి
దంటరాకుమారుఁడు తా నీశూరుఁడా
బంటుగా వాయుజు నేలి నంటు సుగ్రీవుతోఁ జేసి
కంటకరావణవైరి ఘనుఁడా యీరాముఁడు. IIశరII
రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి
మైకొన్న జానకీరమణుఁ డితఁడా
యీకడ శ్రీవేంకటాద్రి నిరవై తాను నున్నాఁడు
దీకొన్న ప్రతాపపుఁదేవుఁడా యీరాముఁడు.IIశరII౨-౨౨౬
"మింటికట్లు దెగవేసి యంటి పగసాధించి
దంటరాకుమారుఁడు తా నీశూరుఁడా"---ఇది అర్థం కాలేదు. ఎవ్వరైనా తెలిస్తే చెప్పరూ--
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
0 comments:
Post a Comment