నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 8, 2014

వర్ణన రత్నాకరము - సవతుల కయ్యము -కళాపూర్ణోదయము (పింగళి సూరన)

 వర్ణన రత్నాకరము - సవతుల కయ్యము -కళాపూర్ణోదయము (పింగళి సూరన)

సీ.
ఒట్టు సుమీ యన్న నొట్టు సుమీ యంచు, నేమేమి యనిని నేమేమి యనుచుఁ
గానీ గదే యన్న గానీ గదే యంచు, నింకేల యనిన నింకేల యనుచు
నోసి పోవే యన్న నోసి పోవే యంచు, నౌ నంటి ననిన నౌ నంటి ననుచు
మఱవకు మిది యన్న మఱవకు మిది యంచు, నీ వెంత యనిన నీ వెంత యనుచు
గీ.
నొకతె మగనికి నాసించు టొప్పదనిన, నొకతె మగనికి నాసించు టొప్పుదనుచున్
బట్టి యాడె నా రంభ తోఁ బ్రథమ రంభ, ప్రియుఁడు నిలుమన్న నిలువక పెద్ద రొదగ.
                                                     కళాపూర్ణోదయము - పింగళి సూరన -అధ్యా 4, పద్య 191
 
మంచి కథ, చదివి తీరాల్సిన పుస్తకం. దీనిని చదివాను.

0 comments

Feb 7, 2014

వర్ణన రత్నాకరము - ఆశీర్వచనము - హంసవింశతి

వర్ణన రత్నాకరము - ఆశీర్వచనము - హంసవింశతి

సీ.
శ్రీరస్తు శుభమస్తు ధీరస్తు విజయోస్తు, పుత్రరంజనమస్తు పుణ్యమస్తు
ధనమస్తు ధాన్యమస్త్వ నవద్య సుఖమస్తు, చిరతర సంకల్ప సిద్ధిరస్తు
సత్యమస్తు మహోస్తు శౌర్యమస్తు యశోస్తు, స్వస్త్వస్తు సుగుణోస్తు శక్తిరస్తు
సామ్రాజ్యమస్తు శాశ్వతధర్మ ఫలమస్తు, వృద్ధిరస్తు మహా ప్రసిద్ధిరస్తు
గీ.
జ్ఞానమస్తు శ్రీయఃపతి ధ్యానమస్తు, గురు చరణ భక్తి రస్తు సత్కుశలమస్తు
శాంతిరస్తు నిరంతరైశ్వర్యమస్తు, భాగ్యమస్తు మహా సౌర్వభౌమ నీకు.

హంసవింశతి -అయ్యలరాజు నారాయణామాత్యుడు -అ 1, పద్య 47.

0 comments

Feb 6, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - ఉత్తర రామాయణము

వర్ణన రత్నాకరము -  స్త్రీ వర్ణనము - ఉత్తర రామాయణము 

సీ.
మించి దృష్టికి మిఱుమిట్లు గొల్పెడు నిది, తెలియఁ గారు మెఱుంగుఁ దీగ  యే మొ
కార్మెఱుంగునకిట్టి కళ గలదే యిది, సొబగైన వెన్నెల సోగ యే మొ
వెన్నెల సోగకీ చిన్నె లున్నవె యిది, మరుని రాచిల్క సాంబ్రాణి యే మొ
చిలుక సాంబ్రాణి కిఁ జెలువంపు నడలుండు, నా యిది కలికి రాయంచ యే మొ
గీ.
కలికి రాయంచ కీ సోయగంబు గలదె,యె మ్మె గలదిది జాళువా బొమ్మ యే మొ
జాళువా బొమ్మ కీ విలాసములు గలవె, మెచ్చ నగు నచ్చరవెలంది మిన్న యే మొ.

ఉత్తర రామాయణము - అ.4, పద్య 189 (కంకంటి పాపరాజు)

  

0 comments

వర్ణన రత్నాకరము - విరహి - భాస్కరరామాయణము

వర్ణన రత్నాకరము  - విరహి - భాస్కరరామాయణము
శా.
ఏ మెట్టీయది మెట్టుగా దిది వనం బే రాకుమారుండనో
సౌమిత్రీ విను నీవు రాముఁడవె వత్సా నిక్క మే రాముఁడన్
భూమీశుండవు రామచంద్రుఁడవు హా భూమీజ చంద్రాననా
యేమే యెక్కడ నున్న దాన విట రావే యుల్ల మల్లా డెడిన్.
శా.
ఈ తిగ్మాంశుఁడు నేపఁ జొచ్చె నను రే యేనాఁట నర్కాస్పదం
బీతం డిందుఁ డె యౌనొ లక్ష్మణుఁడ నీ కేమౌదు నేఁ జెప్పుమా
నా తోఁబుట్టవు గావె నాథ మఱి యే నాథుండ నిక్కంబుగా
సీతానాథుఁడ నెందు వోయితివె యో సీతా మనో వల్లభా.
చ.
తపనుఁడు వేపఁ జొచ్చె ననుఁ దమ్ముఁడ వృక్షముక్రిందఁ బెట్టు నా
దపనుఁడు రేయి లేఁడు వసుధావర చంద్రుఁడు గాని చంద్రునిన్
నృప సుత యెట్లెఱింగితివి నీవు మృగాంకము చూడ నున్కి హా
చపలమృగాక్షి చంద్రముఖి జానకి యెక్కడ నున్నదానవే.
సీ.
తాళంబ కానవే తాళఫల స్తనిఁ, గుందంబ కానవే కుందరదన
దిలకంబ కానవే తిలకరమ్యలలాటఁ, గమలంబ కానవే కమలవదన
హరిణంబ కానవే హరిణబాలేక్షణ, సింహంబ కానవే సింహమధ్యఁ
బిక రాజ కానవే పికమంజులస్వనఁ, గీరంబ కానవే కీరవాణి
గీ.
లలిత కలభంబ కానవే కలభగమన, బంధుజీవమ కావవే బంధుజీవ
మైన జనకనందన సీత ననుచు రాముఁ డచట నచట నీగతి వాని నడిగి యడిగి.
సీ.
అదె చలత్తన్వంగి యనుచు నల్లనఁ జేర, నది చూతలతయైన నట్ల నిలుచు
నదె మంజులాలాప యనుచు నల్లనఁ జేర, నది కోకిలంబైన నట్ల నిలుచు
నదె లోలలోచన యనుచు నల్లన జేర, నది కురంగంబైన నట్ల నిలుచు
నదె నీలకుంతల యనుచు నల్లనఁ జేర, నది మయూరంబైన నట్ల నిలుచు
ఆ.వె.
నదె మహీజ నన్ను నచటికై చేసన్న, చేసె ననుచు నల్లఁ జేర నదియు
లలిత మలయ పవన చలితపల్లవ మైన, నట్ల నిలుచు రాముఁ డచట నచట.
                                                       భాస్కర రామాయణము, ఆర, పద్య 258,260,261,262,265.275. 
మెట్టు =కొండ, తిగ్మాంశుఁడు =సూర్యుడు (అతనికున్న 430 పేర్లలో ఇది 66వ పేరు,(తెలుగు పర్యయపద నిఘంటువు), తపనుడు =సూర్యుడు, మృగాంకము =కర్పూరము, కుందము=మొల్లపుష్పము, కలభము=ఏనుగు గున్న(30 సం.), బంధుజీవము=మంకెన, చూతము =మామిడి.          

0 comments

Feb 5, 2014

వర్ణన రత్నాకరము - హంశవింశతి - రాగ విశేషములు

వర్ణన రత్నాకరము - హంశవింశతి - రాగ విశేషములు
సీ.
భైరవి మాళవి బంగాళ హిందోళ, రాజమంజరియు శ్రీరాగ గౌళ
భూపాళ లెన్మిది పురుషరాగంబులు, దేశాక్షి ఘూర్జరి దేశి తోడి
దేవక్రి యాందోళి దేవగాంధారియు, గౌళ గుండక్రియా హారి సలలి
త బిలహరి కురంజి ధన్యాశి పూర్ణగౌళ వరాళి నాట భల్లాతకి మల
గీ.
హరులు సారంగ రామక్రియలు ననంగఁ, గన్నడ యనంగ మంగళకౌశిక యన
వెలయు నారాయణియుఁ జతుర్వింశతి విధ,ములను దనరారు స్త్రీరాగములను మఱియు.

సీ.
కాంభోజి కేదారగౌళ శోకవరాళి, పున్నాగ గుమ్మకాంభోజి శంక
రాభరణము మేఘరంజి తోడివరాళి, నాదనామక్రియ నాట రీతి
గౌళ రామక్రియ మేళరామక్రియ, గౌళనారాయణగౌళ మధ్య
మావతియు ముఖారిమలహరి సామంత, పంతువరాళియు బాళిరాగ

గీ.
చెంచుమలహరి దేశాక్షి శ్రీవరాళి, మాళవియుఁ బాండిసింధురామక్రియయు వ
సంత సామంత శుద్ధవసంత గుబ్జ, రియును హేజిజ్జ్వినీలాంబరియు ననంగ
గీ.
పొసఁగ ముప్పది రెండు నపుంసకములు, మాళవశ్రీయనంగను మలహరి యన
దేవమలహరి రేగుప్తి దిరముకుంద, మలహ రన నైదు మిత్ర లీ మర్మ మరసి.

                                                                                      హంసవింశతి, అ 5, పద్య 123,124,125.

నాకు సంగీతం గుఱించి ఏ మాత్రం కూడా తెలియదు. అందుచేత నేను వ్రాయటంలో తప్పులు దొర్లి ఉంటాయి. ఎవరైనా తెలియపరిస్తే దిద్దుకుంటాను.

ఈ వర్ణన రత్నాకరం నుండి పద్యాలను నేను ఎందుకు ఎత్తి వ్రాస్తున్నాను? నా ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు నాలో మెదిలాయి. ఎందుకంటే --ఎందుకంటే--- నాకు తోచిన సమాధానం - - తెలుగు నేర్చుకోవటానికి, మఱియు  పూర్వ గ్రంథాలలోని అపూర్వఆణిముత్యాలను ఏర్చి కూర్చి నలుగురితో పంచుకొని ఆనందించటానికి - - అనే సమాధానం నాకు తోచింది. సరే  బావుంది, కాని ఈ పద్యాలు సరిగా అర్థంకావటం లేదు కదా -- అనే సందేహం -- ఎవరైనా పెద్దలు అర్థ వివరణ చేస్తారేమో అనే దురాశ ఒకటి. ఎవరైనా నీకు ఎందుకు అర్థవివరణ వ్రాసి సహాయపడాలి? మళ్ళీ ఓ ప్రశ్న. అవును నిజం. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదా! మరైతే ఎలా? సమాధానం తోచింది. ఎవరికి వారే ఓ గురువుగా ఎందుకు మారకూడదు? ఎలా ?? మన కలన యంత్రాల్లో ఆంధ్రభారతి వంటి నిఘంటువుల సహాయంతో అర్థాలు తెలుసుకొనే ప్రయత్నం చేయొచ్చు కదా! అవును అదే సరియైన పద్ధతి. శ్రమ పడి అర్థ తాత్పర్యాలను సాధించగలిగితే కలిగే ఆ ఆనందమే వేఱు. దానికోసమైనా ప్రయత్నం చెయ్యాలి కదా అని అనిపించి మనస్సుకు స్వాస్థ్యత చిక్కింది.

0 comments

Feb 4, 2014

వర్ణన రత్నాకరము పుర వర్ణనము నిరంకుశోపాఖ్యానము

వర్ణన రత్నాకరము  పుర వర్ణనము నిరంకుశోపాఖ్యానము
సీ.
కమలాకరము లౌటఁ గమలాకరములౌట, జలజాప్త విస్ఫూర్తి తెలియఁ బడక
రాజమండలమౌట రాజమండలమౌటఁ, గువలయ ప్రియవృత్తి వివర పడక
మాణిక్య చయమౌట మాణిక్యచయమౌటఁ, గ్రొత్త డాలు సెలంగ గుఱుతు పడక
యమరదీర్ఘిక లౌట నమర దీర్ఘిక లౌట, ఘన సువర్ణాబ్జత గానఁ బడక

గీ.
గోపురము లౌట మణిమయ గోపురంబు, లౌట గురుసమున్నతి మెయిఁ దేట పడక
ద్వాపరంబున విలసిల్లు ద్వాపరంబు, గరిమఁ దనరారు మాణిక్య పురవరంబు.
                                               
                                                                            నిరంకుశోపాఖ్యానము అ 1, పద్య 43. 

0 comments

వర్ణన రత్నాకరము పుర వర్ణన మొల్ల రామాయణము

వర్ణన రత్నాకరము   పుర వర్ణన మొల్ల రామాయణము
సీ.
మదనాగ యూథ సమగ్ర దేశము గాని, కుటిల వర్తన శేష కులము గాదు
అహవోర్వీ జయ హరినివాసము గాని, కీశ సముత్క రాంకితము గాదు
సుందర స్యందన మందిరం బగుఁ గాని, సంతత మంజుళాశ్రమము గాదు
మోహన గణికా సమూహ గేయము గాని, యూథికా నికర సంయుతము గాదు
గీ.
సరస సత్పుణ్య జన నివాసమ్ము గాని, కఠిన నిర్దయ దైత్య సంఘమ్ము గాదు
కాదు కాదని కొనియాడఁ గలిగినట్టి, పురవరాగ్రమ్ము సాకేతపుర వరమ్ము.

                                                             మొల్ల రామాయణము , బాల కాండము పద్య 2

మొల్లరామాయణ మనగానే నాకు గుర్తుకు వచ్చే పద్యం " కదలకుమీ ధరాతలమ "

0 comments

వర్ణన రత్నాకరము పుర వర్ణనము ప్రభావతీ ప్రద్యుమ్నము

వర్ణన రత్నాకరము  పుర వర్ణనము  ప్రభావతీ ప్రద్యుమ్నము

సీ.
ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నీటి, మొలనూలి రత్నంపు మొగ పనంగ
జలధి పేరిటి పాప తలచుట్టు గల ధరి, త్రీ మూర్తి శివు చిత్ర తిలక మనఁగ
నపర దిక్సతి కట్టినట్టి సాగరమను, పుట్టంపుఁ దుది వ్రాఁత మొగడ యనఁగ
వరుణ గోపుర బద్ధ వార్ధి తోరణ మధ్య, గుంభిత నవ పుష్ప గుచ్ఛ మనఁగ
గీ.
వివిధ మణిమయ గృహదీప్తి విసర విసర, ణోప శోభిత మగు ద్వారకా పురంబు
దవులఁ గాన్పించెఁ దనుఁ జూడ దైవ విభుఁడు, వేయి కన్నులుఁ జాలక వెఱఁగు పడఁగ.

                                                              ప్రభావతీ ప్రద్యుమ్నము అ 1, పద్య 54 

మొగడు = ఇంటి నడికొప్పు

0 comments

వర్ణన రత్నారము - పుర వర్ణనము - తపతీ సంవరణోపాఖ్యానము

వర్ణన రత్నారము -పుర వర్ణనము - తపతీ సంవరణోపాఖ్యానము
సీ.
శ్రీభావిశేషమి శ్రీభావిభవనంబు, సారస కలిత కాసారసమితి
ప్రాకార వజ్ర దీప్రాకార హర్మ్యంబు, కుంజ రంజిత భద్ర కుంజరంబు
రమణీయతా వాస రమణీయుత విలాసి, కాంచన సౌధాధి కాంచనంబు
రాజహంస కులీన రాజహంస కులంబు, బంధురమ్య గృహస్థ బంధురంబు
గీ.
కల్పకానల్ప శోభనా కల్పకంబు, గోపుర ద్వార చుంబిత గోపురంబు
సింధుజన్మాశ్వ దేశీయ సింధుజంబు, గజపురం బొప్పు జితమరు ద్గజపురంబు.

                                                           తపతీ సంవరణోపాఖ్యానము అ 1, పద్య 43   


0 comments

Feb 3, 2014

వర్ణన రత్నాకరము - పుర వర్ణనము - విక్రమార్క చరిత్రము

వర్ణన రత్నాకరము - పుర వర్ణనము - విక్రమార్క చరిత్రము

సీ.
శ్రీకలితా నూన చిత్ర రేఖా యుక్తి

                గొమ్మలందును గోట కొమ్మలందు

నవరస పదయుక్తి నానార్థ గరిమంబు

                 రాజులందును గవి రాజులందు

గవిలోక సంతోషకర జీవన స్థితి

                  సరసులందును గేళి సరసులందు

నవ నవ శ్రీ సుమనః ప్రవాళ విభూతి

                   మావులందును నెలమావులందు

గీ.

గలిగి సముదగ్ర సౌధాగ్రతల సమగ్ర

శాతకుంభ మహాకుంభ జాతగుంభి

తోరు రత్న వినూత్న శృంగార మగుచు

సిరుల నొప్పారు విక్రమ సింహపురము.


                                   జక్కన కవి  -- విక్రమార్క చరిత్రము  - అ.7, పద్య 133

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks