నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 15, 2008

అన్నిటా శ్రీహరి దాసుడగువానికి

రామక్రియ
అన్నిటా శ్రీహరి దాసుడగువానికి
కొన్ని దైవములఁ గొలువఁగ దగునా. IIపల్లవిII

విహిత కర్మము సేసి వెదకేటిహరి నిట్టె
సహజమై కొలచేటిసరసునికి
గహనపుఁగర్మాలు కడమలైననేమి
మహిఁ గనకాద్రికి మరి పైఁడి వలెనా. IIఅన్నిII

పలుదానములకెల్ల బలమైనహరి నిట్టె
బలువుగఁ జేకొన్న భక్తునికిని
నెలకొని యాతఁ డన్నియునుఁ జేసినవాఁడె
తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా. IIఅన్నిII

వేదవేద్యుఁడు శ్రీవేంకటపతినామ-
మాదిగాఁ బఠియించే యధికునికి
ఆదైన చదువులు అఱచేతి వతనికి
మేదినిఁ దిరుగాడ మెట్లు వలెనా. IIఅన్నిII౨-౬౮

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks