నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 6, 2014

వర్ణన రత్నాకరము - విరహి - భాస్కరరామాయణము

వర్ణన రత్నాకరము  - విరహి - భాస్కరరామాయణము
శా.
ఏ మెట్టీయది మెట్టుగా దిది వనం బే రాకుమారుండనో
సౌమిత్రీ విను నీవు రాముఁడవె వత్సా నిక్క మే రాముఁడన్
భూమీశుండవు రామచంద్రుఁడవు హా భూమీజ చంద్రాననా
యేమే యెక్కడ నున్న దాన విట రావే యుల్ల మల్లా డెడిన్.
శా.
ఈ తిగ్మాంశుఁడు నేపఁ జొచ్చె నను రే యేనాఁట నర్కాస్పదం
బీతం డిందుఁ డె యౌనొ లక్ష్మణుఁడ నీ కేమౌదు నేఁ జెప్పుమా
నా తోఁబుట్టవు గావె నాథ మఱి యే నాథుండ నిక్కంబుగా
సీతానాథుఁడ నెందు వోయితివె యో సీతా మనో వల్లభా.
చ.
తపనుఁడు వేపఁ జొచ్చె ననుఁ దమ్ముఁడ వృక్షముక్రిందఁ బెట్టు నా
దపనుఁడు రేయి లేఁడు వసుధావర చంద్రుఁడు గాని చంద్రునిన్
నృప సుత యెట్లెఱింగితివి నీవు మృగాంకము చూడ నున్కి హా
చపలమృగాక్షి చంద్రముఖి జానకి యెక్కడ నున్నదానవే.
సీ.
తాళంబ కానవే తాళఫల స్తనిఁ, గుందంబ కానవే కుందరదన
దిలకంబ కానవే తిలకరమ్యలలాటఁ, గమలంబ కానవే కమలవదన
హరిణంబ కానవే హరిణబాలేక్షణ, సింహంబ కానవే సింహమధ్యఁ
బిక రాజ కానవే పికమంజులస్వనఁ, గీరంబ కానవే కీరవాణి
గీ.
లలిత కలభంబ కానవే కలభగమన, బంధుజీవమ కావవే బంధుజీవ
మైన జనకనందన సీత ననుచు రాముఁ డచట నచట నీగతి వాని నడిగి యడిగి.
సీ.
అదె చలత్తన్వంగి యనుచు నల్లనఁ జేర, నది చూతలతయైన నట్ల నిలుచు
నదె మంజులాలాప యనుచు నల్లనఁ జేర, నది కోకిలంబైన నట్ల నిలుచు
నదె లోలలోచన యనుచు నల్లన జేర, నది కురంగంబైన నట్ల నిలుచు
నదె నీలకుంతల యనుచు నల్లనఁ జేర, నది మయూరంబైన నట్ల నిలుచు
ఆ.వె.
నదె మహీజ నన్ను నచటికై చేసన్న, చేసె ననుచు నల్లఁ జేర నదియు
లలిత మలయ పవన చలితపల్లవ మైన, నట్ల నిలుచు రాముఁ డచట నచట.
                                                       భాస్కర రామాయణము, ఆర, పద్య 258,260,261,262,265.275. 
మెట్టు =కొండ, తిగ్మాంశుఁడు =సూర్యుడు (అతనికున్న 430 పేర్లలో ఇది 66వ పేరు,(తెలుగు పర్యయపద నిఘంటువు), తపనుడు =సూర్యుడు, మృగాంకము =కర్పూరము, కుందము=మొల్లపుష్పము, కలభము=ఏనుగు గున్న(30 సం.), బంధుజీవము=మంకెన, చూతము =మామిడి.          

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks