సామంతం
వలపువో కారణము వైభవంబులకుఁ దమ
తలఁ పువో సకలంబుఁ దగులు సేసినది। IIపల్లవిII
చూపువో ప్రియములకుఁ జోటుసేసినది తరి
తీపువో వెడయాస దీరనీయనిది
రూపువో సౌఖ్యంబు రుచిసేసినది పువ్వుఁ
దూపువో హృదయంబు దూరిపాఱినది। IIవలపుII
ఒరపువో పెడఁబాసి వుండనియ్యనిది తమ
వెఱపువో దేహంబు వెచ్చఁజేసినది
మఱపువో ధైర్యంబు మానిపించినది కను
గిఱుపువో సిగ్గెలఁ గ్రిందుపఱిచినది। IIవలపుII
చెలిమివో కారణము శ్రీవేంకటేశుకృప
కలిమినో మచ్చికలు కలుగఁజేసినది
ఎలమివో యీపొందు లితవు సేసినది మరు
బలిమివో కోరికలఁ బట్టి తెచ్చినది। IIవలపుII ౬-౧౫౯
Jul 12, 2008
వలపువో కారణము వైభవంబులకుఁ దమ
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment