దేసాళం
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ. IIపల్లవిII
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ
సరసవైభవరాయ సకలవినోదరాయ
వరవసంతములరాయ వనితలవిటరాయ
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ. IIతిరుII
గొల్లెతల వుద్దండరాయ గోపాల కృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లఁబరిమళరాయ
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ. IIతిరుII
సామసంగీతరాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్నుఁ గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుఁడ నీకు జయ శ్రీవేంకటరాయ. IIతిరుII ౨-౪౬౨
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
4 days ago
2 comments:
Shoba Raj gari pata pettalisindi. Very nice song. thanks.
ఈ స్నిప్స్ లో ఓ పాట వుంది కాని కంటిన్యూగా రావటంలేదు.యు ట్యూబ్ లో ట్రై చేసి చూస్తాను.
Post a Comment