దేవగాంధారి
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ. IIవినII
ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీఛులనె విష్ణుకథ. IIవినII
వదలక వేదవ్యాసులు నుడిగిన-
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ. IIవినII
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకఁగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ. IIవినII౩-౩౫౫
Dec 27, 2008
వినరో భాగ్యము విష్ణుకథ
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment