వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - ఉత్తర రామాయణము
సీ.
మించి దృష్టికి మిఱుమిట్లు గొల్పెడు నిది, తెలియఁ గారు మెఱుంగుఁ దీగ యే మొ
కార్మెఱుంగునకిట్టి కళ గలదే యిది, సొబగైన వెన్నెల సోగ యే మొవెన్నెల సోగకీ చిన్నె లున్నవె యిది, మరుని రాచిల్క సాంబ్రాణి యే మొ
చిలుక సాంబ్రాణి కిఁ జెలువంపు నడలుండు, నా యిది కలికి రాయంచ యే మొ
గీ.
కలికి రాయంచ కీ సోయగంబు గలదె,యె మ్మె గలదిది జాళువా బొమ్మ యే మొ
జాళువా బొమ్మ కీ విలాసములు గలవె, మెచ్చ నగు నచ్చరవెలంది మిన్న యే మొ.
ఉత్తర రామాయణము - అ.4, పద్య 189 (కంకంటి పాపరాజు)
0 comments:
Post a Comment