నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 29, 2008

తానెంత బ్రదుకెంత దైవమా నీమాయ యెంత

సాళంగనాట
తానెంత బ్రదుకెంత దైవమా నీమాయ యెంత
మానవుల లంపటాలు మరి చెప్పగలదా. IIతానెంతII

చెలఁగి నేలఁ బారేటి చీమసహితమును
కలసి వూరకే పారుఁ గమ్మర నెందోమరలు
తలమోచి కాఁపురము ధాన్యములు గూడపెట్టు
యిల సంసారము దనకిఁక నెంతదలదో. IIతానెంతII

యేడో బాయిటఁ బారే యీఁగ సయితమును
వాడుదేర నడవుల వాలి వాలి
కూడపెట్టుఁ దేనెలు గొందుల బిల్లలఁబెట్టు
యేడకేడ సంసార మిఁక నెంతగలదో. IIతానెంతII

హెచ్చి గిజిగాండ్లుసయిత మెంతోగూఁడువెట్టు
తెచ్చి మిణుఁగురుఁబురువు దీపమువెట్టు
తచ్చి శ్రీవేంకటేశ నీదాసులు చూచి నగుదు-
రిచ్చలఁ దానిసంసార మిఁక నెంత గలదో. IIతానెంతII౩-౪౬౮


అన్నమయ్య ఈ సంకీర్తనలో మానవులు తమ తమ బ్రతుకులను నడిపించుకోడానికి పడే శ్రమములను-చీమ,యీఁగ,గిజిగాడు,మిణుగురు పురువు వంటివాటి శ్రమములతో పోల్చి చూపిస్తూ ఇవన్నీ చూచి శ్రీవేంకటేశ్వరునికి దాసులైనవారు నవ్వుకుంటారు అని చెపుతున్నాడు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks