సామంతం
తార వలచినయపుడె తరుణిరతుల
తారసము లెట్లుండు తగవు లెట్లుండు. IIపల్లవిII
తరితీపు లెట్లుండు తాలుము లెట్లుండు
గరువంబు లెట్లుండు కసరు లెట్లుండు
పొరపొచ్చెమెట్లుండు పొలయలుక లెట్లుండు
నెరవరిక లెట్లుండు నెఱుక లెట్లుండు। IIతారII
ఓపికలు నెట్లుండు నొల్లములు నెట్లుండు
చూపోప మెట్లుండు సొలపు లెట్లుండు
దాఁపరము లెట్లుండు తగుమాన మెట్లుండు
కోపంబు లెట్లుండు కొఱత లెట్లుండు। IIతారII
సిరిదొలఁకు లెట్లుండు శేషాద్రిపతికరుణ
కిరవైన సతిమనసు నెపుడు నెట్లుండు
మురిపమది యెట్లుండు ముద్దుఁజనుఁగవమీఁద
నరచందురుని రేక లపుడెట్టులుండు। ౬-౨౭
Jul 12, 2008
తార వలచినయపుడె తరుణిరతుల
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment